For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti: చాణక్యుని ప్రకారం.. మనీ కన్నా మూడు ముఖ్య విషయాలేంటో తెలుసా...

|

ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది మనీ ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చని భావిస్తుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచమే కరెన్సీ కట్టలతో ముడిపడి ఉందని భావిస్తారు. డబ్బులు ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఎదురైనా చిటికెలో సాల్వ్ చేసుకోవచ్చనుకుంటారు. ప్రస్తుత సమాజంలో ఇది నిజమే. ఓ సినీ రచయిత చెప్పినట్టుగా 'Money is EveryThing' డబ్బే లోకంగా మారిపోయింది. ప్రతి మనిషి డబ్బు వెనుకాలే పరుగెడుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఆచార్య చాణక్యుడు డబ్బుకు మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందనే విషయాలను వివరించారు. మన డబ్బును ఆదా చేసుకోవడానికి కూడా కొన్ని విషయాలు చెప్పారు. అయితే డబ్బు కన్నా విలువైనవి ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయని.. అందులో ముఖ్యమైనవి మూడు అని వివరించారు.

అవి ఈ ప్రపంచంలోని చాలా గొప్పవని, వీటి కోసం మీరు ఎంత ఖర్చు చేసిన తప్పులేదు, ఇవి పోయినందుకు మీరు ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే మీ జీవితంలో ఈ మూడింటిని కోల్పోతే మాత్రం మీ సంపదను తిరిగి సంపాదించలేరు.

కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దని ఆచార్య చాణక్యుడు కచ్చితంగా చెప్పారు. పూర్వకాలంలోనే చాణక్యుడు అన్ని కాలాల్లో మనుషులు ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి.. అనే విషయాలను చక్కగా వివరించారు. అందుకే ఆయన నియమాలను, నిబంధనలను చాలా మంది ఇప్పటికీ ఫాలో అవుతారు.

ఆయన ఆనాడు చెప్పిన ప్రతి విషయం ఇప్పటికీ మనకు అనుగుణంగానే ఉంటున్నాయి. ఈ సందర్భంగా ఆచార్య చాణక్యుడు డబ్బు కన్నా విలువైనవి ఏవి అనే మూడు విషయాలను వివరించారు. వాటి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఏ రకమైన కారు కొంటే.. మీకు లక్కీ కలిసొస్తుందో తెలుసా...ఏ రకమైన కారు కొంటే.. మీకు లక్కీ కలిసొస్తుందో తెలుసా...

రిలేషన్ షిప్..

రిలేషన్ షిప్..

మన సమాజంలో డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రిలేషన్ షిప్. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి మనకు పరిచయమయ్యే ప్రతి ఒక్కరితో ఏదో ఒక బంధం ఉండే ఉంటుంది. అయితే అందులో నిజాయితీగా ఉండే సంబంధాలను కనుగొనడం చాలా కష్టం. అయితే ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. అందులో మీ స్నేహితులు ఉంటే.. అలాంటి వ్యక్తుల ముందు డబ్బుకు విలువ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే అలాంటి వారి ప్రేమను మీరు కొనలేరు.

వారిని వదులుకోకండి..

వారిని వదులుకోకండి..

మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి మీ సంతోషంలోనూ.. బాధలోనూ మీకు మద్దతు ఇస్తారు. అంతేకాదు మీ దగ్గర మనీ లేనప్పుడు కూడా మీకు అండగా ఉంటాడు. తను సాయం చేయకపోయినా కనీసం భరోసా అయినా ఇస్తాడు. అలాంటి నిజాయితీ గల వ్యక్తులను ఎప్పటికీ వదులుకోకండి. మీపై అంతటి ప్రేమ చూపించే వారి కోసం మీరు డబ్బును వదులుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు అని చెబుతారు చాణక్య. అందుకే మానవ సంబంధాల మధ్య డబ్బు విలువ తక్కువగా ఉంటుందని చాణక్యుడు వివరించారు.

వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...

డబ్బు త్యాగం..

డబ్బు త్యాగం..

ఈ లోకంలో ఏ మనిషికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యమైనది. అలాగే ఆత్మగౌరవం కంటే కూడా గొప్పది ఏమీ ఉండకూడదు. ఒకవేళ మీరు ఆత్మగౌరవాన్ని కాపాడటానికి డబ్బును త్యాగం చేయాల్సి వస్తే, అప్పుడు మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మనీని వదిలేయాలి. ఎందుకంటే మీరు కోల్పోయిన డబ్బును మళ్లీ సంపాదించొచ్చు. ఈరోజు మీతో ఉన్న డబ్బు రేపు మీతో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. అదే ఆత్మగౌరవం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. అలాంటి గౌరవం ఒక్కసారి దెబ్బతింటే.. దాన్ని తిరిగి తీసుకురావడం చాలా కష్టం అని చాణక్యుడు చెబుతారు.

మతాన్ని వదులకోవద్దు..

మతాన్ని వదులకోవద్దు..

మనీ కన్నా మతం చాలా గొప్పది. డబ్బు మీద ఆశతో మీరు మతాన్ని మారడం వంటివి చేయకూడదని చాణక్యుడు చెబుతారు. ఎందుకంటే మనం చేసే మంచి చెడు పనులను గుర్తించడానికి మతం మనకు సరైన దారిని చూపుతుందని చాణక్యుడు చెప్పారు. మీ మతంలో ఉండే ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమాలను అనుసరించడం ద్వారానే మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాంటి పరిస్థితిలో మతం పేరిట డబ్బు వస్తే, అలాంటి వాటిని నిర్మోహమాటంగా తిరస్కరించాలి. మన మతం ఎప్పటికైనా మంచే చేస్తుంది. కానీ మనీ మనకు నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే అవకాశం కూడా ఉందని చాణక్యుడు తన బోధననలో వివరించారు.

English summary

Chanakya Niti: These Three Things Are Bigger Than Money, It Is Important to Keep Them Together

Here we are talking about the chanakya niti: These three things are bigger than money, it is important to keep them together. Read on
Story first published: Wednesday, June 23, 2021, 11:34 [IST]