For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti: ఇవి అత్యంత శక్తివంతమైనవి.. ధనవంతులను చేస్తాయి, విజయవంతులనూ చేస్తాయి

ప్రతి మనిషి జీవితంలో ఇవి చాలా శక్తివంతమైనవని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ మోస్ట్ పవర్‌ఫుల్‌ విషయాలు ఏమిటో, అవి ఎందుకు అలా పరిగణించబడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|

చాణక్యుడు ప్రాచీన భారతీయ తత్వవేత్త, రాజ సలహాదారు, చాణక్య అర్థశాస్త్రం గ్రంథం ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఆర్థిక సంబంధిత అంశాల గురించి అందులో వివరించాడు. ఆర్థిక రంగానికి చెందిన ఎన్నో అంశాల గురించి ఆయన చెప్పాడు. ఆనాడు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ అనుసరణీయమే. ఆయన ఒక వ్యక్తి జీవితంలోని సమస్యల గురించి కూడా చాలా చెప్పాడు.

Chanakya Niti: Most powerful thing in the world that can make you rich and successful in Telugu

ఆచార్య చాణక్యుడు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎంతో రాణించాడు. అలాగే అన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. మానవ జీవితం సజావుగా, సాఫీగా సాగేందుకు ఎన్నో నీతి సూక్తులు చెప్పాడు. ప్రతి మనిషి జీవితంలో ఇవి చాలా శక్తివంతమైనవని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ మోస్ట్ పవర్‌ఫుల్‌ విషయాలు ఏమిటో, అవి ఎందుకు అలా పరిగణించబడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: మహిళలు ఈ విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..Chanakya Niti: మహిళలు ఈ విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..

జ్ఞానం:

జ్ఞానం:

చాణక్యుడు విద్య యొక్క ప్రాముఖ్యత అనేక సందర్భాల్లో చెప్పాడు. ప్రతి మనిషి విద్య చాలా ముఖ్యమని సూచించాడు. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాణక్యుడు వివరించాడు. విద్య ఒకరి మనస్సును విశాలం చేయడమే కాకుండా, వారి నిర్ణయాత్మక సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని వారు ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందజేస్తుందని చాణక్యుడు చెప్పాడు.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దుChanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దు

పట్టుదల:

పట్టుదల:

ఆచార్య చాణక్య నీతి ప్రకారం కృషికి, పట్టుదలకు చాలా విలువ ఉంది. నిరంతర కృషి, దృఢ సంకల్పంతో ఎలాంటి విజయాన్ని అయినా అందుకోవచ్చని చాణక్యుడు చెప్పాడు. ప్రజలు తమ పనిలో శ్రేష్ఠత కోసం కృషి చేయాలని, కష్టాలు ఎదురైనప్పటికీ పట్టుదలను ఎప్పటికీ వదులుకోవద్దని చాణక్యుడు సూచించాడు.

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారుChanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు

అవగాహన:

అవగాహన:

అన్ని విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకం. ముఖ్యంగా జీవితంపై ప్రభావం చూపించే విషయాల్లో సరైన అవగాహన కలిగి ఉండకపోతే జీవితాంతం బాధ పడాల్సి వస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆర్థిక విషయాల్లో అవగాహన, జ్ఞానం లేకుండా ముందడుగు వేయకూడదని అన్నాడు కౌటిల్యుడు. తెలివైన పెట్టుబడులు, పొదుపుగా జీవించడం ద్వారా సంపదను పోగు చేయాలని కౌటిల్యుడు సూచించాడు. తాను సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని, పొదుపుకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..

మనసు చదవగలగడం:

మనసు చదవగలగడం:

చాణక్య నీతి మానవ మనస్తత్వశాస్త్రం, దౌత్య కళ పై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. విజయాన్ని సాధించడానికి మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా కీలకమని, ప్రజలను వ్యూహాత్మకంగా మరియు దౌత్యంతో వ్యవహరించగలగాలని చాణక్యుడు బోధించాడు. జీవితంలో విజయానికి తెలివితేటలు, జ్ఞానం రెండూ అవసరమని చెప్పాడు.

సంపద, శకి, జీవితంలో విజయం సాధించాలని కోరుకునే ఎవరికైనా చాణక్య నీతి ఒక శక్తివంతమైన సాధనం. విద్య, కృషి, ఆర్థిక అవగాహన, మనస్తత్వశాస్త్రంపై ఆచార్య చాణక్యుడు చేసిన బోధన నేటికీ అనుసరణీయమే. చాణక్యుడు చెప్పిన సలహాలు, సూచనలు జీవితంలో పాటించడం ద్వారా ప్రతి వ్యక్తి ధనవంతులు అవడంతో పాటు ప్రతి పనిలో విజయం సాధించగలరు.

Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుందిChanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది

English summary

Chanakya Niti: Most powerful thing in the world that can make you rich and successful in Telugu

read this to know Chanakya Niti: Most powerful thing in the world that can make you rich and successful in Telugu
Story first published:Friday, February 3, 2023, 11:25 [IST]
Desktop Bottom Promotion