Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
Valentines Day Destinations 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్
మీ లవర్‌తో రొమాంటిక్‌గా గడపాలనుకున్నా, గొప్పగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా దేశంలోని ఈ ప్రాంతాలకు వెళ్లండి. ఈ ప్రాంతాలు రొమాంటిక్‌గా ఉండడమే కాకుండా మీలో రొమాంటిక్ యాంగిల్‌ను నిద్రలేపుతాయి. దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డేకు ది
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెల. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అదే వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. భారత్‌లోనూ ప్రేమ పక్షులు ఈ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటాయి. ఈ ప్రేమికుల రోజున ప్రియమైన వారితో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏటైనా దూరం, ప్రకృతి దగ్గరగా, ఏకాంతంగా, మనోహరంగా, మధురమైన అనుభూతులు అందించే చోట మనసుకు దగ్గరమైన వారితో, మనస్సులో ఉన్న వారితో గడపాలని ఆశిస్తారు.

మీ లవర్‌తో రొమాంటిక్‌గా గడపాలనుకున్నా, గొప్పగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా దేశంలోని ఈ ప్రాంతాలకు వెళ్లండి. ఈ ప్రాంతాలు రొమాంటిక్‌గా ఉండడమే కాకుండా మీలో రొమాంటిక్ యాంగిల్‌ను నిద్రలేపుతాయి. దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డేకు ది బెస్ట్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శ్రీనగర్:
దేశంలో శ్రీనగర్ అత్యంత అందమైన ఆకర్షణీయమైన, ప్రకృతి రమణీయమైన ప్రదేశం. ఇక్కడి నేచర్ ఎవరి మనస్సునైనా గిలిగింతలు పెడుతుంది. నిర్మలమైన సరస్సులు, అద్భుతమైన లోయలు, ఉత్కంఠభరిత తోటలు ఒక్కటేమిటి ఇక్కడ చూడదగ్గవి, తప్పకుండా చూడాల్సిన ఎన్నో ఉన్నాయి. దాల్ సరస్సులో షికారా విహారయాత్ర ప్రతి ఒక్కరూ ఆస్వాదించాల్సిందే. తులిప్ గార్డెన్ లో మీ ప్రియమైన వారితో నడవడం అద్భుతంగా ఉంటుంది.

2. నైనిటాల్:
నైనిటాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సుందరమైన హిల్ స్టేషన్. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఫిబ్రవరి నెలలో వాతావరణం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీ ప్రియమైన వారితో నైని సరస్సులో బోటింగ్ చేయాల్సిందే. ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉంటాయి.

3. ఉదయ్‌పూర్:
ఉదయ్‌పూర్‌ను సిటీ ఆఫ్ లేక్స్, వైట్ సిటీ అని కూడా పిలుస్తారు. ఉదయ్ పూర్ ప్రేమికులకు గమ్యస్థానం లాంటిది. ఉదయ్ పూర్‌లోని సిటీ ప్యాలెస్, ఫతే సాగర్ లేక్, పిచోలా సరస్సు, మాన్ సూన్ ప్యాలెస్ లాంటి రాజ మందిరాలు చూడొచ్చు. ఇక్కడి కళా వైభవం మనసును తాకుతుంది. రాజస్థాన్ సాంప్రదాయ పండుగలు, ఒంటె సవారీలు, సరస్సుల్లో బోటింగ్ చాలా ఎంజాయ్ చేయవచ్చు.

4. డార్జిలింగ్:
చుట్టూ కొండలు, తేయాకు తోటలతో డార్జిలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. డార్జిలింగ్ ప్రకృతిని ఆస్వాదించే వారికి సరైన డెస్టినేషన్. ఇది ప్రేమ పక్షులకు రొమాంటిక్ గమ్యస్థానం. కొండల గుండా సుందరమైన డ్రైవ్ చేయవచ్చు. టీ తోటల్లో విహరించవచ్చు. ఇక్కడ సాహసాల క్రీడలు కూడా ఆకట్టుకుంటాయి.

5. జైపూర్
జైపూర్ ను పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. జైపూర్ చరిత్రకు, సంస్కృతికి నెలవు. శృంగారభరితమైన ఫీల్ అందిస్తుంది. అద్భుతమైన అంబర్ కోటను సందర్శించవచ్చు. కొండల గుండా మీ పార్ట్‌నర్‌తో కలిసి ఏనుగు సఫారీ చేయవచ్చు. మీ ప్రియమైన వారి చేతిలో చేయి వేసి సిటీ బజార్లకు వెళ్లొచ్చు.

6. గోవా
అద్భుతమైన బీచ్‌లు, సూపర్ నైట్ లైఫ్, రుచికరమైన సీఫుడ్ తో వాలెంటైన్స్ డేని స్టైల్ గా జరుపుకోవచ్చు. జంటలకు గోవా ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. బీచ్‌లో సూర్యాస్తమయం వేళ మీ లవర్ తో కలిసి నడుస్తూ మంచి సమయం గడపొచ్చు. రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఆస్వాదించవచ్చు. గోవాలని అనేక క్లబ్ లలో రాత్రి పార్టీ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
