Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి, వారితో జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు
చాణక్య నీతి ప్రకారం కొన్ని రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వారు జీవితంలో ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించాడు చాణక్యుడు.
ఏ ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. ఒడిదొడుకులు ఉంటాయి, కష్టనష్టాలు ఉంటాయి, సుఖదుఃఖాలూ ఉంటాయి. స్నేహితుని జీవితం ఒకలా ఉండొచ్చు, మీ జీవితం మరోలా ఉండొచ్చు. జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సంతోషాలు ఎవరికీ ఒకేలా ఉండవు. చాణక్య నీతి ప్రకారం కొన్ని రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వారు జీవితంలో ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించాడు చాణక్యుడు.

అత్యాశ, స్వార్థపరులు:
అత్యాశ, స్వార్థపరుల నుండి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. ఈ రకమైన వ్యక్తులు వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే శ్రద్ధ వహిస్తారు. ఇతరులను బాధపెట్టడం ద్వారా కూడా వారు అనుకున్న వాటిని సాధిస్తారు. వారు కోరుకున్న నెరవేరడానికి ఏదైనా చేస్తారు. వారు మానిప్యులేటివ్, మోసపూరితంగా ఉంటారు. అత్యాశపరులు, స్వార్థపరులు వారి చుట్టూ ఉండే వారికి హాని కలిగిస్తారు. ఇలాంటి వ్యక్తులతో సహవాసం మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారితో కలిసి ఉండటం వల్ల సమస్యలు వస్తాయని, కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు హెచ్చరించాడు.

నీతి, నిజాయితీ లేని వ్యక్తులు:
నీతి, నిజాయితీ లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించాడు. ఈ వ్యక్తులను విశ్వసించలేము. నీతి లేని వారు, నిజాయితీ మచ్చుకైనా లేని వ్యక్తులు వారి సొంత లాభం కోసం ఇతరులకు ద్రోహం చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి వ్యక్తులు ఇతరులతో సఖ్యతగా ఉంటారు. తీపి ప్రవర్తనతో వ్యవహరిస్తారు. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అదను చూసి దాడి చేస్తారు. వారి నిజస్వరూపాన్ని బయటపెడతారు.

సోమరిపరులు, ఆశయం లేనివారు:
జీవితంలో ఎలాంటి ఆశయం లేనివారు, సోమరితనం ఉన్నవారు జీవితంలో పైకి రాలేరు. అలాంటి వారితో సహవాసం ఎప్పటికీ నష్టాన్నే చేకూరుస్తుంది. ఈ వ్యక్తుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా తిరిగి నష్టం చేకూర్చవచ్చు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు వివరించాడు.

కోపం, హింస:
త్వరగా కోపం వచ్చే వ్యక్తులు, ఇతరులను హింసించే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఈ వ్యక్తులు శారీరక హాని కలిగించవచ్చు, సంఘర్షణ, గందరగోళానికి దారి తీస్తుంది. అందుకే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు.
కొన్ని రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. ఈ సలహా ఆకాలంలోనే కాకుండా నేటికీ ఆచరణీయమే. తప్పుడు వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల హాని కలుగుతుంది. వ్యక్తిగత ఎదుగుదల, విజయాన్ని నిరోధించవచ్చు. అత్యాశ, స్వార్థపరులు, చిత్తశుద్ధి, నిజాయితీ లేనివారు, సోమరితనం, ఆశయం లేనివారు, కోపం, హింసకు గురయ్యే వారికి దూరంగా ఉండాలి. మరింత ప్రశాంతమైన, సంపన్నమైన జీవితాన్ని సాగించడానికి అలాంటి వారితో సహవాసం చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications