For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!

|

ఎక్కువ మనీ కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ప్రతి ఒక్కరూ ఎక్కువ ఆదాయం కావాలని.. హాయిగా గడపాలని ఆశిస్తూ ఉంటారు.

అయితే అందరికీ సాధ్యం కాదు. అందుకు ప్రధాన కారణం ఆర్థిక పరమైన ఇబ్బందులే. కొందరు వ్యక్తులకు కావాల్సినన్నీ కాసులు సరైన సమయానికి అందినా.. అవి మాత్రం చేతిలో నిలబడకుండా అనవసరంగా ఖర్చయిపోతుంటాయి.

దీంతో తమ సంపాదనను ఎలా సేవ్ చేసుకోవాలా? తమ సొమ్మును ఎలా పెంచుకోవాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. కరోనా వంటి మహమ్మారి వచ్చి అలాంటి పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసింది. అయితే సంపదకు సంబంధించి సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు, చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాదు.. ఇంట్లో మీ సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా డబ్బును ఆదా చేసేందుకు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎలాంటి పరిహారాలు పాటించాలి.. ఏయే రాశి వారు ఎలాంటి చిట్కాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం, ఆదాయానికి ఆది దేవత లక్ష్మీదేవి. ఈ దేవి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం కచ్చితంగా పెరుగుతుంది. దీని కోసం అమావాస్య రోజున సంధ్యా సమయం ముగిసిన తర్వాత అంటే చీకటి పడిన సమయంలో మీ ఇంట్లో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపం వెలిగించడానికి ముందు దూదికి బదులు, ఎర్రటి దారాన్ని ఉపయోగించాలి. అలాగే అందులో కుంకుమ పువ్వు కూడా వేయాలి. ఇలా దీపారాధాన చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

మీ ఇంట్లో అనవసరంగా ఖర్చులు అరికట్టడానికి, డబ్బును పొదుపు చేయడానికి గురువారం రోజున దక్షిణావర్తి శంఖంలో పాలు పోసి శ్రీ మహా విష్ణువుకి అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.

Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు డబ్బు ఆదా చేయడానికి ముందుగా వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. రోజంతా లేదా వారంలో ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా చూసుకోవాలి. మీ షాపింగుకు అవసరమైన మేరకు ఖర్చు చేసేందుకు నగదును మాత్రమే తీసుకెళ్లాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు డబ్బును ఆదా చేసేందుకు ఒక పొదుపు గేమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. మీ ఖర్చులను తగ్గించుకునేలా ఫోకస్ పెంచుకోవాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి డబ్బును పొదుపు చేసేందుకు సుదీర్ఘ సెలవులు లేదా రిటైర్ మెంట్ వంటి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. స్వయంగా పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి.

ఈ 4 రాశుల వారు చాలా పవర్ ఫుల్.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు డబ్బును ఆదా చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకోవాలి. మీ ఇంట్లోని పోపుల డబ్బాలో కొంత సొమ్ము.. మీ బ్యాంకు ఖాతాలో మరికొంత డబ్బు.. విహారయాత్రల కోసం ఇంకా కొంత డబ్బు వంటి నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకుని నిధులను కేటాయించుకోవడం వంటివి చేయాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు డబ్బు విషయంలో భావోద్వేగంగా ఉండకూడదు. అనవసరమైన షాపింగుకు బదులుగా కొంచెం ఆచరణాత్మకంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో కూడిన వస్తువులను కొనుగోలు చేస్తే మీ బడ్జెట్ బ్యాలెన్స్ అవుతుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు స్వయంగా పొదుపు ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనం ఉన్న వాటిల్లో పెట్టుబడి పెట్టడం వంటివి చేయాలి.

Mangal Gochar 2022:కుజుడు మీనంలోకి ప్రవేశం.. ఈ రాశులకు చాలా అదృష్టం..!

తులా రాశి..

తులా రాశి..

ఈ రాశి వారు డబ్బును ఆదా చేసేందుకు షాపింగుతో పాటు అన్ని అవసరాల సమయంలో నగదు మాత్రమే చెల్లించాలి. మీరు అనవసర ఖర్చులు చేయకుండా రక్షిస్తుంది. ఇంకా ఇతర మార్గాల్లో కూడా మీరు డబ్బు ఆదా చేయొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు డబ్బు ఆదా చేసేందుకు ఫైనాన్షియల్ ప్లానర్ సహాయం తీసుకోవాలి. మీ వనరులను ఉపయోగించుకోండి. ఆర్థిక పరమైన విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. మీరు ఎక్కడ పొదుపు చేస్తున్నారో మరియు ఎక్కడ కోల్పోతున్నారో తెలుసుకోండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు డబ్బు విషయంలో పెద్ద కలలు కనాలి. ఇది మీ హక్కు. మీ బలహీనమైన భవిష్యత్తును నివారించడానికి పొదుపుపైనా ఫోకస్ పెట్టండి. ప్రతి నెలా కొంత మొత్తం డబ్బును ఆదా చేసుకోండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు డబ్బును ఆదా చేయడంలో మంచి ప్రావీణ్యం కలవారు. వీరు ఎక్కువగా పొదుపు చేస్తుంటారు. వీరికి ఎక్కువ వడ్డీ వచ్చే చోట డబ్బును ఆదా చేసుకోవాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు డబ్బును అనవసరంగా ఖర్చు చేయడం వంటి అలవాట్లను మానుకోవాలి. ఎందుకంటే మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు డబ్బును ఆదా చేసేందుకు అత్యవసర నిధిని రూపొందించండి. మీకు తెలిసిన వారిని సంప్రదించి మ్యూచువల్స్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని మరియు చివరి విడతలో బ్రాండ్ చిప్ లను ఆదా చేసే జ్యువెలరీ హార్వెస్ట్ ప్రోగ్రామ్ లను కూడా ప్రయత్నించొచ్చు. అలాగే పెట్టుబడిగా కొంత బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు.

డబ్బును ఆదా చేసేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలి?

పురాణాల ప్రకారం, ఆదాయానికి ఆది దేవత లక్ష్మీదేవి. ఈ దేవి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం కచ్చితంగా పెరుగుతుంది. దీని కోసం అమావాస్య రోజున సంధ్యా సమయం ముగిసిన తర్వాత అంటే చీకటి పడిన సమయంలో మీ ఇంట్లో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపం వెలిగించడానికి ముందు దూదికి బదులు, ఎర్రటి దారాన్ని ఉపయోగించాలి. అలాగే అందులో కుంకుమ పువ్వు కూడా వేయాలి. ఇలా దీపారాధాన చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

English summary

Astro Tips for Money : The Right Tip to Save Money, as per Your Zodiac

Here we are talking about Astro tips for money:The right tip to save money, as per your zodiac. Read on
Desktop Bottom Promotion