Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
Arati Saha Birth Anniversary : ఆరతి సాహాకు గూగుల్ ప్రత్యేక డూడుల్ తో గొప్ప గౌరవం...
భారతదేశం తరపున బ్రిటన్ లో జిబ్రాల్టర్ జలసంధిన తొలి మహిళ ఆరతి సాహా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మన దేశానికి చెందిన బెంగాలీ మహిళ.. స్విమ్మర్ ఆరతి సాహాను గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ తో అభినందించింది. పద్మశ్రీ సాధించిన మహిళల్లో ఈమెనే తొలి వరుసలో నిలవడం చాలా గొప్ప విషయం. ఈమె ఇదొక్కటే కాదు.. ఇంకా ఎన్నో ఘనతలు సాధించింది. బ్రిటీష్ వారి ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదిన తొలి ఆసియా మహిళగా రికార్డు నెలకొల్పింది. అంత గొప్ప రికార్డులు సాధించిన ఈమె పుట్టినరోజు ఈరోజు(సెప్టెంబర్ 24వ తేదీ). ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఆరతి సాహా 1940 సంవత్సరం, సెప్టెంబర్ 24వ తేదీన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కత్తాలో జన్మించారు. ఈమె నాలుగో ఏటనే హుగ్లీ నదిలో ఈత కొట్టడం నేర్చుకున్నారు. ఆ తర్వాత భారతదేశంలోని ఉత్తమ స్విమ్మర్లలో ఒకరైన సచిన్ నాగ్ దగ్గర స్విమ్మింగులో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాతి ఏడాదే అంటే ఐదో ఏటనే ఆరతి సాహా తొలి స్వర్ణపతాకాన్ని సాధించారు.
ఆమె 11వ సంవత్సరం వచ్చేలోపు ఎన్నో ఘనతలను సాధించారు. 12వ సంవత్సరాలున్నప్పుడు 1952లో హెల్సింకిలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ లో కూడా పాల్గొన్నారు. అనంతరం 18వ సంవత్సరాలు వచ్చాక ఆమె ఇంగ్లీష్ ఛానెల్ లో స్విమ్మింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే తొలి ప్రయత్నంలో ఆమె విఫలమయ్యారు. కానీ రెండో సారి మాత్రం పట్టుదలతో కష్టపడి విజయం సాధించారు. అలా భారతదేశం తరపునే కాదు ఆసియాలోనే ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. మొత్తం 67.5 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటల 20 నిమిషాల్లోనే ఈదడం గమనార్హం.
మరోవైపు ఈమెను స్మరించుకుంటూ గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్ లో సాహా ఇంగ్లీష్ ఛానెల్ ను ఎలా ఈదేశారో తెలిసేలా తయారు చేశారు. దీన్ని కూడా కోల్ కత్తాకు చెందిన ఆర్టిస్ట్ లావణ్య నాయుడు రూపొందించారు. తను సాహా గురించి వివరిస్తూ.. మన దేశం గర్వించదగ్గ మహిళల్లో ఈమె ఒకరని తెలిపారు. మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్టు 'పెద్ద కలలను కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే విషయాలకు ఈమెను స్ఫూర్తిగా చెప్పొచ్చని వివరించారు.



Click it and Unblock the Notifications
