For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో భారతీయుల బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ రెసిపీలివే...

2020లో భారతదేశంలో బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ రెసిపీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రతి సంవత్సరం సమయం మారే కొద్దీ ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. అయితే ఈ 2020లో మాత్రం చాలా విషయాలు వైరల్ గా మారాయి. దానంతటికీ కారణం కరోనా వైరస్సే. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. రెస్టారెంట్లు మరియు హోటళ్లు కూడా మూతపడ్డాయి.

Best Recipes of 2020 in Telugu | Best and Most Popular Indian Recipes of 2020

దీంతో చాలా మంది బయట లభించే రుచులను పొందలేకపోయారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో వంటలను చేయడం నేర్చుకున్నారు. ప్రతి రోజూ లేదా ప్రతి వారం కొత్త కొత్త రుచులను ఆస్వాదించారు. కొత్త రకాల వంటల కోసం సోషల్ మీడియాలో.. గూగుల్ లో పదే పదే అన్వేషించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరంలో బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ వంటకాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

Christmas Special : ఈ క్రిస్మస్ కేకులతో ఈ ఫెస్టివల్ ను హ్యాపీగా జరుపుకోండి...Christmas Special : ఈ క్రిస్మస్ కేకులతో ఈ ఫెస్టివల్ ను హ్యాపీగా జరుపుకోండి...

దలోగ్నా కాఫీ..

దలోగ్నా కాఫీ..

ఈ సంవత్సరం ఎక్కువగా ఇంటికే పరిమితమైన ప్రజలు టీ, కాఫీ తాగడం కంటే, దీన్ని ఎక్కువగా ఇష్టపడ్డారట. 2020లో దలోగ్నా కాఫీ రెసిపీని గూగుల్ లో ఎక్కువ అన్వేషించడమే కాదు.. చాలా మంది దాన్ని ఇంట్లో కూడా తయారు చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రండింగ్ గా నిలిచింది.

అరటి రొట్టె..

అరటి రొట్టె..

2020 సంవత్సరంలో గూగుల్ బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ గా నిలిచిన వంటకాల్లో అరటి రొట్టె టాప్-2 స్థానాన్ని దక్కించుకుంది. అరటి సహాయంతో తయారు చేసిన ఈ రొట్టె ప్రత్యేకత ఏంటంటే.. దీనిని ఎవ్వరైనా.. వంటల్లో ఎలాంటి అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకే ఈ రెసిపీని గూగుల్ లో ఎక్కువగా అన్వేషించారు. దీంతో ఇది టాప్ రెసిపీల్లో ఒకటిగా నిలిచింది.

ఎగ్ సలాడ్ సాండివిచ్..

ఎగ్ సలాడ్ సాండివిచ్..

2020 సంవత్సరంలో, వంటలతో సంబంధం లేని వారు కూడా వంటలు చేశారు. అంతేకాదు కనీసం ABCDలు కూడా తెలియని వ్యక్తులు సులభంగా వంట తయారు చేయడం.. కొత్త వంటకాలను శోధించడాన్ని బాగా ఇష్టపడతారు. గూగుల్ లో 2020లో చాలా మంది తమ అల్పాహారంలో ఎక్కువగా ఎగ్ సలాడ్ సాండ్ విచ్ ను తయారు చేశారు.

డబుల్ట్రీ కుకీ..

డబుల్ట్రీ కుకీ..

లాక్ డౌన్ సమయంలో, భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వారి కుకింగ్ నైపుణ్యాలకు పదునుపెట్టారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు వివిధ రకాల కుకీలు మరియు కేకులను తయారు చేశారు. వీటిలో డబుల్ట్రీ కుకీని తయారు చేసేందుకు గూగుల్ లో ఎక్కువగా అన్వేషించారు. గూగుల్ 2020 సంవత్సరంలో దీనిని టాప్ 10 ట్రెండింగ్ వంటకాల్లో చేర్చింది. అంతేకాదు.. ఈ కేకు తయారు చేసేటప్పుడు అనేక ప్రయోగాలు జరిగాయి.

జిలేబీలు..

జిలేబీలు..

భారతీయులు ప్రతి సందర్భంలోనూ తియ్యని పదార్థాలు ఎక్కువగా తింటారని మనందరికీ తెలుసు. ఈ సమయంలో అనేక రకాల స్వీట్లు ఇంట్లో తయారు చేశారు. ఇక 2020 సంవత్సరంలో చాలా మంది ప్రజలు తమ ఇంట్లో జిలేబీని తయారు చేశారట. దీనిని ఎలా తయారు చేయాలనే పద్ధతి గురించి గూగుల్ లో ఎక్కువగా వెతికారంట. ఎందుకంటే దీన్ని వండటం చాలా సులభం మరియు చాలా రుచికరం. కాబట్టి ఈ ఏడాది ఈ జిలేబి చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

చీజ్ రెసిపీ..

చీజ్ రెసిపీ..

మన దేశంలో పన్నీర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ సంవత్సరం చాలా మంది ప్రజలు మార్కెట్లో లభించే జున్నుకు బదులు ఇంట్లోనే జున్ను తయారు చేసేందుకు ఆసక్తి చూపారు. కరోనా మహమ్మారి కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఈ సంవత్సరం ఇంట్లోనే చాలా మంది జున్ను తయారు చేశారు. ఈ సంవత్సరం గూగుల్ ఎక్కువగా అన్వేషించిన వాటిలో ఇంట్లోనే జున్ను తయారు చేయడం ఎలా అనేది ఎక్కువగా ట్రెండింగులో నిలిచిందట. ఇలా అనేక రకాల వంటలను గూగుల్ వెతికారట. దీనిలో పై వంటలు టాప్ లో నిలిచినట్లు గూగుల్ వెల్లడించింది.

English summary

Best Recipes of 2020 in Telugu | Best and Most Popular Indian Recipes of 2020

Best Recipes of 2020 in Hindi: Here is the list of best and most popular indian recipes of 2020. Take a look.
Desktop Bottom Promotion