Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: ఈ ధోరణి ఉన్న వ్యక్తులకు వర్తమానం కలిసిరాదు, భవిష్యత్తు ఉండదు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. కొంత మంది వ్యక్తుల ధోరణి వారికి చేటు చేస్తుందని చెప్పాడు ఆచార్యుడు. అలాంటి ధోరణి ఉన్న వ్యక్తులకు వర్తమానంలో కాలం కలిసిరాదని, భవిష్యత్తు కూడా దుర్భరంగా ఉంటుందని హెచ్చరించాడు.
అత్యాశ:
జీవితంలో సౌకర్యం కీలకమని చెప్పాడు చాణక్యుడు. సౌకర్యవంతమైన చోట, ఇంట్లో మాత్రమే మనశ్శాంతిగా జీవించగలమని లేదంటే ఇబ్బందులతో ఎక్కువ కాలం వెల్లదీయలేమని చెప్పాడు.
సౌకర్యవంతమైన జీవితం గడపాలంటే డబ్బు కావాల్సిందేనని చెప్పాడు చాణక్యుడు. అది అత్యాశగా మారొద్దని సూచించాడు. అత్యాశ, దురాశకు, నీచత్వానికి దారి తీస్తుందని దీని వల్ల వ్యక్తిత్వం కోల్పోవడంతో పాటు పాపాలు మూటగట్టుకుంటారని హెచ్చరించాడు.
నిజాయితీ లేకపోవడం:
చెడ్డ అలవాట్లు చాలా మందికి ఉంటాయి. అయితే వాటిని నియంత్రించుకోగలగడమే జీవితమని చెప్పాడు చాణక్యుడు. అబద్ధం చెప్పడం వల్ల ఆ క్షణంలో ప్రయోజనం పొందవచ్చు. కానీ దీర్ఘకాలంలో అది మీకు తప్పకుండా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పాడు చాణక్యుడు.
ఆచార్యుడి ప్రకారం చెడు అలవాట్లు, తప్పుడు ధోరణి ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉండదని ఆ పాపం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని చెప్పాడు ఆచార్యుడు.
కోపం:
కోపం ఓ భావోద్వేగం. ప్రతి మనిషి ఉండే భావోద్వేగం ఇది. అయితే కోపాన్ని నియంత్రించుకోగలిగిన వారే నిజమైన వ్యక్తులని చెప్పాడు చాణక్యుడు. ఏదైనా నచ్చనిది జరిగినప్పుడు, ఊహించింది కాలేనప్పుడు, నమ్మకం కోల్పోయిన సమయంలో కోపం రావడం సహజం. అయితే ఆ కోపాన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి, కానీ కోపం నియంత్రణలోకి మనం వెళ్లకూడదని చెప్పాడు చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications