For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Business Horoscope 2022: కొత్త ఏడాదిలో ఈ రాశుల వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయట..!

|

మరి కొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి కొంగొత్త ఆశలతో అడుగుపెట్టబోతున్నాం. 2021 సంవత్సరాని వీడ్కోలు చెప్పేయనున్నాం. ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో వ్యాపార పరంగా మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనకుంటున్నారా?

అయితే గ్రహాలు, రాశిచక్రాలను బట్టి నూతన సంవత్సరంలో మీ వ్యాపారం ఎలా ఉంటుంది.. ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి..

ఎవరెవరు అద్భుతమైన లాభాలను, ఊహించిన ఆదాయాన్ని పొందుతారనే ఆసక్తికరమైన విషయాలను మీ కోసం తీసుకొచ్చాం. ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో వ్యాపారం చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈ కాలంలో మంచి ఫలితాలను పొందొచ్చు. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. ఈ కాలంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందొచ్చు. సంవత్సరం చివర్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు తొందరపడొద్దు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు 2022 సంవత్సరంలో ఏదైనా కొత్త ప్రాజెక్టులు పెట్టుబడి పెడితే మంచి ఫలితాలను పొందొచ్చు. కొత్త ఏడాదిలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను పొందొచ్చు. మీ ఫీల్డ్ తో అనుబంధం ఉన్న కొందరిలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకునే అవకాశం పొందొచ్చు. ఈ కాలంలో మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయొచ్చు. అయితే ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి. మరోవైపు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..

మిధున రాశి..

2022 సంవత్సరంలో మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీరు మంచి లాభం పొందాలంటే.. చాలా కష్టపడాల్సి రావొచ్చు. కష్టాల్లో కూడా మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీరు పూర్తి సానుకూలతతో అన్ని సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. ఈ ఏడాది ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, సంవత్సరం మధ్యలో దీనికి అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా, మీరు వ్యాపార పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు తమ భాగస్వామిని గుడ్డిగా విశ్వసించకండి.

Mercury Transit in Capricorn :బుధుడు మకరంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

2022 సంవత్సరంలో మీ వ్యాపారం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. సంవత్సరం మధ్య కాలంలో మీ వ్యాపారం వేగం పుంజుకుంటుంది. అయితే ఈ కాలంలో మీ ప్రత్యర్థులు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు మీ ముఖ్యమైన పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్ద లాభాలు కావాలంటే మీరు మరింత కష్టపడాలి. మీరు తెలివిగా పని చేస్తే, మీ ప్రతి సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. అయితే మీరు పెట్టుబడి వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. అలాగే, ఇతరుల సూచనల మేరకు మీ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలి. మీ వ్యాపారం విదేశీ కంపెనీలకు సంబంధించినది అయితే, ఈ సమయం మీకు మిశ్రమంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ చిన్న పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు వ్యాపార విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు 2022 సంవత్సరంలో వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే, మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే, అంత మంచి ఫలితం వస్తుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సంవత్సరం తొలి అర్ధభాగం చాలా బాగుంటుంది. కొత్త ఏడాది ప్రథమార్థంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఈ అవకాశాలను ఉపయోగించుకోగలిగితే, మీ వ్యాపారం మరింత బలంగా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కొన్ని కొత్త వ్యూహాలు చేయొచ్చు.

ఈ 5 రాశుల వారు దేనికీ భయపడరు, ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి వీరి బ్లడ్ లోనే ఉంది!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వ్యాపారులు 2022 సంవత్సరంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీకు అనేక అడ్డంకులు ఎదురవ్వచ్చు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో మీరు సంయమనంతో వ్యవహారించాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈ సమయం మీకు చాలా కష్టంగా ఉంటుంది. భాగస్వామితో మీ సత్సంబంధాలు క్షీణించొచ్చు. కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ సమయం సరికాదు. న్యాయపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు 2022 సంవత్సరం ప్రారంభంలో కొన్నొ కొత్త వ్యాపార ప్రతిపాదనలు పొందొచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు లాభాలు రావాలంటే, చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో వ్యాపార రంగంలో చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం మెరుగ్గా ఉంటుంది. మీరు వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందొచ్చు. మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, మీరు ప్రతి సవాలును చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు. మొత్తం మీద కొత్త ఏడాదిలో మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

కొత్త ఏడాదిలో ఈ రాశి వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. అయితే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. ప్రారంభంలో మీకు కొంత నిరాశ కలగొచ్చు. అలాంటి సమయంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో మీరు పశ్ఛాత్తాపడాల్సి రావొచ్చు. భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఇది మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనుభవం ఉన్న వారి కొన్ని మంచి సలహాలను పొందొచ్చు. దీని వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు 2022లో ఏదైనా కొత్త ప్రారంభించాలనుకుంటే, ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న ఫలితాన్ని పొందొచ్చు. ఈ ఏడాదిలో మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే మీరు పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో మీ పాత పరిచయాల నుండి మంచి లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు 2022 సంవత్సరంలో వ్యాపారంలో లాభాల కోసం షార్ట్ కట్ మార్గాలను తీసుకోవద్దు. మీరు ఏదైనా చట్ట విరుద్ధమైన పని చేస్తే, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, సంవత్సరం మధ్యలో మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మంచి లాభాలను పొందొచ్చు. మీ ముఖ్యమైన పనిలో ఏదైనా అడ్డంకి ఉంటే, సంవత్సరం చివర్లో ఈ సమస్య నుండి పరిష్కారం లభించొచ్చు. మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది.

English summary

Business Horoscope 2022 Predictions for 12 zodiac signs in Telugu

Business Horoscope 2022 in telugu: Check out the Yearly business and career horoscope for all zodiac signs. Read on