Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
Chanakya Niti: ఈ 7 విషయాలు గుర్తుంచుకోకపోతే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు
ఎవరైనా ధనవంతులు కావాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాలు పట్టించుకోకపోతే ఎంత ధనవంతులైనా పేదవారు అవుతారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప జ్ఞాని. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రాల్లో లోతైన జ్ఞాన ఉన్న వ్యక్తి. ఆయన రచించిన చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి వివరంగా చెప్పారు. జీవితం గురించి, జీవితంలోని ఎన్నో అంశాల గురించి ఎన్నో వివరాలు చెప్పారు. జీవితం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా సాగేందుకు ఎలాంటి పనులు చేయాలో చక్కగా చెప్పాడు.

మనిషి సంతోషకరమైన జీవితానికి, కష్టాలను దూరం చేయడానికి కొన్ని విధానాలను రూపొందించాడు. వాటి గురించి చాణక్య నీతి పుస్తకంలో వివరించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు. ఎవరైనా ధనవంతులు కావాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాలు పట్టించుకోకపోతే ఎంత ధనవంతులైనా పేదవారు అవుతారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంపదను సక్రమంగా వినియోగించుకోవాలి:
చాణక్యుడి ప్రకారం డబ్బు సంపాదించడం సులువేం కాదు. అలాగే డబ్బును సరిగ్గా ఖర్చు చేయడం కూడా సులువేం కాదు. ఎప్పుడూ డబ్బు వృథా చేయకూడదు. మితిమీరిన డబ్బు వినియోగం మనిషిని పేదరికంలోకి తీసుకెళ్తుంది. చెడు సమయాల కోసం ఎల్లప్పుడూ డబ్బు ఆదా చేయండి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం కూడా అవసరం. డబ్బును సక్రమంగా వినియోగించకపోతే చేతుల్లోంచి నీరులా ప్రవహిస్తుంది. కాబట్టి డబ్బును తెలివిగా ఉపయోగించాలి.

దానం కూడా పొదుపుగా చేయాలి:
దానం చేయడం చాలా మంచిదే అయినా దానం కూడా పొదుపుగా మాత్రమే చేయాలి. సామర్థ్యానికి మించి దానధర్మాలు చేయకూడదని చెప్పాడు చాణక్యుడు. ఆదాయానికి మించి దానం చేయడం వల్ల డబ్బంతా ఖర్చైపోతుంది. కాబట్టి ఎప్పుడూ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయాలి.

మితిమీరిన ఖర్చు ప్రమాదం:
ఖర్చులు అదుపు చేసుకోకపోతే ఎంత సంపాదించినా ఫలితం ఉండదని చెప్పాడు చాణక్యుడు. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ధనవంతులు కాలేరు. ఆ డబ్బును డబ్బు సంపాదించడానికి ఉపయోగించడం సరిగ్గా తెలిసినప్పుడే ధనవంతులు అవుతారని చాణక్యుడు చెప్పాడు.

కష్టసమయం కోసం పొదుపు చేయాలి:
కష్ట సమయంలో జీవితం సాఫీగా సాగడానికి డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఎమర్జెన్సీ కోసం ఎప్పుడూ డబ్బు దాచుకోవాలని చెప్పాడు చాణక్యుడు. సంపాదించిన డబ్బులో కొంత డబ్బు పెట్టుబడులకు, మరికొంత ఎమర్జెన్సీ కోసం సేవింగ్స్ చేసుకోవాలని చాణక్యుడు సూచించాడు.

లక్ష్యం పెట్టుకోండి, దానికోసం కష్టపడండి:
చాణక్య నీతి ప్రకారం ప్రతి మనిషికి భవిష్యత్తు లక్ష్యాలు ఉండాలని వివరించాడు. మంచి లక్ష్యాలు ఉంటేనే వాటి కోసం కష్టపడతామని, కష్టపడి పొదుపు చేస్తామని చెప్పాడు చాణక్యుడు.



Click it and Unblock the Notifications
