Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Supermoon: సూపర్ మూన్ చూడాలనుకుంటున్నారా.. ఆకాశంలో ఆ అద్భుతం కనిపించేది రేపే
సూపర్ మూన్ చూడాలనుకుంటున్నారా.. ఆకాశంలో ఆ అద్భుతం కనిపించేది రేపే
Supermoon: ఈ ఏడాది ఆషాడ పౌర్ణిమ రోజున ఆకాశంలో అద్భుతం ఆవిష్క్రతం కానుంది. జులై 13న ఆకాశంలో సూపర్ మూన్ కనిపించనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరికి రానున్నాడు. ఈ సందర్భంగా ఎప్పుడూ కనిపించనంత పెద్దదిగా చంద్రుడు కనిపించి కనువిందు చేయనున్నాడు. ఇలా చంద్రుడు భారీ రూపంలో కనిపించడాన్ని బక్ సూపర్ మూన్, థండర్ మూన్, మెడ్ మూన్, హే మూన్ అని పిలుస్తుంటారు. జులై 13 న కనిపించే ఈ సూపర్ మూన్ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోనూ కనిపించనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం.. జులై 13వ తేదీన 2.38pm EDT అంటే.. భారత కాలమానం ప్రకారం అర్ధ రాత్రి 12 గంటల 8 నిమిషాలకు ఈ అద్భుతం కనిపిస్తుందని నాసా తెలిపింది. ఇలా భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన సూపర్ మూన్(Supermoon) ను మూడు రోజుల పాటు చూడవచ్చు. బుధ వారం నుండి శుక్ర వారం వరకు ఆకాశంలో ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని ఖగోళ శాస్త్ర వేత్తలు వెల్లడించారు.

అసలు సూపర్ మూన్ అంటే ఏంటి?
భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగూతూ ఉంటుంది చందమామ. ఇలా తిరుగుతూ 27 రోజుల్లో భూమి చుట్టూ తిరిగి వస్తుంది జాబిలమ్మ. చంద్రుని కక్ష భూమికి అత్యంత దగ్గర ఉండే ప్రాంతాన్ని పేరీజీ అంటారు. ఈ పేరీజీ అనేది భూమికి చంద్రుడిని అత్యంత సమీపంలోకి తీసుకువచ్చే స్థానం. కక్షలో తిరిగే చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన సమయంలో చంద్రుడు మామూలు పౌర్ణమి రోజుల్లో కంటే కూడా చాలా పెద్దదిగా, నిండుగా కనిపిస్తాడు. ఇలా జాబిలి పెద్దగా కనిపించడాన్ని సూపర్ మూన్ గా పిలుస్తారు. సంవత్సరంలో మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే ఈ సూపర్ మూన్ కనిపిస్తుంది. పేరీజీ అనేది భూమి నుండి 3,63,300 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. భూమికి అత్యంత దూరంగా ఉండే కక్ష స్థానాన్ని అపోజీగా పిలుస్తారు. అది 4,05,500 కిలో మీటర్ల దూరం ఉంటుంది.

భూమికి చంద్రుడు అత్యంత దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రకాశవంతంగా.. అంటే 30 శాతం ఎక్కువ కనిపిస్తుంది. 0.28 మాగ్నిట్యూడ్ లో చంద్రుడి ప్రకాశం పెరుగుతుంది. అయితే ఈ కాంతి గుర్తించదగిన స్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణం కంటే కూడా 17 శాతం పెద్దదిగా కనిపిస్తాడు చంద్రుడు. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా తెల్లని రంగులో కాకుండా కొద్దిగా గులాబీ రంగులో కనిపించనున్నాడు. 2022 సంవత్సరంలో సంభవించే అతి పెద్ద ఖగోళ అద్భుతాల్లో సూపర్ మూన్ ఒకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సూపర్‌మూన్ అనే పదాన్ని 1979లో రిచర్డ్ నోల్లే అనే జ్యోతిష్కుడు మొదటి సారిగా వాడాడు. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా ఆమోదించిన రిచర్డ్ నోల్లే నిర్వచనం ప్రకారం.. చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఈ ఏడాది అఫెలియన్ కారణంగా సూర్యుడూ భూమి నుండి చాలా దూరంలో ఉన్న సమయంలోనే ఈ సూపర్ మూన్ ఏర్పడనుంది. బుధ వారం చంద్రుడు భూమికి 3,57,264 కిలో మీటర్ల దగ్గర్లోకి వస్తాడు. ఇలా సూపర్ మూన్ ఏర్పడిన సమయంలో మరి కొన్నింటి పైనా ప్రభావం ఉంటుంది. చంద్రుడు భూమికి చాలా సమీపంలోకి వచ్చిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటు పోట్లకు గురి అవుతూ ఉంటుంది. అలలు ఎక్కువ ఎత్తులో ఎగిరి పడుతుంటాయి. పౌర్ణిమ రోజుల్లో సాయంత్రం కాగానే అలల తాకిడి ఎక్కువవుతుంది. సూపర్ మూన్ ఏర్పడిన రోజుల్లో అలలు తీవ్ర ఆటు పోట్లకు గురవుతాయి. ఈ సమయంలో సముద్రంలో ఏర్పడే తుపానులు తీవ్ర వరదలకు దారి తీయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి విపరీతమైన ఆటు పోట్లను పెరిజియన్ స్ప్రింగ్ టైడ్ అని పిలుస్తారు. స్ప్రింగ్ అనే పదాన్ని జర్మన్ స్ప్రింగ్ జెన్ నుండి తీసుకున్నారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున సముద్ర అలలు సంభవిస్తాయి. సూపర్ మూన్ సమయంలో వీటి తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.

గత సంవత్సరం జూన్ నెలలో కనిపించిన సూపర్ మూన్ ను స్ట్రాబెరీ మూన్ గా వ్యవహరించారు. ఈ ఏడాది కనపడబోయే సూపర్ మూన్ ను బక్ మూన్ గా పిలవనున్నారు. మగ జింక లేదా బక్స్ పై కొత్త కొమ్ములు పెరుగుతున్న సంవత్సరానికి ఇది సూచన. సంవత్సరానికి 3, 4 సార్లు కనిపించే ఈ సూపర్ మూన్ రోజు స్కై వాచర్ లకు, ఫోటో గ్రాఫర్ లకు నిజంగా మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఈ సమయంలో చంద్రుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తే ఫోటోలు తీసేందుకు మంచి వ్యూ దొరికినట్టే. అలాగే స్కై వాచర్ లకు ఈ సందర్భం ఖగోళ సంఘటనలను గమనించడానికి వారికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.
భూమికి అత్యంత దగ్గరగా వచ్చే చంద్రుడిని మాత్రమే అల్టిమేట్ ఫుల్ మూన్ పెరిజీస్ గా పరిగణించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి ఇంత దగ్గరికి చంద్రుడు రావడం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2022 లో వచ్చే సూపర్ మూన్ అల్టిమేట్ ఫుల్ మూన్ పెరిజీస్ గా వ్యవహరించవద్దని పేర్కొంటున్నారు.



Click it and Unblock the Notifications