Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Chanakya Niti: ఒక వ్యక్తిని నమ్మొచ్చో.. లేదో.. ఇలా తెలుసుకోండి
చాణక్య నీతి మన సమస్యలను పరిష్కరించడానికి సరైన రకమైన వ్యక్తులతో స్నేహం చేయాలనే సూచనలు అందించింది. వ్యక్తులను వారి ముఖాన్ని చూసి నమ్మవద్దని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తులను నమ్మాలో ఇప్పుడు తెలుసుకుంద
నాకెవరూ అవసరం లేదు, ఎవరి సాయం నాకు అక్కర్లేదు, నేను ఒంటరిగానే జీవిస్తా, ఒంటరిగానే విజయాలు సాధిస్తా అనే మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కవుట్ కావు. అవునన్న, కాదన్న మనం సమాజంలో జీవిస్తున్నాం. ఒకరి సాయం, ఒకరితో సఖ్యత లేకపోతే జీవితం సాఫీగా సాగదు. ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరి అవసరం మనకు తప్పకుండా వస్తుంది. అయితే మీరు ఏదైన పని కోసం ఎవరినైనా నమ్మడం అనేది చాలా క్లిష్టతతో కూడుకుని ఉంటుంది. మనవారిని నమ్ముతాం. కానీ బయటివారిని ఎలా నమ్మడం.

చాణక్య నీతి మన సమస్యలను పరిష్కరించడానికి సరైన రకమైన వ్యక్తులతో స్నేహం చేయాలనే సూచనలు అందించింది. వ్యక్తులను వారి ముఖాన్ని చూసి నమ్మవద్దని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తులను నమ్మాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పేవారు:
కొంతమంది నవ్వుతూ చక్కగా మాట్లాడతారని, కానీ మనసులో మరొకటి ఉంటుందని చెప్పాడు చాణక్యుడు. అలా కాకుండా మనసులో ఏ కల్మషం లేకుండా, పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా, అనిపించింది అనిపించినట్లుగా చెప్పే వారిని నమ్మవచ్చని చాణక్యుడు చెప్పాడు. వారి మాట మొరటుగా, కటువుగా ఉన్నా.. వారిని నమ్మవచ్చని చెప్పాడు చాణక్యుడు.
అయితే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తన మాటల ద్వారా ఎప్పుడూ తెలుసుకోలేమని, వారి చర్యల ద్వారానే వారి అసలు వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని ఆచార్యుడు చెప్పాడు.
స్వార్థపరులా.. కాదా..:
ఒక వ్యక్తి స్వార్థపరుడా లేదా నిస్వార్థంగా ఉన్నాడో లేదా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి కనీసం కొంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా.. మీ కోరికలకు అనుగుణంగా ఉన్నారా లేదా తెలుసుకోండి. ఒకరి కోసం తన సొంత ఆనందాన్ని కూడా వదులుకునే వ్యక్తి మీరు కళ్లు మూసుకుని విశ్వసించవచ్చని చాణక్యుడు చెప్పాడు.
విశ్వాస కోసం త్యాగం చేసే వ్యక్తి:
ప్రజల పట్ల నిస్వార్థంగా వ్యవహరించే వ్యక్తిని ఎప్పుడైనా నమ్మవచ్చని చాణక్యుడు చెప్పాడు. వారి మనస్సులో వారి సొంత ఆసక్తి ఉన్న వ్యక్తులు, వారి ఉద్దేశంలో దేనినైనా నెరవేర్చకపోతే, కష్ట సమయాల్లో మిమ్మల్ని కచ్చితంగా వదిలివేస్తారు. వారు వినడానికి మంచి విషయాలన్నీ చెబుతూ ఉండొచ్చు. మీకు సహాయం అవసరమైనప్పుడు వారు సరైన సమయంలో పరారీలో ఉండొచ్చు.
ఇతరుల గురించి తప్పులు చెప్పే వ్యాక్తి:
ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడే వ్యక్తిని ఎప్పటికీ నమ్మవద్దని చాణక్యుడు చెప్పాడు. ఇతరుల ముందు ఒకలా, వారు లేనప్పుడు మరోలా మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. వారు మీ వద్ద కూడా ఒకలా మాట్లాడి, లేనప్పుడు మరోలా మాట్లాడతారని గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications