Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
Chanakya Niti: మీరు పుట్టకముందే ఈ విషయాలు నిర్ణయించబడతాయి, వాటిని ఇలా మార్చేసుకోవచ్చు
ప్రతి వ్యక్తి జీవితంలో 5 విషయాలు పుట్టకముందే నిర్ణయించబడతాయని చాణక్యుడు తన నీతి గ్రంథంలో వివరించాడు. దీంతో పాటు, కర్మను ఎలా మార్చవచ్చో కూడా చెప్పాడు. పుట్టకముందే నిర్ణయించుకున్న ఆ ఐదు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, పండితుడు, వ్యూహకర్త, మార్గదర్శకుడు. రాజనీతి, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, ఆధ్యాత్మికత సహా అనేక అంశాలపై ఎన్నో సూచనలు చేశాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలో శాంతియుతంగా జీవించడానికి ఎన్నో విధానాలను పేర్కొన్నాడు.

ప్రతి వ్యక్తి జీవితంలో 5 విషయాలు పుట్టకముందే నిర్ణయించబడతాయని చాణక్యుడు తన నీతి గ్రంథంలో వివరించాడు. దీంతో పాటు, కర్మను ఎలా మార్చవచ్చో కూడా చెప్పాడు. పుట్టకముందే నిర్ణయించుకున్న ఆ ఐదు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలోని నాల్గో అధ్యాయంలో ఓ శ్లోకం చెప్పాడు.
ఆయుః కర్మ చ విద్యా చ విత్తం నిధానమేవ చ|
పశ్చైతాని విలిఖ్యన్తే గర్భస్థస్తైవ దేహిన్ః||
వయస్సు, కర్మ, సంపద, జ్ఞానం, మరణం.. ఈ ఐదు విషయాలు మనిషి కడుపులోకి వచ్చినప్పుడు ఒకేసారి నిర్ణయించబడతాయి. సాధారణంగా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.
కర్మను తిరస్కరించలేము:
కర్మ కాదనలేని వాస్తవమని చాణక్యుడు చెప్పాడు. ఇదే ప్రతిదానికీ మూమని చాణక్యుడు వివరించాడు. దీన్నే ప్రారబ్ధం అంటారు. కర్మలు చేయడమే మనిషి ప్రథమ కర్తవ్యమని శాస్త్రాల్లో చెప్పబడింది. దృఢ సంకల్పంతో చేసే పనితో కర్మను కూడా మార్చుకోవచ్చని చాణక్యుడు చెప్పాడు.
ధర్మార్థకామమోక్షేషు యస్యకోऽపి న విద్యతే|
జన్మ-జన్మని మాత్రయేషు మరణం తస్య కేవలం||
మనిషి జీవితం ధర్మం, అర్థ, కామ, మోక్షం అనే నాలుగు ప్రధాన ప్రయోజనాల కోసం సృష్టించబడిందని అర్థం. ఈ నాలుగింటిలో ఒక్కటి కూడా పొందనివాడు చనిపోవడానికి మాత్రమే పుడతాడు. ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి పని చేయడం ద్వారా మాత్రమే సంపదను సృష్టించడగలడని చెప్పాడు.
జీవిత కాలం:
పుట్టకముందే మనిషి జీవిత కాలం నిర్ణయించబడుతుందని చెప్పాడు చాణక్యుడు. అందుకే ఉన్నంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం చాలా అవసరమని చాణక్యుడు చెప్పాడు.
సంపద మొత్తం:
కష్టపడటం, అదృష్టం సంపద పొందడానికి కీలకం. అయితే ఒక వ్యక్తి ఎంత సంపద కూడబెడతాడనేది ముందే నిర్ణయించబడి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అయితే పట్టువదలని ధోరణితో ఉంటే ఎవరైనా సంపద సృష్టించవచ్చన్నాడు.
సంబంధాలు:
సంబంధాలు సంక్లిష్టమైనవి. ఎవరితో ఎప్పుడు ఎలాంటి సంబంధం ఏర్పడుతుందో, అది ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేం. అయితే మంచి ప్రవర్తన, మంచి మాట తీరు, వ్యక్తిత్వంతో అజాతశత్రువులా మారవచ్చని చాణక్యుడు చెప్పాడు.
జ్ఞానం:
తెలివితేటలు, విశ్లేషణాత్మక, సృజనాత్మక, భావోద్వేగ మేధస్సు వంటివి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అయితే నేర్చుకోవాలన్న తపన ఉన్న వ్యక్తికి ఇవేవీ పుట్టుకతో పాటు రాకపోయినా జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని చాణక్యుడు చెప్పాడు.
మరణం:
ప్రతి జీవికి మరణం అనివార్యం. పుట్టుక సమయంలోనే మరణం నిర్ణయించబడుతుందని, కానీ మంచి జీవనశైలితో జీవన కాలాన్ని పెంచుకోవచ్చని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications