Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
2020లో కర్కాటక రాశి ఫలాలు : ఈ ఏడాది ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయం మీదే...
ఈ నెలలో కొన్ని విషయాల పట్ల మీరు కఠినంగా ఉంటారు. స్పష్టత లేకపోవడం మరియు రకరకాల సందేహాలు తలెత్తుతాయి. సహనంతో ఉండండి. మీకు సానుకూల ఫలితాలు రావాలంటే మీ విశ్వాస స్థాయిని పెంచాలి.
ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కోరిక, ఆసక్తి ఉంటుంది. అందుకే చాలా మంది హిందువులు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. రాశి చక్రాన్ని బట్టి.. వారి నక్షత్రాలు, గ్రహాలు, అనుగ్రహాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాం.

ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా సంబంధాల విషయంలో పెద్ద మార్పులు వస్తాయి. దీని వల్ల మీరు బాగా అనుభూతి చెందుతారు. కెరీర్ పరంగా మీకు స్పష్టమైన సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. మీకు ఈ షంవత్సరం ఎన్ని అడ్డంకులు వచ్చనా వాటన్నింటిని సమర్థవంతగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.

మీకు ఈ సంవత్సరం నక్షత్రాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రహాలు మీ ప్రేమ జీవితంలో ప్రభావం చూపుతాయి. అలాగే అన్నింటి కంటే ముఖ్యమైన ఆర్థిక పరమైన వాటిలోనూ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పొదుపు చేయడానికైనా మరియు పెట్టుబడులను ఆశ్రయించడానికైనా మంచిగా ఉంటుంది.

ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మధ్యలో మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మీ ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలు కలిగించే భావోద్వేగ ప్రకోపాల పట్ల జాగ్రత్త వహించండి. మీకు కుటుంబపరంగా పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. అలాగే జనవరి నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఏయే విషయాల్లో కలిసి వస్తుంది.. ఏయే విషయాల్లో కలహాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చదవండి...

చివరి నెలలో..
ఈ నెలలో కర్కాటక రాశి వారిలో కొందరికి ప్రేమ విషయంలో కలిసి వస్తుంది. ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో ప్రేమ పరంగా మానసికంగా మరియు శారీరకంగా చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మీరు అనుకున్నంతగా ఆనందపడకపోవచ్చు. ఈ కాలంలో మీరు మీ భాగస్వామి లేదా ప్రేమికుడి నుండి ఎక్కువగా ఆశించవద్దు. వీనస్ గ్రహం ఈ రాశికి వ్యతిరేకంగా పని చేస్తుంది.

11వ నెలలో..
ఈ నెలలో బుధుడు, శుక్రుడు మరియు సూర్య గ్రహాలు కర్కాటక రాశి వారికి మంచి స్థానాల్లోనే ఉన్నాయి. అయితే మీరు ఈ నెలలో ఏదైనా విషయంలో మీ చుట్టుపక్కల వారి మద్దతు పొందలేరు. అయితే మీరు ఏ పని అయినా సానుకూలంగా ప్రయత్నించండి.తప్పకుండా అనుకూలమైన ఫలితం వస్తుంది.

పదో నెలలో..
ఈ నెలలో కర్కాటక రాశికి మార్స్, అంగారక, శని, వీనస్, మెర్యురీ గ్రహాల ప్రభావం సానుకూలంగా ఉంది. అందువల్ల ఈ కాలంలో మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. మీ విశ్వాస స్థాయిలు బాగా ఉంటాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది ఒక గొప్ప కాలం. ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది.

తొమ్మిదో నెలలో..
కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో బుధగ్రహం ప్రభావం వల్ల పరిస్థితులు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. అయితే మీరు ఎదుటి వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం లేదా వారికి లొంగిపోకుండా చూసుకోవాలి. అలాగే ఈ నెలలో కొన్ని విషయాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. మీ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి.

ఎనిమిదో నెలలో..
కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో అద్భుతంగా ఉంటుంది. యురేనస్ మరియు మార్స్ గ్రహాలు మీకు చాలా స్ఫూర్తిని ఇస్తాయి. మీ రాశిచక్రం చుట్టూ ఏదైనా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే మీరు ఎక్కువగా ఆనందించకండి. భావాలు మరియు భావోద్వేగాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఏడో నెలలో..
ఈ రాశి వారిలో చాలా మంది ఈ నెలలో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు. మీ రాశిచక్రంపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. అందువల్ల మీరు అధిక శక్తిని పొందుతారు. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఈ నెలలో నౌకాయానం చేయవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన వెంచర్లను ప్రారంభించడానికి, సంబంధాన్ని ప్రారంభించడానికి లేదా మీ కలల ఇంటిని నిర్మించడానికి ఈనెలలో మంచిగా ఉంటుంది.

ఆరో నెలలో..
ఈ నెలలో వీనస్ గ్రహం కర్కాటక రాశికి అనుకూలంగా ఉంది. దీని ప్రభావం వల్ల ప్రేమ విషయంలో మీకు సానుకూల ఫలితాలు వెలువడతాయి. ఈ కాలంలో ఆధ్యాత్మికంగా ఉత్తమంగా ఉంటుంది.

ఐదో నెలలో..
ఈ నెలలో కూడా కర్కాటక రాశి వారికి మార్స్, వీనస్ మరియు యురేనస్ గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే మీరు మీ జీవితంలో వినోదం కోసం సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేయకండి. పనులను కూడా అతిగా చేయకండి. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి. సానుకూల పద్ధతిలో పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకోండి.

నాలుగో నెలలో..
మీరు ఈ నెలలో ఏ సంఘటన ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మార్స్ మరియు యురేనస్ మీ రాశికి ప్రయోజనకరంగా ఉన్నందున మీ నైపుణ్యాలు మెరుగవుతాయి. ఈ నెలలో మీరు ఏవైనా పెద్ద వాటిని ఆశిస్తే వాటిని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

మూడో నెలలో..
ఈ నెలలో కర్కాటక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో విజయం లభిస్తుంది. ఈ నెలలో వ్యక్తిగతంగా లేదా పని పరంగా చాలా చక్కగా ఉంటుంది.

రెండో నెల..
కర్కాటక రాశి వారు ఈ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల ప్రభావం చాలా వ్యతిరేకంగా ఉంది. అయితే మీకు సానుకూల ఫలితాలొచ్చేంత వరకు మీరు ఓపికగా ఉండాలి. కోపం మరియు ఒత్తిడికి ఈ నెలలో దూరంగా ఉండాలి. మీ తెలివిని ఉపయోగించి శక్తిని పెంచుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఆధ్యాత్మిక సాధనలను ఆశ్రయించండి.

మొదటి నెల..
ఈ నెలలో కొన్ని విషయాల పట్ల మీరు కఠినంగా ఉంటారు. స్పష్టత లేకపోవడం మరియు రకరకాల సందేహాలు తలెత్తుతాయి. సహనంతో ఉండండి. మీకు సానుకూల ఫలితాలు రావాలంటే మీ విశ్వాస స్థాయిని పెంచాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. మొత్తానికి నెలాఖరులో మీరు మంచి అనుభూతిని పొందుతారు.



Click it and Unblock the Notifications