Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: కుటుంబాన్ని మానసికంగా, ఆర్థికంగా ఇలా కాపాడుకోవాలి
సమస్యల నుంచి దూరమై.. కుటుంబ సభ్యులతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవాలంటే మనిషి ఇలా ఉండాలంటూ ఆచార్య చాణక్యుడు కొన్ని నియమాలు తెలిపాడు. శ్లోకం ద్వారానే అనేక విషయాలను వెల్లడించాడు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

మనిషి జీవితం, స్థానం, కుటుంబం, అభ్యాసం అంతా కూడా మతం చుట్టూనే తిరుగుతుంది. ఒక్కో రకం మతం వాళ్లు ఒక్కోలా జీవిస్తుంటారు. అయితే మతాన్ని కాపాడుకునేందుకు మత పెద్దలు చాలా తాపత్రయ పడుతుంటారు. నిరంతరం వాటి కోసమే కష్టపడి పని చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు వాటి వల్లే వారు, వారి కుటుంబ సభ్యులు సమస్యల్లో పడుతుంటారు.
ఆ సమస్యల నుంచి దూరమై.. కుటుంబ సభ్యులతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవాలంటే మనిషి ఇలా ఉండాలంటూ ఆచార్య చాణక్యుడు కొన్ని నియమాలు తెలిపాడు. శ్లోకం ద్వారానే అనేక విషయాలను వెల్లడించాడు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విచ్ఛేన్ రక్ష్యతే ధర్మ విద్యా యోగేన్ రక్ష్యతే !
మృదునా రక్ష్యతే భూప్: సత్స్త్రియ రక్ష్యతే గృహమ్ ॥
ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే.. ఆచార్య చాణక్యుడి ప్రకారం... డబ్బు ద్వారా మతం రక్షించబడుతుందని చెప్పాడు. జ్ఞానాన్ని యోగం ద్వారా రక్షించవచ్చని, అలాగే స్వీకరించవచ్చని పేర్కొన్నాడు. దయ చూపుతూ పాలన సాగిస్తే.. కుటుంబాన్ని స్త్రీలు చక్కగా కాపాడుకుంటారని చెప్పారు. తరచుగా ప్రయత్నం చేసినప్పుడు మనిషి జ్ఞానాన్ని పొందుతాడని.. భవిష్యత్తు సురక్షితమవ్వాలంటే విద్యాయోగం చాలా ముఖ్యం అని వివరించాడు.
విద్య మనల్ని చీకటి నుండి దూరం చేయడమే కాకుండా.. బంగారు భవిష్యత్తును అందిస్తుందని పేర్కొన్నారు. విద్య కోసం నిరంతర ప్రయత్నాలు చేసే వారు దుఃఖ సమయాల్లో ఎప్పుడూ భయపడరన్నారు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి బయటపడేస్తుందని.. దీన్ని సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యమని చాణక్యుడు స్పష్టం చేశాడు.
వీరితో మర్యాదగా వ్యవహరించాలి:
అధికారం దక్కించుకోవాలనుకున్నా, నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా కింది వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆచార్య చాణక్యుడు వెల్లడించాడు. పరిపాలన మరియు రాజు తన అధికారాన్ని అదుపులో ఉంచుకోవడానికి సైనికులు, ప్రజలు, పని వాళ్లతో చాలా సున్నితంగా, ప్రేమగా వ్యవహరించాలని తెలిపాడు.
మీ హోదాను చూసి గర్వపడితే అదే మీ పతనానికి తొలి మెట్టు అని చెప్పాడు. ధనం ద్వారా డబ్బు రక్షించబడుతుందని.. డబ్బు లేకుండా మతానికి సంబంధించిన ఏ పనీ జరగదని చాణక్యుడు చెప్పాడు. ఈ ప్రపంచంలో మతమే సర్వస్వం అని అదే సారాంశం అని.. అందుకే మతాన్ని రక్షించుకోవాలని తెలిపాడు.
డబ్బును ఖర్చు చేస్తేనే సంపద!:
మరోవైపు డబ్బును రక్షించుకోవడానికి మీ సంపాదనను ఖర్చు చేయడం అవసరం. ఖర్చు అంటే దాతృత్వ కార్యాలలో ఖర్చు, పెట్టుబడి తద్వారా భవిష్యత్తు బాగు పడుతుందని వివరించాడు. మతపరమైన పనిలో డబ్బును ఉపయోగించడం వల్ల అంతులేని ఆనందం ఎలా ఉంటుందో, అదే విధంగా కష్ట సమయాల్లో డబ్బును పెట్టుబడిగా ఏలా ఆదా చేయాలో తెలుస్తుందన్నారు. తద్వారా చెడు సమయాల్లో ఎవరినీ చేరుకోవలసిన అవసరం లేదు.
ఇంటిని సురక్షితంగా ఉంచడానికి ఇది అవసరం..
స్త్రీ ఇంటికే కాదు కుటుంబానికీ వెన్నెముక అని చాణక్యుడు చెప్పాడు. ఒక మంచి స్త్రీ తన ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడానికి సాధ్యమైనదంతా చేస్తుందని వివరించాడు. సంస్కార వంతురాలు, సద్గుణ సంపన్నురాలు ఇంట్లో ఉండడం వల్ల కుటుంబం వర్ధిల్లడమే కాకుండా తరతరాలకు మోక్షం లభిస్తుందని స్పష్టం చేశాడు.



Click it and Unblock the Notifications