Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఏ రకమైన కారు కొంటే.. మీకు లక్కీ కలిసొస్తుందో తెలుసా...
కొత్త కారు కొనేందుకు ఏ రంగు మరియు ఏ నంబర్ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది మార్కెట్లో వచ్చే కొత్త మోడల్ కార్లను కొంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు కార్లలో కొత్త ఫీచర్లను తెలుసుకుంటూ ఉంటారు. కానీ మధ్యతరగతి వారైతే చిన్నప్పటి నుండి కొత్త కారు కొనాలని ఆశపడుతూ ఉంటారు.

అయితే వారు కారు కొనేంత సొమ్ము రెడీ చేసుకున్నాక ఏ రంగు కారు కొనాలి.. కారుకి ఏ నెంబరు ఉండాలనే విషయంలో కొంత అమోమయంలో ఉంటారు. అదే ధనవంతులైతే తమకు కావాల్సిన రంగును, కారు నెంబరును వెంటనే కొనేస్తారు.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ జాతకాన్ని బట్టి ఏ రంగు కారు కొనాలి.. ఏ నెంబర్ కారు మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కారు కొనేటప్పుడు..
మనలో మధ్యతరగతి వారు కారు కొనే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వారు తమ కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో రోజుల నుండి డబ్బును ఆదా చేస్తుంటారు. కాబట్టి విలువైన కారు కొనేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏవైనా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరగకుండా ఉండకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కారు కలర్..
కారు కొనేటప్పుడు అది ఏ రంగులో ఉండాలనేది మీ పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ, మా జాతకానికి ఏ రంగు సరిపోతుందో.. అలాంటి రంగులోని కారును కొంటే ఇంకా బాగుంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అది మీ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు జ్యోతిష్య నిపుణులను సంప్రదించి మీకు ఏ రంగు సూటవుతుందో తెలుసుకుని కొంటే, మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కారు నెంబర్..
కొందరికి కారు నెంబరు విషయంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా తమ లక్కీ నంబర్ వచ్చేలా కారు నెంబరును సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మీ లక్కీ నెంబరును మీరు పుట్టిన తేదీని బట్టి లెక్కించాలి. ఉదాహరణకు మీరు 18వ తేదీన పుడితే (1+8=9). మీ లక్కీ నెంబర్ 9 వచ్చేలా చూసుకోవాలి. మీ కారు నెంబరు కూడా మొత్తం కలిపితే తొమ్మిది వచ్చేలా చూసుకోండి.

డెలివరీ డేట్..
మీరు కారు కొన్న తర్వాత.. దాన్ని డెలివరీ ఇచ్చే డేట్ కూడా చాలా ముఖ్యం. మీరు కారు ఇంటికి తీసుకెళ్లే రోజు మంచిదో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా రాహూ కాలంలో కారు కొనకూడదు. మీ క్యాలెండర్లో మంచి రోజు చూసుకుని, కారు కొనాలి. అదే సమయంలో ఏ వస్తువు అయినా అమ్మడం లేదా కొనడం వంటివి అప్పుడే చేయాలి.

శుభ సమయం..
కారు కొనే రోజు, తేదీతో పాటు శుభ సమయం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరోజు కేవలం కొన్ని గంటలు మాత్ర శుభ సమయం ఉంటుంది. రాహుకాలం, యమగండంలో కారును కొనకూడదు. కాబట్టి కేవలం శుభ ఘడియల్లో కారు కొనేలా చూసుకోవాలి.

కారులోపల..
చాలా మంది కారులోపల దేవుడికి సంబంధించిన చిన్న విగ్రహాలు పెడుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ వినాయకుని విగ్రహాన్ని మీ డ్యాష్ బోర్డుపై తప్పనిసరిగా ఉంచుకోవాలట. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ప్రమాదాల నుండి మనల్ని కాపాడటానికి సహాయం చేస్తాడని చాలా మంది నమ్ముతారట.

కారు కొన్న వెంటనే..
ఎవరైతే కొత్త కారు కొంటారో.. దాన్ని వెంటనే ఫస్ట్ రైడ్ లో గుడికి తీసుకెళ్లాలట. అది కూడా ఆంజనేయుడు లేదా వినాయక గుడికి తీసుకెళ్లి పూజారితో పూజలు చేయిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట. ఈ ఇద్దరు దేవుళ్లు మన మీద చెడు ప్రభావం పడకుండా చూస్తారట.



Click it and Unblock the Notifications