Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: ఈ గుణాలున్న వారు జీవితంలో అంతులేని సంపద పొందుతారు
అయితే జీవితంలో సంపద కావాలంటే మాత్రం ఎలాంటి గుణాలు ఉండాలో చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ గుణాలు ఏంటి, వాటి వల్ల సంపద ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సంపద ఆనందాన్ని తెస్తుంది, సంపద కలహాలను దూరం చేస్తుంది, సంపద బంధుమిత్రులను దగ్గర చేస్తుంది, ఇంకా సంపద వల్ల ఎన్నో జరుగుతాయి. అయితే ఆ సంపద సృష్టించుకోవడం అంత తేలికైన పని మాత్రం కాతు. లక్ష్మీ కటాక్షం ఉన్న వారికే సంపద వస్తుంది. ఈకాలంలో సంపద లేకుండా ఏ పని జరగదు. భౌతిక ఆనందానికి, మానసిక సంతోషానికి సంపద చాలా చాలా ముఖ్యం. డబ్బు లేకపోతే ఆర్థిక సమస్యలు వస్తాయి ఆ సమస్యలతో మానసిక ప్రశాంతతం ఉండదు.

అయితే జీవితంలో సంపద కావాలంటే మాత్రం ఎలాంటి గుణాలు ఉండాలో చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ గుణాలు ఏంటి, వాటి వల్ల సంపద ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీలను గౌరవించడం, సంతోషపెట్టడం:
చాణక్యుడి ప్రకారం స్త్రీలు సంతోషంగా ఉండే ఇంట్లో లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చాణక్యుడు చెప్పాడు. తల్లి, సోదరి, భార్య, కోడలు, ఇతర స్త్రీలు సంతోషంగా ఉన్నప్పుడు లక్ష్మీ దేవి కూడా సంతోషిస్తుందని తెలిపాడు. అటువంటి ఇళ్లలో అదృష్టం వస్తుందని, డబ్బు సమృద్ధిగా ఉంటుందని వివరించాడు. ఇంట్లోని పురుషులు స్త్రీలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

తప్పుడు సాంగత్యానికి దూరంగా ఉండాలి:
ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పుడు సాంగత్యానికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి సహవాసంలో నివసించే వ్యక్తుల రకం అది పాత్రపై ప్రభావం చూపుతుంది. తప్పుడు సహవాసంలో ఉండటం వల్ల వ్యక్తి యొక్క మనస్సులో ప్రతికూల ఆలోచనలు వచ్చి తప్పుడు చర్యలకు దారితీస్తాయి. మంచి సహవాసంతో ఒక వ్కక్తి భవిష్యత్తు బలంగా మారుతుంది.

నిరంతర ప్రయత్నం:
ఒక వ్యక్తి ఎప్పుడూ తన విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. అదృష్టం మీద ఆధారపడకూడదు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి సంక్షోభ సమయంలో ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. ఎలాంటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి.

మంచి మాట:
చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ తన భాష, ప్రసంగం పట్ల శ్రద్ధతో ఉండాలి. మంచి మాటలతో శత్రువులను కూడా జయించవచ్చు. మధురమైన మాటలతో ప్రత్యర్థులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. అందుకే ఎప్పుడూ మాట్లాడినా మధురంగా, చక్కగా మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడేవాడు ప్రతి చోటా ప్రశంసించబడతాడు.

కష్టాలు చెప్పుకోవద్దు:
తమ కష్టాలను, సమస్యలను ఇతరులతో ఎప్పటికీ పంచుకోవద్దు. అలా ఇతరులకు తమ ఇబ్బందులు చెప్పడం వల్ల చులకన అవుతారు. ఎగతాళికి, అవమానాలకు గురవుతారు. ముందు అయ్యో పాపం అన్నట్లుగా నటించి, వెనక నవ్వుతుంటారు. అందుకే కష్టాలను, సమస్యలను ఇతరులతో పంచుకోవద్దని చాణక్యుడు చెప్పాడు.

ఆర్థిక సమస్యల గురించి చెప్పొద్దు:
మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి ఎవరికీ చెప్పుకోవద్దు. వాటిని మనస్సులోనే ఉంచుకోవాలి. ఆర్థికంగా సమస్య ఉన్నప్పుడు వాటి గురించి చెప్పుకోవడం వల్ల అప్పు ఇవ్వడానికి కూడా వెనకాడతారు. ఆర్థికం ఆదుకోవడానికి భయపడతారు.

ఇంటి విషయాలు బయటి వారికి చెప్పొద్దు:
ఇంటి విషయాలు బయటి వారికి చెప్పొద్దు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్య వస్తే వాటిని మనస్సులోనే ఉంచుకోవాలి. భర్త భార్య గురించి, భార్య భర్త గురించి మూడో వ్యక్తికి చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి గోప్యత ఉండదు. మీ బంధం బలహీనపడుతుంది.



Click it and Unblock the Notifications