For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

April Fools Day 2023: నవ్వండి.. నవ్వించండి.. అయితే ఇది ఎప్పుడు.. ఎక్కడ..పుట్టిందో తెలుసా?

|

''నవ్వడం యోగం.. నవ్వలేకపోవడం రోగం.. నవ్వించడం ఒక భోగం..'' సంవత్సరంలో కనీసం ఈ ఒక్కరోజైనా మనం నవ్వడం అనేది మన ఆరోగ్యానికి.. మనం సంతోషంగా ఉండటం అవసరం. కానీ దీనిని సానుకూల దినచర్యగా చేసుకోవాలి. ఒకవేళ మనం నవ్వడం వంటి వాటిని మరచిపోయినట్లయితే కనీసం సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసేందుకు ఏప్రిల్ ఫూల్ డే రెడీగా ఉంటుంది.

April Fools Day 2023: Why The Day Is Celebrated

అయితే ఏప్రిల్ ఫూల్స్ డే ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుట్టింది అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఇందుకు సంబంధించిన అనేక ఇతిహాసాలు ఉన్నాయి. జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ వరకు ఎన్నో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిదేశాలలో నూతన సంవత్సర వేడుకలను జనవరి నుండి ఏప్రిల్ వరకు జరుపుకుంటారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన అందరినీ వెర్రివాళ్లుగా చేసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వివిధ దేశాల్లో దీన్ని ఓ సరదా పండుగలా జరుపుకోవడం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తోంది. మీ ప్రియమైన వారిని, స్నేహితులను, బంధువులను, సన్నిహితులను సరదాగా ఆటపట్టించే ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందన్న విషయం అతికొద్ది మందికే తెలుసు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాత క్యాలెండర్ స్థానంలో..

పాత క్యాలెండర్ స్థానంలో..

ఫ్రాన్సులో 11వ పోప్ చార్లెస్ పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1582 నుండి కొత్త సంవత్సరాన్ని జనవరి నుండి చేసుకోవడం అమల్లో ఉంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఫ్రాన్సులోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారు. అయితే ఈరోజు శుభాకాంక్షలు తెలిపేవారిని వెర్రివాళ్లుగా ఎగతాళి చేసేవారు.

వినూత్నంగా..

వినూత్నంగా..

ఇటలీ, బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడాల్లో ఫ్రెంచ్ దేశస్తులు వినూత్న వినూత్న విధానంలో ఏప్రిల్ ఫూల్స్ డే ను నిర్వహించేవారు. వారు అయితే తమ పక్కనున్న వ్యక్తికి తెలియకుండా వారి వెనుక భాగంలో అంటే వీపు మీద ఓ కాగితం అతికించేవారు. అందులో ‘ఐయామ్ ఫూల్‘ వంటి వాటిని రాసి సరదాగా ఆట పట్టించేవారు.

సరదాగా ఉండేందుకు

సరదాగా ఉండేందుకు

మన విశ్వంలో ఉన్న సంప్రదాయాలలో ప్రతి ఒక్కరు అన్ని చింతల నుండి కాస్త ఉపశమనం పొందేందుకు, ఉల్లాసంగా మరియు సరదాగా ఉండేందుకు ఒక రోజును కేటాయించారు. అదే ఏప్రిల్ 1వ తేదీ అని చాలా మంది భావిస్తారు.

ఇతర చోట్ల..

ఇతర చోట్ల..

స్పానిష్ దేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే రోజున డే ఆఫ్ హోలీ ఇన్నోసెంట్స్ అనే పండుగగా జరుపుకుంటారు. అదే డెన్మార్క్ దేశంలో అయితే మే 1వ తేదీన ఫూల్స్ డే జరుపుకుంటారు. వారు మైజ్ కట్ అని కూడా పిలుస్తారు. అదే ఇరాన్ లో అయితే ఫూల్స్ డే ను సిజదా బెదర్ అనే పేరుతో జరుపుకుంటారు. ఆ దేశంలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమైన 13వ రోజున దీన్ని జరుపుకుంటారు.

హాయిగా నవ్వేందుకు..

హాయిగా నవ్వేందుకు..

ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో చాలా మందికి మనసారా హాయిగా నవ్వేందుకు కూడా సమయం కూడా లేకుండా పోయింది. అందుకే చాలా మంది నవ్వు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయితే వైద్యులు నవ్వు కోసం కొన్ని ఫన్నీ కార్టూన్లను చూడమని సూచిస్తారు. ఇది మనలోకి శక్తి పెంచుతుందని చెబుతుంటారు. అంతేకాదు సంతోషకరమైన హార్మోన్లను కూడా ప్రేరేపిస్తుంది. అంతేకాదు మన జీవితంలో హాస్యం అనే దానిని కచ్చితంగా భిన్నమైన కోణంలో చూడటానికి సహాయపడుతుంది. మన తోటి వారితో బంధం ఏర్పరచుకునేందుకు కూడా సహాయపడుతుంది. ఏదైనా గుంపులో ఇతరులతో నవ్వడం వల్ల సామాజిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. అయితే సరదా పేరిట ఇతరులకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించకండి. ఇది కొంత అసౌకర్యానికి గుర్తు చేస్తుంది. అందుకే మనసారా హాయిగా నవ్వుదాం.. ఈ సందర్భంగా జంధ్యాల గారు చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ‘‘నవ్వకపోవడం ఒక రోగం..

FAQ's
  • ఏప్రిల్ ఫూల్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది?

    ఫ్రాన్సులో 11వ పోప్ చార్లెస్ పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1582 నుండి కొత్త సంవత్సరాన్ని జనవరి నుండి చేసుకోవడం అమల్లో ఉంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఫ్రాన్సులోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారు. అయితే ఈరోజు శుభాకాంక్షలు తెలిపేవారిని వెర్రివాళ్లుగా ఎగతాళి చూసేవారు.

English summary

April Fools' Day 2023: Why The Day Is Celebrated

Do you know when April Fools Day started? To know this and much more read ahead.
Desktop Bottom Promotion