Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: శత్రువులను ఓడించడానికి చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేయండి
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

మనిషి జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని పనులు చేయాలన్నాడు చాణక్యుడు. అందులో మొదటిది, విస్మరించకూడనిది శత్రువులను లేకుండా చేసుకోవడం. శత్రువులు అంటే వారు ఎప్పుడూ మంచి అవకాశం చూస్తూ, అవకాశం చిక్కగానే మన ఓటమి కోసం పని చేస్తారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి అవకాశవాదులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ముందుకు సాగాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఎలాంటి చర్యలతో శత్రువులను అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఎవరో ఒకరు శత్రువులు ఉంటారని చెప్పాడు. శత్రువులపై విజయం సాధించడానికి ఒక వ్యక్తి తెలివిని కలిగి ఉండటం చాలా ముఖ్యమని చెప్పాడు ఆచార్యుడు. విజయవంతమైన వ్యక్తికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారని, వారు ఎప్పుడూ అతనికి హాని చేయడానికి ప్రయత్నిస్తారని చాణక్యుడు చెప్పాడు.
సరైన సమయం కోసం వేచి చూడాలి:
ఆచార్య చాణక్యుడు శత్రువు మీ కంటే శక్తివంతంగా ఉన్నప్పుడు, వెనకడుగు వేయాలని చెప్పాడు. తర్వాత శక్తి సమకూర్చుకుని, సరైన వ్యూహం ఆలోచించి, సరైన స్థలంలో, సరైన విధంగా ఎలా దెబ్బ కొడితే శత్రువు కోలుకోలేకుండా పోతాడో ఆలోచించాలని చెప్పాడు చాణక్యుడు. సరైన సమయం కోసం వెయిట్ చేసి, అదను చూసి దెబ్బ తీయాలని చాణక్యుడు చెప్పాడు. ఈ సూచనలు పాటించడం ద్వారా శత్రువుపై విజయం సాధించవచ్చని చాణక్యుడు చెప్పాడు.
శత్రువు కదలికలపై నిఘా ఉంచాలి:
ఆచార్య చాణక్యుడి ప్రకారం శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, మన కంటే బలహీనమైన వారిగా ఎట్టిపరిస్థితుల్లోనూ భావించకూడదని చాణక్యుడు చెప్పాడు. శత్రువు కదలికలపై ఎప్పుడూ ఒక నిఘా వేసి ఉంచాలని ఆచార్యుడు సూచించాడు. అతని బలాలు, బలహీనతల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నాడు. దీని వల్ల శత్రువులును సులభంగా దెబ్బ తీయవచ్చని చాణక్యుడు చెప్పాడు.
రహస్య శత్రువులను ఎలా నివారించాలంటే..
ఆచార్య చాణక్యుడి ప్రకారం, విజయవంతమైన వ్యక్తిని అసూయపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. వీరిలో కొందరు మనకు తెలిసే ఉంటుంది. మరికొందరిని మాత్రం మనం గుర్తించలేము. అలాంటి వారు దొంగ దెబ్బ తీయడానికి ఎప్పుడూ వేచి ఉంటారు. అలాంటి వ్యక్తులు అత్యంత ప్రాణాంతకమైన, హానికరమైన శత్రువులని చాణక్యుడు చెప్పాడు. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని ఆచార్యుడు హెచ్చరించాడు. ఈ చిట్కాలతో ఎంతటి శత్రువునైనా సులభంగా ఓడించవచ్చని ఆచార్యుడు చెప్పుకొచ్చాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications