Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
ప్రతి వ్యక్తి కొన్ని పనుల తర్వాత ఎట్టిపరిస్థితుల్లో స్నానం చేయాలని చాణక్యుడు చెప్పాడు. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్య నీతి భారతీయ పురాతన గ్రంథం. మౌర్య సామ్రాజ్యానికి ప్రఖ్యాత పండితుడు, సలహాదారు అయిన ఆచార్య చాణక్యుడి బోధనలు, తెలివైన సూక్తుల సంకలనం ఈ గ్రంథం. విజయవంతమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకంగా చాణక్య నీతి పుస్తకం పరిగణించబడుతోంది. ఈ గ్రంథంలోని చాలా అంశాలు నేటికీ ఆచారణీయం.

మనిషి సంతోషకరమైన జీవితానికి, కష్టాలను దూరం చేయడానికి కొన్ని విధానాలను రూపొందించాడు చాణక్యుడు. వాటి గురించి చాణక్య నీతి పుస్తకంలో వివరించాడు. ప్రతి వ్యక్తి కొన్ని పనుల తర్వాత ఎట్టిపరిస్థితుల్లో స్నానం చేయాలని చాణక్యుడు చెప్పాడు. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్మశానం నుండి వచ్చాక స్నానం చేయాలి:
హిందూ మతంలో, అంత్యక్రియలు నది ఒడ్డున లేదా చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. మృతదేహం పంచభూతాల్లో కలిసిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్న వారు అక్కడే ఉండే నదుల్లో, కాల్వల్లో, చెరువుల్లో స్నానం చేసి రావాలన్న ఆచారం ఉంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత మృతదేహం చుట్టూ అన్ని రకాల సూక్షక్రిములు వస్తాయి. అంత్యక్రియల్లో పాల్గొనే వారి శరీరానికి మరియు దుస్తులకు అంటుకుంటాయి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతాయి. అందుకే శ్మశానం నుండి వచ్చిన తర్వాత ఇంటి బయట బట్టలు తీసేసి స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్లాలని చాణక్యుడు చెప్పాడు.

సంభోగం తర్వాత స్నానం చేయాలి:
లైంగిక సంపర్కం తర్వాత స్నానం చేయడం చాలా కీలకమని చాణక్యుడు చెప్పాడు. స్త్రీ లేదా పురుషుడు శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత శరీరం అపరిశుభ్రంగా మారుతుందని, అందుకే కలయిక తర్వాత స్నానం చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. లైంగిక సంపర్కం వేళ ఇద్దరు భాగస్వాములకు ఒకరి నుండి ఒకరికి లైంగిక వ్యాధులు సోకే అవకాశం ఉంది. సంపర్కం తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా వ్యాధులు సోకే అవకాశాన్ని తగ్గించవచ్చన్నది దీని వెనక దాగి ఉన్న సైన్స్.

క్షవరం చేయించుకున్న తర్వాత స్నానం:
వెంట్రుకలను కత్తిరించుకున్న తర్వాత స్నానం చేయాలని చాణక్యుడు చెప్పాడు. స్నానం చేయనిదే ఇంట్లోకి అడుగుపెట్టకూడదని సూచించాడు. స్నానం చేయకుండా ఇంట్లోకి ప్రవేశిస్తే అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జుట్టు కత్తిరించుకున్న తర్వాత, షేవింగ్ చేయించుకున్న తర్వాత వెంట్రుకలు చాలా చిన్న చిన్న వెంట్రుకలు కంటికి కనిపించనివి ఒంటిపై పడతాయి. స్నానం చేయకుండా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అవి ఇంట్లోనూ పడిపోతాయి. ఈ వెంట్రుకలు దుమ్ము ధూళిలో కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి ప్రవేశించవచ్చు. ఇలా వెళ్లడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.



Click it and Unblock the Notifications