Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ఆరుద్రలో సూర్యుడి రవాణా.. ఈ ప్రభావంతో దేశంలో వర్షపాతంపై ఎలాంటి ప్రభావమంటే...
సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించే సమయంలో రుతుపవనాల కదలిక ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు ఉంటాయని పండితులు చెబుతారు. వీటిలో ఆరుద్ర నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నక్షత్రంలోకి సూర్యుడు భారత కాలమానం ప్రకారం జూన్ 22వ తేదీ ఉదయం 5:38 గంటలకు ప్రవేశించాడు.

ఈ సమయంలో నైరుతి రుతుపవనాలను అంచనా వేయడమే ఇందుకు కారణం. పూర్వకాలం నుండి ఈ విధంగా రుతుపవనాల దిశలను అంచనా వేస్తున్నారు. సూర్యుడు ఆరుద్రంలోకి ప్రవేశించిన సమయంలోనే వర్షాకాలం ప్రారంభమవుతుందని, వర్షం, పంటల గురించి అంచనా వేయొచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతారు.

ఈ సందర్భంగా ఈ ఏడాది మన దేశంలో వర్షపాతం ఎలా కురిసే అవకాశం ఉంటుంది.. వర్షాలు సాధారణంగా కురుస్తాయా? లేదా అసాధారణంగా కురుస్తాయా? అన్నదాతలకు లాభమొస్తుందా.. నష్టమొస్తుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సూర్యోదయం జరగలేదు..
సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన సమయంలో మన దేశంలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సూర్యుడు ఉదయించలేదు. అందుకే ఈ ప్రాంతాల్లో చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ చంద్ర గ్రహం వల్ల రైతులకు శుభప్రదంగా ఉంటుంది. అక్కడే మంచి వర్షం కురుస్తుంది.

అసాధారణ వర్షాలు..
మరోవైపు మన దేశంలోని తూర్పు ప్రాంతాలైన బీహార్, ఝార్ఖండ్, అస్సాంతో పాటు మధ్య ప్రాంతాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో అంగారకుడు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఆసాధారణ వర్షాలు కురుస్తాయని పండితులు చెబుతున్నారు. దీంతో ఎక్కువ నష్టం జరగొచ్చు. ఈ అంగారకు జులై 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడు.

వర్షం తగ్గొచ్చు..
సూర్యుడు ఆరుద్రంలోకి ప్రవేశించే సమయంలో మిధున లగ్నం అధిరోహణంగా ఉంటుంది. ఇందులో సూర్యుడు, శుక్రుడు ఉండటం వల్ల ప్రారంభంలో మంచి వర్షం కురుస్తుంది. కానీ సూర్యుడు ఎప్పుడైతే అంగారకంలో అడుగు పెడతాడో అప్పుడు వర్షపాతం తగ్గుతుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో వర్షం తగ్గొచ్చు.

సంపద కోల్పోవచ్చు..
అంగారకుడు ఆరుద్ర నక్షత్రంలోకి రెండో పాదంలో ప్రవేశించి శని అష్టమ స్థానంలో సంసప్తక్ యోగాను చేసే సమయంలో అసాధారణ వర్షాలు కురుస్తాయి. దీంతో చాలా మంది ప్రజలకు ధన, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్ వంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం కావొచ్చు.

సాధారణ వర్షపాతం..
మకర రాశి వల్ల ప్రభావితమయ్యే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి వర్షపాతం సాధారణంగా ఉంటుంది. మకర రాశిలో శని తిరోగమనం వల్ల వర్షకాలమంతా ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

రైతులకు మేలు..
మరోవైపు చంద్ర గ్రహం కారణంగా మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో మంచి వర్షాలు కురుస్తాయి. దీని వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఉత్తర భారతం, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోని రైతులు మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మంచి వర్షపాతం..
ధనస్సు రాశితో ప్రభావితమైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఈ సారి మంచి వర్షపాతం కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శని, కేతువు మధ్య రాశి వల్ల కొంత నష్టం జరగొచ్చు. ఆరుద్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో చంద్రుడు తులారాశిలో ఉంటాడు.

మొత్తం వర్షపాతం..
చివరగా అంగారకుడిపై శని ఫోకస్ కారణంగా వరదలు, కరువు పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. మొత్తంగా చూస్తే వర్షా కాలంలో మొత్తం 95 శాతం వర్షపాతం ఉండొచ్చు.



Click it and Unblock the Notifications