Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
మై విలేజ్ షో నుండి బిగ్ బాస్ షో వరకు గంగవ్వ జీవితంలో ఎన్నో విషాదాలు..
మై విలేజ్ షో గంగవ్వ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
గంగవ్వను చూస్తే తెలుగు వారందరికీ ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే గంగవ్వ విలేజ్ నుండి టౌనుకు, అక్కడి నుండి నగరానికి వచ్చిన సెలబ్రెటీ. ఆమె మాటే ఆమెకు గుర్తింపు కార్డు వంటిది. తెలంగాణ భాష, యాసకు ఆమె అనధికార అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె యూట్యూబులో చేసిన 'మై విలేజ్ షో' బహుబలి కన్నా పెద్ద హిట్ అయ్యిందంటే ఆమె ఎంత పాపులారిటీ సంపాదించిందో ఇట్టే అర్థమవుతుంది. అయితే ఈ గంగవ్వ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కరోనా వైరస్ కు మాత్రమే లాక్ డౌన్... ఎంటర్ టైన్ మెంట్ కు నో లాక్ డౌన్ అంటూ బిగ్ బాస్-4 వచ్చేసింది. అయితే కంటిస్టెంట్స్ లో అందరి కంటే లేటుగా ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ లేటెస్ట్ గా అదరగొట్టింది. వచ్చీరావడంతో సోషల్ మీడియాలో నెంబర్-1 పొజిషన్లో నిలవడమే కాదు.. తన దరిదాపుల్లో ఎవ్వరు లేకుండా చేసుకుంది. నాగార్జున ఈమెను ఆహ్వానించే ముందే ఈమె స్పెషల్ గెస్ట్ అని కూడా చెప్పారు. గంగ్వను జాగ్రత్తగా చూసుకోకపోతే కఠిన శిక్షలు తప్పవని కూడా హెచ్చరించారు.

గంగవ్వ.. మై విలేజ్ షో ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైన సహజ నటి. ఆమె గొంతులో ఏదో తెలియని ఆకర్షణ. ఆమె మాట్లాడుతుంటే అచ్చం మన అమ్మమ్మ, బామ్మ మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఆమె అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు. లేటు వయసులో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ... తను చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని మనం నమ్మలేని నిజాలను తెలుసుకుందాం...

గంగవ్వ బాల్యం..
‘నా పేరు గంగవ్వ. నేను పుట్టింది తెలంగాణలోని జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో. నేను బడ్డది (అత్తారిల్లు) లంబాడిపల్లెలో. పడడు ఎట్లంటే.. నాకు ఐదేండ్లు ఉన్నప్పుడు.. మా పెనివిటికి ఏడేండ్లు. మా చిన్నప్పుడే అయినై పెండ్లిండ్లు. ఐదేండ్లకే పెళ్లయినదాన్ని నాకు ఏం ఎరిక' అంటూ గంగవ్వ చెప్పారు. తన భర్త, మామ చనిపోయిన తర్వాత తమను ఎవ్వరూ దగ్గరకు తీసుకోలేదని కంటతడి పెట్టారు. తినడానికి తిండి కూడా ఉండేది కాదన్నారు.

భర్త దుబాయ్ వెళ్తానంటే..
తన భర్త దుబాయ్ వెళ్తానంటే.. అప్పులు చేసి మరీ విదేశాలకు పంపాను. ఏడేండ్లు దుబాయ్ లో ఉన్న నా పెనివిటి ఒక్క రూపాయి పంపలేదు. అక్కడే సచ్చిపోయిండేమో అనుకున్నానని గంగవ్వ ఏడుస్తూ చెప్పారు. ‘ఒక బిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ వస్తే.. దవాఖానకు తీసుకెళ్లేందుకు పైసల్లేవ్. ఎలాగోలా అక్కడికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిండు. అక్కడే బిడ్డ చనిపోతే భుజాన వేసుకుని ఇంటికి నడుచుకుంటు వచ్చా' అని వెల్లడించారు.

రూ.8 లక్షల అప్పు..
తనకు రూ.8 లక్షల అప్పు ఉండేదని.. మూడేళ్లు కష్టపడి తీర్చానని, ‘ఒక సిన్నది కెమెరా పట్టుకుంటా వచ్చి పొలాల కాడ, సేన్ల కాడ, చెట్ల కాడ తీసుడుబెట్టింది. యాక్టింగ్ మంచిగుంది. గొంతు మంచిగుంది అని అన్నది తీసుకుంటా తీసుకుంటా పోతే ఎంతోకొంత జీతమిచ్చుకుంటూ వత్తుండ్రు. చిన్న బతుకు మాకు ఒకప్పుడు. ఇప్పుడు కొంత విలువకొచ్చే నా బతుకు. అది దేవుని దయ వల్ల అని అనిపిత్తది' అంటూ చెప్పుకొచ్చారు గంగవ్వ.

వర్షం వస్తే..
వర్షాకాలం వచ్చిందంటే మా ఇల్లంతా కారిపోతుందని.. ఓ వైపు వంట చేసుకుంటూనే, మరోవైపు బకెట్లు, బోగాణిలు పెట్టుకుని వర్షపు నీళ్లను పారేస్తూ ఉంటానని తన కష్టాన్ని చెప్పుకున్నారు. ఈ బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుని, బుక్కెడు అన్నం తింటే అదే చాలని గంగవ్వ అన్నారు.

వయసెంతో తెలీదు..
గంగవ్వకు ఎనిమిది మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే గంగవ్వకు తన అసలు వయసెంతో తెలీదు. గంగవ్వ యూట్యూబ్ తోనే ఆగిపోలేదు. గంగవ్వ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. అందులోనూ ఆమెకు 45 వేల మందికి ఫాలోయర్లు ఉన్నారు. అంతేకాదు గంగవ్వ ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి సినిమాల్లో కూడా నటించింది. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించి అందరి మెప్పు పొందింది.

కూలీ పనులు చేస్తూ..
గంగవ్వ యూట్యూబ్ స్టార్ అవ్వక ముందు తన కష్టాలన్నీ దిగమింగుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపిన గంగవ్వ.. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని తన అప్పులన్నీ తీర్చేసింది. నిలకడగా ఆదాయం వస్తోందని చెబుతోంది. త్వరలోనే ఓ ఇల్లు కూడా కట్టుకుంటానంటోంది.

యూట్యూబ్ తో దశ తిరిగిపోయింది..
వ్యవసాయ కూలీగా పని చేసుకుంట బతుకు వెళ్లదీస్తున్న గంగవ్వకు ‘మై విలేజ్ షో' అనే షో ద్వారా దశ తిరిగిపోయింది. తనకే తెలియని సహజ నటిని ప్రపంచానికి పరిచయం చేసింది. తన స్వభావంతో, తన మాటతో, తన విరుపుతో గంగవ్వ నటించడం వల్ల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దీంతో ఆమెకు ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది.

నాగార్జునను నవ్వించారు..
ఇదే సమయంలో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ.. నాగార్జునను సైతం నవ్వించారు. ‘నీ కొడుకుతో చేసినా.. నీ కోడలితో ఎంట్రీ ఇచ్చినా' అంటూ బేస్ వాయిస్ తో కింగ్ నాగార్జునను నవ్వించారు. ‘మరి ఏమనుకోకురిగాని నేనొక ముచ్చటడుగుతా.. మీ కొడుకులు మీరు జూత్తే సేమ్ అన్నదమ్ముల లెక్కే కొడతారు' అని నాగార్జునకు గోలి వేశారు గంగవ్వ.



Click it and Unblock the Notifications