For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti : ఇలాంటి చోట ఇల్లు కట్టుకోవద్దు.. ఆర్థిక పరంగా ఇబ్బందులు రావొచ్చు...!

|

సాధారణంగా మనలో చాలా మంది ఇంటిని నిర్మించుకోవడానికి వాస్తు శాస్త్రాన్ని పాటిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం అగ్నేయంలో వంట గదిని, ఈశాన్యంలో బరువు ఎక్కువ ఉండటం వంటి ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు.

ఇదిలా ఉండగా.. చాణక్యుడు కూడా ఇల్లు, భూమి గురించి కొన్ని కీలకమైన విషయాలను వివరించాడు. చాణక్యుడు గొప్ప ఆర్థిక వేత్త అయినప్పటికీ తనకు న్యాయ శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే పూర్వ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఆయన విధానాలు ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు.

వీటితో పాటు ఆచార్య చాణక్యుడు తన విధానాలను జీవితంలోని ప్రతి అంశంపైనా ప్రస్తావించారు. ఏ వ్యక్తి అయినా వారి విధానాలను అనుసరించి విజయవంతమైన, సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఒక మనిషి సంతోషంగా, ప్రశాంతంగా, విజయం సాధించే విధంగా ఉండేందుకు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే వివరాలను స్పష్టంగా చెప్పారు.

ఈ సందర్భంలోనే ఎవరైనా ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ 5 ప్రాంతాల్లో ఇంటిని నిర్మించొద్దని హెచ్చరించారు. ఒకవేళ అలాంటి ప్రాంతాల్లో ఇళ్లను నిర్మిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. వాటిని ఎలా అధిగమించాలనే వివరాలను చాణక్య నీతిలో పేర్కొన్నారు. ఇక అసలు విషయానికొస్తే చాణక్యుని ప్రకారం, ఏయే చోట ఇల్లు కొనుగోలు చేయడం మంచిది.. ఏయే చోట్ల ఇల్లు కట్టకూడదు.. అనే విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Sun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలుSun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు

నీరు తక్కువగా ఉండే చోట..

నీరు తక్కువగా ఉండే చోట..

చాణక్య నీతి ప్రకారం, మనలో ఎవరైనా కొత్త ఇంటిని నిర్మించాలనుకుంటే.. ఆ ఇంటికి సమీపంలో నది, లేదా చెరువు ఉండేలా చూసుకోవాలి. ఎక్కడైతే నీటి సమస్య ఎక్కువగా ఉంటుందో.. నీరు ఎక్కడ తక్కువగా ఉంటుందో అటువంటి చోట ఇల్లు నిర్మించుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయట. ఎందుకంటే నీటితోనే మనం.. నీటితోనే జనం.. నీళ్లతోనే పండుగ.. నీళ్లుంటేనే మనకు పండుగ. కాబట్టి మీరు ఏదైనా ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టేటప్పుడు నీరు మంచిగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇంటిని నిర్మించుకోవద్దు.

మత విశ్వాసాలు లేని చోట..

మత విశ్వాసాలు లేని చోట..

మన దేశంలో అనేక మతాల వారు నివసిస్తున్నారు. కాబట్టి మీరు మత విశ్వాసాలు లేని చోట ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేయకూడదు. ఎందుకంటే మనలో చాలా మంది దేవునిపై నమ్మకం కలిగి ఉన్నారు. ఇలాంటి చోట ఇంటిని నిర్మిస్తే మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మత విశ్వాసం ఉన్న చోట ఇంటిని నిర్మిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి.

Sun Transit in Gemini on 15 June 2021: మిధునంలోకి సూర్యుడి సంచారంతో.. ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు...!Sun Transit in Gemini on 15 June 2021: మిధునంలోకి సూర్యుడి సంచారంతో.. ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు...!

సమాజానికి దూరంగా..

సమాజానికి దూరంగా..

ఇప్పటితరం వారిలో చాలా మంది సమాజానికి దూరంగా లేదా ఊరికి దూరంగా మంచి ఇంటిని నిర్మించుకోవాలని ఆశిస్తూ ఉంటారు. అయితే చాణక్య నీతి ప్రకారం అలా కట్టుకుంటే మనశ్శాంతి ఉండదట. అంతేకాదు ఆర్థిక పరంగా ఎక్కువగా సమస్యలు వస్తాయట. కాబట్టి ఊళ్లలో ఉండే కాలనీల్లో లేదా ఊరికి సమీపంలో ఉండే చోట కొత్త ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేయాలట.

ఆసుపత్రులు లేనిచోట..

ఆసుపత్రులు లేనిచోట..

మీరు కొత్తగా కట్టుకునే ఇంటి దగ్గర్లో ఒక పెద్దాసుపత్రి ఉందా లేదా అనేది చూసుకోవాలట. మీరు కొత్తగా కట్టుకుబోయే ఇంటికి దగ్గర్లో ఆసుపత్రి లేకపోతే.. అక్కడ మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ప్రయోజనం ఉండదట. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుప్రతికి తీసుకెళ్లేందుకు అనువైన ప్రదేశం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాతావరణం సరిగా లేనిచోట..

వాతావరణం సరిగా లేనిచోట..

ఎవరైనా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని లేదా భూమిని కొనాలని చూస్తుంటే.. అక్కడి వాతావరణాన్ని పరిశీలించాలట. ఎందుకంటే మీరు ఇల్లు కట్టే చోట వాతావారణం అనువుగా లేకపోతే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. ముఖ్యంగా వ్యాపారులకు దీని వల్ల అనేక ప్రతికూల సమస్యలు ఎదురవుతాయట. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో మీరు ఇల్లు కొనడం లేదా కట్టడం వంటివి చేయకండి.

English summary

Chanakya Niti in Telugu: Never Choose These Five Places to Stay

Here we are talking about the Chanakya Niti in Telugu: Never Choose These Five Places to Stay. Have a look
Story first published: Friday, June 11, 2021, 18:01 [IST]