Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలున్న పురుషులంటే స్త్రీలకు ఎంతో ఇష్టం, అవేంటంటే..
చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలున్న పురుషులను గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఆ లక్షణాలను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు. ఆ లక్షణాలు ఉన్న పురుషుల పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారని వివరించాడు. అలాంటి
ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వం, అతను ఎలా ఉంటాడో వెల్లడిస్తుంది. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి సద్గుణాలతో ఉండాలని కోరుకుంటుంది. అతను జీవితాంతం తమతో ఉండాలని కోరుకుంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి స్వభావాలు, యోగ్యతలు, దోషాలను వివరించి చెప్పాడు. అందులో స్త్రీలు ఇష్టపడే పురుషుల లక్షణాలను కూడా వివరించాడు.

చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలున్న పురుషులను గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఆ లక్షణాలను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు. ఆ లక్షణాలు ఉన్న పురుషుల పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారని వివరించాడు. అలాంటి పురుషులను సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. స్త్రీలను ఆకర్షించే ఆ పురుష లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజాయితీ:
నిజాయితీ ఉన్న వ్యక్తికి ప్రతి చోటా గౌరవం లభిస్తుందని చాణక్యుడు చెప్పాడు. నిజాయితీ ఉన్న వ్యక్తులు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. వారు ఎప్పుడూ మోసం చేయరు. అలాంటి పురుషులతో సంబంధం విజయవంతం అవుతుంది. సంతోషంగా, కలకాలం ఉంటుంది. అందుకే నిజాయితీ ఉన్న వ్యక్తులను స్త్రీలు ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు.

మంచి ప్రవర్తన:
మంచి నడవడిక, మృదు స్వభావం, సౌమ్యత ప్రతి మగాడిలో స్త్రీ కోరుకునే లక్షణాలు. మంచి ప్రవర్తన ఉండే పురుషులను స్త్రీలు కోరుకుంటారు. వారితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తారు. వారితో స్నేహంగా ఉంటారు.

మంచి శ్రోత:
ప్రతి స్త్రీ తన భర్త ఎప్పుడూ నీటలా తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. వారు చెప్పేది చక్కగా వినే వారు కావాలని స్త్రీలు కోరుకుంటారు. మంచి శ్రోతలను స్త్రీలు ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు.

విశ్వసనీయత:
చాణక్యుడి ప్రకారం ఏ సంబంధంలోనైనా పరస్పర విశ్వాసం చాలా ముఖ్యం. ఒక స్త్రీ పురుషుడికి వ్యక్తిగతంగా ఏదైనా చెబితే అతను దానిని తనలో ఉంచుకుంటే అలాంటి పురుషులను స్త్రీలు బాగా ఇష్టపడతారు. తమ నమ్మకాలను రాజీ పడని, మాటలకు విలువ ఇచ్చే పురుషులను మహిళలు ప్రేమిస్తారు.

భద్రతా:
భద్రత, రక్షణ కల్పించే పురుషులను మహిళలు ఇష్టపడతారు. వారితో ఉన్నప్పుడు వారు సేఫ్‌గా ఫీలవ్వాలి. తండ్రి, అన్నతో ఉన్నప్పుడు ఎంత భద్రంగా ఉన్నారని అనుకుంటారో అలాంటి సేఫ్ ఫీలింగ్ కల్పించే వ్యక్తులను స్త్రీలు ఇష్టపడతారు.

గౌరవం:
చాణక్యుడి ప్రకారం స్త్రీలు ఇతరులను ఎలా గౌరవించాలో తెలిసిన పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలు ఎప్పుడు ఎవరినీ గౌరవించని, బాధపెట్టే పురుషులను ద్వేషిస్తారు.

మర్యాదగల వ్యక్తులు:
చాణక్యుడి నీతి ప్రకారం స్త్రీలు మంచి పురుషులను త్వరగా ఇష్టపడతారు. అంటే అహంకారం లేని వారు అలాగే ఏ తప్పు చేసినా అంగీకరించేవారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు త్వరగా ఇష్టపడతారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పురుషుడితో తమ రిలేషన్ చాలా బాగుంటుందని స్త్రీలు నమ్ముతారు. కాబట్టి మనిషి మొదట మర్యాదగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications
