Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: ఈ పద్ధతులతో సంపద సృష్టించొచ్చు, అవేంటంటే..
డబ్బు సంపాదించడానికి, సంపద సృష్టించడానికి చాణక్యుడు అనేక మార్గాలు చెప్పాడు. కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపద సృష్టించవచ్చని సూచించాడు. చాణక్యుడు చెప్పిన ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

మనిషి జీవితానికి సంపదకు మధ్య ఉన్న అనుబంధం గురించి చాణక్యుడు ప్రత్యేకంగా చెప్పాడు. డబ్బు సంపాదించడానికి, సంపద సృష్టించడానికి చాణక్యుడు అనేక మార్గాలు చెప్పాడు. కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపద సృష్టించవచ్చని సూచించాడు. చాణక్యుడు చెప్పిన ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్యంపై గురి పెట్టాలి:
ఎక్కువ డబ్బు సంపాదించాలన్న తపన మీకు ఉంటే దానిపైనే మీ దృష్టినంతా కేంద్రీకరించాలి. మంచి సంపాదన సామర్థ్యం ఉన్న వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకోవాలి. డబ్బు సంపాదించడానికి, దానిపై మీ దృష్టిని అంతరాయం లేకుండా ఉంచడానికి ధర్మబద్ధమైన మార్గాలను అవలంభించాలి.
వ్యాపారంలో, వృత్తిలోనైనా అనైతికంగా, అక్రమంగా వచ్చిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. దానికి విలువ కూడా ఉండదు. కాబట్టి ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించకూడదు.
కష్టాన్ని, వ్యూహాలను నమ్ముకుని ముందుకు సాగాలి. అవకాశాలు అన్వేషిస్తూ, రిస్క్ లు తీసుకునే ఆలోచనతో ఉంటే సంపద సృష్టి జరగుతుంది.
ఉపాధి అవకాశాలున్న చోట ఉండాలి:
వైద్య సదుపాయం, వ్యాపారులు, బ్రాహ్మణులు, సైనికులు, నదులు, ఉద్యోగావకాశాలు ఉన్న ప్రాంతాల్లో నివసించాలి. చేతినిండా పని ఉంటేనే పని చేస్తాం. లేకపోతే ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. అలాగే అన్ని రకాల అవసరాలు తీరే ప్రాంతంలో ఉంటే ఎక్కువ మొత్తం ప్రయాణ ఖర్చులు లేకుండా మీ అవసరాలు తీరిపోతాయి.
జీవన వ్యయం తక్కువగా ఉన్న చోట నివసించడం ఉత్తమం. దాని వల్ల రోజువారీ ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు ఇతరుల డాపూదర్ఫం చూసి మనం కూడా వారిలా బట్టలు వేసుకోవాలన్నా కోరిక కలగకుండా ఉంటుంది.
పెట్టుబడి పెట్టాలి:
డబ్బు దాచుకుంటే దాని విలువ పడిపోతుంది తప్ప పెరగదు. డబ్బు విలువ పెరగాలంటే దానిని పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టినప్పుడే మీ డబ్బు.. డబ్బును సంపాదిస్తుంది, సంపద సృష్టిస్తుంది. మీకు వచ్చే కొంత మొత్తం అయినా.. దానిని పెట్టుబడిగా మార్చాలి.
కష్టసమయం కోసం పొదుపు చేయాలి:
అన్ని రోజులు మనవి కావు. రోజులన్నీ సాఫీగా సాగుతున్నాయంటే ముందు ముందు సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. జీవితం ఎప్పుడూ గీతలా సాగదు. రోలర్ కోస్టర్ లా ఎత్తుపల్లాలు ఉంటాయి.
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కష్టాలు వస్తే ఎలా మెలగాలో ఆలోచించుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.



Click it and Unblock the Notifications