Latest Updates
-
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.!
Mercury Transit in Capricorn :బుధుడు మకరంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!
2021లో డిసెంబర్ 29న బుధుడు ధనస్సు నుండి మకరంలోకి ప్రవేశించే సమయలో రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడికి మేధస్సు, తెలివితేటలు, వ్యాపారానికి ప్రాధాన్యత గల గ్రహాంగా పరిగణిస్తారు. అంతటి విశిష్టత బుధుడు డిసెంబర్ 29వ తేదీన గంటలకు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి 2022 కొత్త ఏడాదికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే 29వ తేదీన ఉదయం 11:15 గంటలకు ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో దాదాపు నెలరోజుల పాటు సంచారం చేయనున్నాడు. అనంతరం కుంభరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం పడుతుంది. గ్రహాలలో అతి చిన్న గ్రహంగా.. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహంగా బుధుడిని పరిగణిస్తారు.

ఈ సందర్భంగా బుధుడి రవాణా కొందరికి బలమైన శక్తిని పెంచుతుంది.. మరికొందరికి ప్రతికూల ఫలితాలను సూచిస్తోంది. ఇంతకీ ఏ రాశుల వారిపై సానుకూల ఫలితాలు వస్తాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి.. అన్ని రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గౌరవం లభిస్తుంది. మరోవైపు వ్యాపారులు ఈ సమంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడుల విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మీరు పని చేసే రంగంలో వారి మద్దతు పొందుతారు.

వృషభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో విద్యార్థులకు శుభ ఫలితాలొస్తాయి. అదే సమయంలో మీరు మతపరమైన పనులపై ఎక్కువ ఫోకస్ పెడతారు. మీకు పౌరాణిక వాస్తవాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి నుండి బుధుడు మకర రాశిలోకి ఎనిమిదో స్థానం నుండి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. మరోవైపు మీరు కొన్ని చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇలాంటి వాటిని నివారించడానికి, బుధుడి అనుగ్రహం పొందడానికి మీరు సరైన ఆహారం తీసుకోవాలి. మీ దినచర్యలో ఆకుపచ్చని కూరగాయలను చేర్చుకోవాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఇప్పటిదాకా ఒంటరిగా ఉండి.. వివాహం చేసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు పొందుతారు.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉంది. మరోవైపు మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉండే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఉద్యోగ మార్పు లేదా పునరావాసం కోసం చూస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీ పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందొచ్చు. మరోవైపు మీరు తత్త్వశాస్త్రం మరియు మతం విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు త్వరగా విషయాలను నేర్చుకుంటారు.

తుల రాశి..
ఈ రాశి నుండి బుధుడు నాలుగు స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు జీవితంలోని కోరికలను నెరవేర్చుకోవడానికి భౌతిక విషయాలపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇది మీ ఆదాయం కంటే మీ ఖర్చులను చాలా పెంచుతుంది. మరోవైపు వ్యాపారులకు ఈ సమయంలో అనేక లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగం మారాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఆఫీసుల్లో కొన్ని రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాలంలో కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఏదైనా విహార యాత్రలకు వెళ్లేందుకు ఈ కాలంలో ప్లాన్ చేసుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ స్వభావం చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆరోగ్యకరంగా మరియు సంతోషకరంగా ఉంటుంది. మీరు మీ మునుపటి ప్రయత్నాల నుంచి మంచి లాభాలను పొందగలుగుతారు. వ్యాపారులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.

మకర రాశి..
ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారతారు. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా అన్ని పరిస్థితులను అధిగమిస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు పిల్లల వైపు నుండి కొన్ని సమస్యలు రావొచ్చు. విద్యార్థులు ఈ కాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
బుధుడు డిసెంబర్ 29వ తేదీన గంటలకు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి 2022 కొత్త ఏడాదికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే 29వ తేదీన ఉదయం 11:15 గంటలకు ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో దాదాపు నెలరోజుల పాటు సంచారం చేయనున్నాడు. అనంతరం కుంభరాశిలోకి రవాణా చేయనున్నాడు.



Click it and Unblock the Notifications