Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
Holi 2023: హోలీ రోజు ఈ వస్తువులను ఇంట్లోకి తీసుకురండి.. సంపద, ఆరోగ్యం సిద్ధిస్తాయి
హోలీ రోజు కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకువస్తే మంచి జరుగుతుందని, సంపద వస్తుందని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తామని శాస్త్రం చెబుతోంది. దాని ప్రకారం హోలీ రోజు ఇంటికి ఎలాంటి వస్తువులు తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది రంగుల పండుగ వచ్చేసింది. మార్చి 8 వ తేదీన హోలీ జరుపుకోనున్నాం. కొన్ని చోట్ల 7వ తేదీ మంగళవారం రోజే హోలీ జరుపుకోనున్నారు. హోలీ జరుపుకోవడానికి ఒక రోజు ముందు కాముడిని దహనం చేస్తారు. ఈ రంగుల పండగ మీ జీవితాన్ని కలర్ ఫుల్ గా మార్చాలంటే కొన్ని జాగ్రత్తలు, వాస్తు నివారణలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

హోలీ రోజు కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకువస్తే మంచి జరుగుతుందని, సంపద వస్తుందని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తామని శాస్త్రం చెబుతోంది. దాని ప్రకారం హోలీ రోజు ఇంటికి ఎలాంటి వస్తువులు తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తాబేలు బొమ్మ:
వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మకు ఎంతో ప్రత్యేకత ఉంది. శాస్త్రాల ప్రకారం కూడా తాబేలును చాలా పవిత్రంగా చూస్తారు. హోలీ నాడు తాబేలు బొమ్మలను ఇంట్లోకి తీసుకురావడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది సంపదను సృష్టిస్తుందని చెబుతారు. ఇలా మెటల్ తాబేలు బొమ్మలను ఇంట్లోకి తీసుకువస్తే డబ్బు రాక పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

తోరణాలు కట్టాలి:
మామూలుగా హోలీ రోజు ఇంటికి తోరణాలు కట్టుకోవడం చాలా అరుదు. చాలా కొద్ది మంది మాత్రమే హోలీ రోజు ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతారు. మిగతా పండుగలకు తోరణాలు కట్టినట్లుగానే హోలీ రోజు కూడా ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడం ద్వారా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మామిడి ఆకులు లేదా అశోక చెట్టు ఆకులను తోరణంగా కడితే సంపద వస్తుంది.

బాంబు ప్లాంట్:
వెదురు మొక్క ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతికూల శక్తిని ఇంట్లో నుండి తరిమేస్తుంది. ఇంట్లో వెదురు మొక్క పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది అదృష్టానికి, పురోగతికి, డబ్బుకు చిహ్నంలా నిలుస్తుంది. హోలీ రోజు 7 లేదా 11 కర్రలతో ఉన్న వెదురు మొక్కను ఇంట్లోకి తీసుకురావడం వల్ల సంపద సిద్ధిస్తుంది.

పిరమిడ్:
పిరమిడ్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అందుకే పూర్వకాలంలో దేవాలయాలు, కొన్ని భవనాలు పిరమిడ్ ఆకారంలో ఉండేవి. హోలీ రోజున ఇంట్లో లేదా కార్యాలయాల్లో, వ్యాపార ప్రాంతాల్లో మెటల్ తో చేసిన పిరమిడ్ ను తీసుకొచ్చి పెట్టుకోండి. దీని వల్ల ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య సఖ్యత పెరగడంతో పాటు సంపద వస్తుంది.

స్వస్తిక్:
సనాతన ధర్మంలో స్వస్తిక్ చిహ్నానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ చిహ్నాన్ని గెలుపుకు సంకేతంగా కూడా భావిస్తారు. ఆధ్యాత్మికతకు స్వస్తిక్ చిహ్నానికి సంబంధం ఉంది. హోలీ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకోవడం, గీసుకోవడం చేస్తే మంచి జరుగుతుంది.



Click it and Unblock the Notifications