For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birthstones by Month:ఏ నెలలో ఏ రకమైన రత్నం ధరిస్తే శుభ ఫలితాలొస్తాయంటే...!

మీరు పుట్టిన నెలను బట్టి ధరించే రత్నం.. వాటి చరిత్ర, వాస్తవాలు, రంగులు.. వాటి అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మనం పుట్టిన సమయం, తేదీ, మాసాన్ని బట్టి కొన్ని రత్నాలు మనకు అదృష్టాన్ని తీసుకొస్తాయని తెలుసా? ఎందుకంటే ప్రతి ఒక రత్నానికి దాని సొంత పుట్టుక అనేది ఉంది.

Birthstones by Month: History, Facts, Colours & Meanings in Telugu

ఈ రత్నాలు మన జీవితంలోని కొన్ని కోరికలు నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయట. అందుకే మనలో చాలా మంది వివిధ రకాల రత్నాలను ధరిస్తూ ఉండటాన్ని మనం చూస్తు ఉంటాం. ఇది ధరించడం వల్ల అదృష్టమే కాదు..

Birthstones by Month: History, Facts, Colours & Meanings in Telugu

ఆరోగ్యంగా ఉంటామని.. అన్నింటికంటే ముఖ్యంగా మనకు ఎదురయ్యే ప్రమాదాల నుండి కాపాడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో మీరు పుట్టిన నెల ప్రకారం ఏది ఉత్తమమైన రత్నం అనే విషయాన్ని వేదికశాస్త్రం ప్రకారం..

Birthstones by Month: History, Facts, Colours & Meanings in Telugu

సూర్యమాన సిద్ధాంతం ఆధారంగా నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సముద్ర గర్భం నుండి వచ్చిన రత్నాలనే శ్రేష్టమైనవిగా భావించాలి. కొన్ని ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేస్తారు. ఈ సందర్భంగా మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వానికి ఏ రకమైన బర్త్ స్టోన్ సరిపోతుందో ఇప్పుడు తెలుసుకోండి.

Mars Transit in Virgo 6 Septemeber 2021: కన్యరాశిలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!Mars Transit in Virgo 6 Septemeber 2021: కన్యరాశిలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

జనవరి-గోమేదికం..

జనవరి-గోమేదికం..

ఈ నెలలో పుట్టిన వారు గోమేదికం రత్నం ధరించడం వల్ల మీకు పీడకలల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ రత్నం ధరించడం వల్ల మీరు నిజమైన ప్రేమను కూడా కనుగొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. 4, 13, 22వ తేదీల్లో జన్మించిన వారు వీటిని ఎక్కువగా ధరించాలి. ఇది రాహు గ్రహానికి సంబంధించినది.

ఫిబ్రవరి -అమెథిస్ట్..(Amethyst)

ఫిబ్రవరి -అమెథిస్ట్..(Amethyst)

ఈ నెలలో పుట్టిన వారు ఈ రకమైన రత్నం ధరిస్తే.. అందమైన జుట్టు.. చర్మ సౌందర్యం మెరుగవుతుందని నమ్ముతారు. అందుకే ఇలాంటి రత్నాలను ఎక్కువగా స్త్రీలు ధరిస్తూ ఉంటారు.

మార్చి -ఆక్వా మరైన్ (Aquamarine)

మార్చి -ఆక్వా మరైన్ (Aquamarine)

ఈ నెలలో పుట్టిన వారు ఆక్వా మరైన్ రత్నాన్ని ధరించడం వల్ల శుభఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఈ రత్నాన్ని మీరు నిద్రించే సమయంలో దిండు కింద పెట్టుకుని పడుకుంటే.. పీడకలలు రాకుండా మంచి నిద్ర వచ్చేలా చేస్తుందని చాలా మంది నమ్ముతారు.

జీవితం గురించి ఏ రాశి వారు ఏం గ్రహిస్తారంటే...!జీవితం గురించి ఏ రాశి వారు ఏం గ్రహిస్తారంటే...!

ఏప్రిల్ - వజ్రం(Diamond)

ఏప్రిల్ - వజ్రం(Diamond)

ఇది భూమిపై పిడుగు పడటం వల్ల ఏర్పడిందని చెబుతారు. ఇది శుక్ర గ్రహానికి సంబంధించిన రత్నం. దీన్ని 6, 15, 24వ తేదీన జన్మించిన వారు ధరించొచ్చు. ఈ వజ్రాన్ని ధరించడానికి ఆర్థిక సామర్థ్యం లేని వారు.. అమెరికన్ డైమండ్ ను ధరించొచ్చు.

మే - మరకతం(పచ్చ)(Emerald)

మే - మరకతం(పచ్చ)(Emerald)

5,14,23 తేదీలలో జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరించొచ్చు. లేత రంగులో ఉండే రత్నాన్ని గరిక పచ్చ అని అంటారు. డార్క్ కలర్లో ఉండే రత్నాన్ని గరుడ పచ్చ అని అంటారు. ఇది బుధ గ్రహానికి సంబంధించినది. దీన్ని ధరించడం వల్ల భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చని నమ్ముతారు.

జూన్ - ముత్యం (Pearl)

జూన్ - ముత్యం (Pearl)

ఈ రత్నాన్ని 2, 11, 20వ తేదీన జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరించొచ్చు. అలాగే ఈ రత్నాన్ని పెళ్లి కూతురు తన పెళ్లిరోజున ధరించాలి. ఇలా ధరించడం వల్ల తను చాలా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. ఇది చంద్ర గ్రహానికి చెందిర రత్నం.

zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!

జులై -కెంపు(Ruby)

జులై -కెంపు(Ruby)

రత్నాలలో వజ్రం తర్వాత అత్యంత శక్తివంతమైన రత్నం రూబీ. దీన్ని పౌర్ణమి రోజున ధరిస్తే బలమైన శక్తిని విడుదల చేస్తుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఈ రత్నాన్ని ఒకటో తేదీ, పదో తేదీన జన్మించిన వారు కూడా ధరించొచ్చు. ఇది సూర్య గ్రహానికి చెందిన రత్నం.

ఆగస్టు-పెరిడోట్..(Peridot)

ఆగస్టు-పెరిడోట్..(Peridot)

మీరు సాహసం చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడితే.. ఈ రకమైన పెరిడోట్ రత్నం ధరించేలా చూసుకోండి. ఈ రత్నం ధరించిన వారికి విపత్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

సెప్టెంబర్-నీలమణి..(Sapphire)

సెప్టెంబర్-నీలమణి..(Sapphire)

వీటిలో ఇంద్ర నీలం.. మయూర నీలం.. కాకి నీలం అనే మూడు రకాల వర్ణాలుంటాయి. దీన్ని విద్యార్థులు ఎక్కువగా ధరించాలి. ఎందుకంటే ఇది పరీక్షల సమయంలో మీకు అపారమైన అదృష్టాన్ని ఇస్తుంది. ఇది శని గ్రహానికి చెందినది. 8, 17, 26వ తేదీన పుట్టిన వారు ఈ రత్నాన్ని ధరించొచ్చు.

అక్టోబర్ -ఓపల్..(Opal)

అక్టోబర్ -ఓపల్..(Opal)

ఈ రత్నం ధరిస్తే.. మంచి స్నేహితులను కనుగొనడంలో ఇది సహాయం చేస్తుంది. అంతేకాదు మీరు ఒంటరిగా ఉండకుండా ఇది సహాయపడుతుంది.

నవంబర్ -పసుపు పుష్పరాగం..(Topaz)

నవంబర్ -పసుపు పుష్పరాగం..(Topaz)

ఈ రకమైన రత్నం గురించి ఆసక్తికరమైన వాస్తవాలు చెప్పారు నిపుణులు. దీన్ని ధరించినప్పుడు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా కాపాడుతుందట.

డిసెంబర్ - నీలి పుష్పరాగం..(Turquoise)

డిసెంబర్ - నీలి పుష్పరాగం..(Turquoise)

ఈ రకమైన రత్నాన్ని ధరించిన వారు సాధారణంగా ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటారట.

English summary

Birthstones by Month: History, Facts, Colours & Meanings in Telugu

Here we are talking about the birthstones by month: history, facts, colours and meanings in Telugu. Read on
Story first published:Tuesday, September 7, 2021, 11:42 [IST]
Desktop Bottom Promotion