Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Chanakya Niti: ఈ చిట్కాలు పాటిస్తే దంపతుల మధ్య గొడవలుండవు, బంధం బలోపేతం అవుతుంది
దాంపత్య బంధాన్ని ఎలా సాఫీగా సాగనివ్వాలి, ఎలాంటి చిట్కాలతో భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుందో చాణక్యుడు వివరంగా చెప్పాడు.
వివాహం అనేది పవిత్రమైన సంబంధం. ఈ రోజుల్లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. భార్యాభర్తల మధ్య సహనం, గౌరవం అన్నీ తగ్గిపోయాయి. ఈ రోజుల్లో ప్రజల్లో సహనం చాలా తక్కువ. ఈ పరిస్థితుల మధ్య వైవాహిక జీవితం కూడా గందరగోళంగా మారిపోయింది. విడాకుల కేసులు కూడా వేగంగా పెరగడానికి అదే కారణం. దాంపత్య బంధాన్ని ఎలా సాఫీగా సాగనివ్వాలి, ఎలాంటి చిట్కాలతో భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుందో చాణక్యుడు వివరంగా చెప్పాడు.

ప్రతి వ్యక్తి తన సంబంధాలు బాగుండాలని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధంగా బలంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే వైవాహిక జీవితం అందంగా ముందుకు సాగుతుంది. చాణక్య నీతి ప్రకారం వివాద రహిత వివాహం కోసం భార్యాభర్తలు చాణక్యుడు చెప్పిన ఈ 6 విషయాలు పాటించాలి.

మర్యాదగా ఉండాలి:
చాణక్య నీతి ప్రకారం, సంతోషకరమైన వివాహానికి మర్యాద చాలా ముఖ్యం. మీ మాటలో మాధుర్యాన్ని, ప్రవర్తనలో వినయాన్ని ఉండేలా చూసుకోవాలి. అలాంటి వ్యక్తులు అందరి హృదయాలను గెలుచుకుంటారు. కాబట్టి మాటల్లో, ప్రవర్తనల్లో ఎల్లప్పుడూ మర్యాదగా ఉండాలి.

అహంకారం వద్దు:
అహం అనేది అనేక సమస్యలను కలిగిస్తుంది. బలమైన బంధంలో కూడా చీలికకు కారణమవుతుంది. భాగస్వాములలో ఒకరికి అహం ఉంటే, సంబంధం క్షీణించడం ప్రారంభమవుతుంది. చాణక్య నీతి ప్రకారం సంబంధాలలో ఎప్పుడూ అహం ఉండకూడదు. అహాన్ని మానుకుంటే ఎప్పటికీ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపవచ్చు.

పరస్పర గౌరవం:
భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే వివాహ బంధం సాఫీగా సాగుతుంది. అన్ని సంబంధాలలో గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కోపంతో మరొకరిని అవమానించే ప్రయత్నం చేయవద్దు. మీరు మీ భాగస్వామిని గౌరవించకపోతే, సంబంధం ఎక్కువ కాలం ఉండదు. ఇతరులను గౌరవించే వ్యక్తులకు అందరి సహకారం లభిస్తుంది.

విశ్వాసం:
ఏ సంబంధానికైనా నమ్మకమే ఆధారం అంటాడు చాణక్యుడు. సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా సున్నితమైనది. అది భార్యాభర్తలైనా లేదా ప్రియుడు, స్నేహితురాలు అయినా, సంబంధాన్ని బలోపేతం చేయడానికి నమ్మకం ముఖ్యం. భాగస్వాముల మధ్య అచంచల విశ్వాసం ఉంటే వారు జీవితంలో ఎలాంటి సంక్షోభాన్ని అయినా సులభంగా ఎదుర్కొంటారు. మరోవైపు సంబంధం నమ్మకం లేకుండా సంబంధం తక్షణమే విడిపోతుంది.

కోపం ఉండకూడదు:
కోపం ఒక వ్యక్తికి హాని కలిగిస్తుంది. కోపం యొక్క భావన ఒక వ్యక్తి యొక్క అన్ని సంబంధాలను నాశనం చేయడానికి కారణం. భార్యాభర్తల్లో ఎవరికైనా కోపం ఉండే వైవాహిక జీవితంలో శాంతి ఉండదు. అటువంటి పరిస్థితిలో, సంఘర్షణ పరిస్థితులు సృష్టించబడాతియ వైవాహిక జీవితం బలహీనపడుతుంది.

వేరే వ్యక్తుల ప్రమేయాన్ని నివారించాలి:
వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ ఇద్దరి రహస్యాలను మూడో వారికి తెలియనివ్వొద్దు. మీరు మీ సంబంధంలో మూడో వ్యక్తిని చేర్చుకుంటే మీ మధ్య సమస్య మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిని అస్సలే రానివ్వొద్దు. దాంపత్య బంధం అంటే కేవలం ఇద్దరే. తల్లిదండ్రులు, అత్తమామలు, కొడుకు, కూతురు కూడా దంపతుల మధ్యలోకి వెళ్లకూడదు. వారి మధ్య సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. వారికి కొంత సమయం ఇవ్వాలనిచాణక్యుడు తన నీతిలో వివరించాడు.



Click it and Unblock the Notifications