For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budh Rashi Parivartan 2021:ధనస్సులోకి బుధుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

2021లో డిసెంబర్ 10వ తేదీన బుధుడు ధనస్సులోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లోని బుధుడిని చిన్న గ్రహంగా పరిగణిస్తారు. బుధుడు తెలివితేటలు, శ్రేయస్సు కారకంగా భావిస్తారు. అంతేకాదు ద్వాదశ రాశులలోని మిధున రాశి మరియు కన్య రాశికి కూడా బుధుడు అధిపతిగా ఉంటాడు.

Budh Rashi Parivartan 2021 Mercury Transit in Sagittarius On 10 December 2021 Effects on Zodiac Signs in Telugu

ఇదిలా ఉండగా.. 2021 సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీన వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 29వ తేదీరకు నివాసం ఉండనున్నాడు. ఈ సందర్భంగా 12 రాశిచక్రాలలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.

Budh Rashi Parivartan 2021 Mercury Transit in Sagittarius On 10 December 2021 Effects on Zodiac Signs in Telugu

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. బుధ గ్రహ రవాణ వల్ల ఎవరికి శుభ ఫలితాలు మరియు ఎవరికి చెడు ఫలితాలు రానున్నాయి.. ఎవరెవరు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Aries Horoscope 2022: ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది..!!Aries Horoscope 2022: ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది..!!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మేషరాశి వారి సంపద మరియు దీర్ఘాయువు పెరగొచ్చు. ఈ సమయంలో మీకు మతపరమైన ఆసక్తులు పెరగొచ్చు. మీరు కుటుంబ బాధ్యతను చక్కగా నిర్వరిస్తారు. ఈ సమయంలో మీ వివాహాన్ని ఏకీకృతం చేయడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. అలాగే, ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

పరిహారం : బుధుడి దోషం నివారణ కోసం పుట్టగొడుగులను మట్టి కుండలో ఉంచి దేవాలయంలో సమర్పించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు శుభ ఫలితాల కోసం కొంచెం ఎక్కువ కష్టపడాలి. అదే సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ తల్లి ఆరోగ్యం పట్ల కూడా అవగాహన అవసరం. ఈ సమయంలో మీరు ఇల్లు మారాల్సి రావచ్చు.

పరిహారం : మట్టి కుండలో పంచదార పొడి లేదా తేనెతో నింపి భూమిలో పాతిపెట్టడం వల్ల దురదృష్టం తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి.

మిధునరాశి

మిధునరాశి

ఈ రాశి నుండి బుధుడు సప్తమ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రావొచ్చు. మీరు ఇతరుల మంచి కోసం పని చేస్తారు. మీపై కేసు ఉంటే, ఈ సమయంలో వాదనలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు డిసెంబర్ 29 వరకు ప్రయాణాల నుండి ప్రయోజనం పొందుతారు. అయితే వడ్డీ చెల్లించే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : బుధుని శుభ ఫలితాల కోసం మెడలో ముత్యాలను ధరించండి.

Finance Horoscope 2022లో ఈ 5 రాశుల వారి ఆర్థిక స్థితి సూపర్.. మరీ వీటిలో మీ రాశి ఉందేమో చూసేయండి!!Finance Horoscope 2022లో ఈ 5 రాశుల వారి ఆర్థిక స్థితి సూపర్.. మరీ వీటిలో మీ రాశి ఉందేమో చూసేయండి!!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఇది మీ మేథో సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. మీ ప్రసంగాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఈ కాలంలో మీరు వ్యాపార పర్యటనల నుండి ప్రయోజనం పొందుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. అదనంగా, మ్యాగజైన్‌లు, రైటింగ్ మరియు ప్రింటింగ్ ప్రెస్‌లతో సంబంధం ఉన్న వ్యక్తులు ఊహించిన దాని కంటే ఎక్కువ డబ్బును అందుకుంటారు.

పరిహారం : ఏదైనా పనిని ప్రారంభించే ముందు మీ కుడి చేతికి వెండి ఉంగరాన్ని ధరించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఐదో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు సంతోషంగా ఉంటారు. ఇది మీ కీర్తి మరియు అదృష్టాన్ని పెంచుతుంది. మీ పూర్వీకుల ఆస్తులకు అడ్డంకులు తొలగిపోతాయి. అదనంగా, మెర్క్యురీ ప్రభావం మీ భాగస్వామి మరియు పిల్లలకు అదృష్టాన్ని తెస్తుంది. అయితే ఈ కాలంలో తండ్రి ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.

పరిహారం : మంచి ఫలితాల కోసం మీ మెడలో రాగి నాణేన్ని ధరించాలి లేదా గోవుకు సేవ చేయండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరమైన సమస్యలు ఉండవు. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మానసికంగా మీరు ఆరోగ్యంగా మరియు తాజాగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ కాలంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. మీకు మీ తల్లిదండ్రుల పూర్తి మద్దతు ఉంటుంది. కానీ ఈ సమయంలో తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.

పరిహారం : బుధుని రవాణా కాలంలో అవసరమైన వారికి పసుపు రంగు దుస్తులు దానం చేయాలి లేదా మెడలో వెండి గొలుసు ధరిస్తే శుభ ఫలితాలొస్తాయి.

ఈ రాశుల వారికి అంత త్వరగా ప్రేమ సెట్ కాదు...ఈ రాశుల వారికి అంత త్వరగా ప్రేమ సెట్ కాదు...

తులా రాశి

తులా రాశి

ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఇతరులతో సంబంధం మెరుగుపడుతుంది. మీ కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది మరియు పిల్లలు సంతోషంగా ఉంటారు. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. బుధుడు మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చినప్పటికీ, ఇతరులకు కూడా హాని చేస్తుంది. సౌందర్య సాధనాల వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో చాలా ప్రయోజనాలను పొందుతారు.

పరిహారం : విధార వేరును నీటిలో నానబెట్టి.. ఆ నీటితో స్నానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

ఈ రాశి నుండి బుధుడు రెండో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు సంతోషంగా ఉండటానికి మరియు ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీ తెలివితేటలు సరిగ్గా ఉపయోగించబడతాయి. కాబట్టి మీ గౌరవం పెరుగుతుంది మరియు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అయితే, ఈ కాలంలో మీరు పూర్వీకుల ఆస్తి యొక్క ప్రయోజనం పొందలేరు.

పరిహారం : ఈ కాలంలో శుభ ఫలితాల కోసం మెడలో వెండి గొలుసు ధరించాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

ఇదే రాశిలోకి బుధుడి సంచారం జరగనున్నందున.. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావొచ్చు. అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు రాజులా గడుపుతారు. మీ ఆదాయం పెరుగుతూ పోతుంది. మీ భాగస్వామి కూడా ఆర్థిక ప్రయోజనాలను కూడా అందుకుంటారు.

పరిహారం : ఈ కాలంలో చంద్రుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి

మకర రాశి

ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. అయితే ఈ కాలంలో మీరు మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ డబ్బు వృథా కావొచ్చు. అలాగే, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏ పనిలోనూ తొందరపడకండి.

పరిహారం : బుధగ్రహం యొక్క చెడు స్థితిని నివారించడానికి, నుదుటిపై కుంకుమను పూయండి లేదా మెడలో పసుపు దారాన్ని ధరించండి.

కుంభ రాశి

కుంభ రాశి

ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ పిల్లల జీవితంలో పురోగతి లభించొచ్చు. మీ పిల్లలకు ఇంకా వివాహం కాకపోతే మంచి సంబంధం వస్తుంది. బుధుడి రవాణా వల్ల మీరు అన్ని రకాల నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. కానీ సమయం ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి, సమయం విలువ తెలుసుకుని మాత్రమే ముందుకు సాగండి.

పరిహారం : ఈ కాలంలో శుభ ఫలితాల కోసం మెడలో రాగి నాణెం ధరించండి.

మీన రాశి

మీన రాశి

ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుకుంటారు. మీరు ఈ సమయంలో కొంచెం స్వార్థపూరితంగా ఉండవచ్చు. ఈ సమయం ఆయుధాలు మొదలైన వాటితో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రయోజనం. అయితే, ఈ సమయంలో, పెద్దలను గౌరవించండి. అలాగే, ఎవరి సహాయాన్ని దుర్వినియోగం చేయవద్దు.

పరిహారం : శుభ ఫలితాల కోసం ఏదైనా ఆలయంలో బెల్లం లేదా నువ్వులు దానం చేయాలి.

FAQ's
  • 2021లో బుధుడు ధనస్సురాశిలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లోని బుధుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీన వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 29వ తేదీరకు నివాసం ఉండనున్నాడు. ఈ సందర్భంగా 12 రాశిచక్రాలలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.

  • బుధుడు ఏ రాశులకు అధిపతి? ఎవరిపై ప్రభావం చూపుతాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానముంది. ద్వాదశ రాశి చక్రాలలోని మిధున రాశి మరియు కన్యరాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం మనుషుల మానసిక స్థితి, తెలివితేటలు మరియు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

English summary

Budh Rashi Parivartan 2021 Mercury Transit in Sagittarius On 10 December 2021 Effects on Zodiac Signs in Telugu

Rashi Parivartan december 2021 in Dhanu Rashi; Mercury Transit in Sagittarius Effects on Zodiac Signs in telugu:The Mercury Transit in Sagittarius will take place on 10 December 2021. Learn about remedies to perform in Telugu
Story first published:Thursday, December 9, 2021, 14:45 [IST]
Desktop Bottom Promotion