For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti:ఇలాంటి సందర్భాల్లో మనం ఇక చాలు అనుకోకూడదట...! చాణక్యుడు ఇంకా చెప్పాడంటే...!

చాణక్యుని నీతి ప్రకారం ఈ చిట్కాలను పాటిస్తే జీవితంలో సులభంగా విజయం సాధించొచ్చు.

|

మనలో చాలా మందికి చాలా విషయాల్లో సంతృప్తి అనేది అంత త్వరగా లభించదు. ఎందుకంటే సంతృప్తికి ఒక కొలమానం అంటూ ఏదీ ఉండదు. ఎంత సంపాదించినా.. ఏం సాధించినా.. మనకు ఎంత దక్కినా ఇంకా ఏదో ఒకటి కావాలనిపిస్తుంది.

Chanakya Niti: Useful Tips for Life Management According to Acharya Chanakya

కోరికల చిట్టా కూడా రోజురోజుకు పెరుగుతూ పోతుంది కానీ.. ఎప్పటికీ తగ్గదు. అయితే ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో కొన్ని విషయాల్లో మాత్రం కచ్చితంగా సంతృప్తి పొందాలట. లేదంటే జీవితమంతా అసంతృప్తితో సాగిపోతుందట.

Chanakya Niti: Useful Tips for Life Management According to Acharya Chanakya

అదే సమయంలో కొన్ని విషయాల్లో మాత్రం అస్సలు రాజీ పడకూడదట. లేదంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుందట. అయితే ఎవరెవరు ఎక్కడ సంతృప్తి చెందాలి.. ఏ విషయాల్లో సంతృప్తి చెందకూడదనే విషయాలను ఆచార్య చాణక్య కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!

భాగస్వామి అందం..

భాగస్వామి అందం..

ఆచార్య చాణక్యుని ప్రకారం, మీ మనసుకు మీ భాగస్వామి అందంగా లేకపోయినా, మీరు సంతృప్తి చెందాల్సిందేనట. మీ వివాహం తర్వాత మీ సంసారంలో ఎన్ని గొడవలు జరిగినా.. మీ ఇద్దరి మధ్య ఎన్నిసార్లు మాట మాటా పెరిగినా మీరు సర్దుకుపోవాలట. మరోవైపు మీ భాగస్వామి అందంగా లేరని ఇతరులపై ఆసక్తి పెంచుకోవడం వంటివి చేయకూడదట. అలా చేస్తే మీ జీవితం కచ్చితంగా నాశనమవుతుందట. వివాహం చేసుకున్న వ్యక్తులు తమ భాగస్వామి బాహ్య సౌందర్యం కంటే ఎక్కువగా మానసిక సౌందర్యాన్ని చూడాలట. సున్నితమైన భాగస్వామి ఏ వ్యక్తి జీవితాన్ని అయినా సంతోషపరుస్తుంది.

త్యాగం విషయంలో..

త్యాగం విషయంలో..

ఒక వ్యక్తిని మీరు పరీక్షించే సమయంలో తను ఇతరుల ఆనందం కోసం త్యాగం చేసే సామర్థ్యాన్ని చూడాలి. ఒక వ్యక్తి ఇతరుల ఆనందం కోసం తమ ఆనందాన్ని త్యాగం చేయగలిగితే.. తను చాలా మంచి వ్యక్తి అని అంచనా వేయొచ్చు. అయితే త్యాగం చేయడానికి ఎవరైతే వెనుకబాడతారో, అలాంటి వారు ఎప్పటికీ మంచి మనషులుగా గుర్తింపు పొందలేరు.

ఇతరుల పట్ల..

ఇతరుల పట్ల..

ఎవరైనా వ్యక్తులు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు.. ఆ తప్పు నుండి తాము తప్పించుకునేందుకు ఇతరులపై నెపం నెట్టేయడం చేస్తుంటారు. అలాంటి వారు ఇతరుల పట్ల తప్పుడు భావాలను కలిగి ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలు లేనివారు, ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోని వారి ఆలోచనలు స్వచ్ఛమైనవిగా ఉంటాయి. మరోవైపు ఒక వ్యక్తి పాత్ర అవినీతి మరియు ఆలోచనలు స్వచ్ఛమైనవి కాకపోతే, అలాంటి వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండాలి.

ఆహారం విషయంలో..

ఆహారం విషయంలో..

మీకు బాగా ఆకలి ఉన్న సమయంలో అయినా.. లేదా ఇతర సమయాల్లో ఆహారం దొరికితే.. మీరు దాన్ని దేవుని ప్రసాదంగా భావించాలి. దాన్ని ఆనందంతో స్వీకరించాలి. ఎందుకంటే ఆహారం దొరకని వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆహారం విషయంలో మీకు ఏదైనా కోరికలు కలిగినప్పుడు.. అలాంటి సమయంలో దొరికిన ఆహారం నచ్చకపోయినా.. మీరు దేవుని చిత్తం నుండి లభించిందని భావించి ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి.

Akshaya Tritiya 2021:అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!Akshaya Tritiya 2021:అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!

ఇప్పుడున్న డబ్బుతో..

ఇప్పుడున్న డబ్బుతో..

ఎవరైనా సరే తమ వద్ద ప్రస్తుతం ఉన్న డబ్బుతోనే సంతృప్తి చెందాలి. అంతేకానీ, ఎంత డబ్బు ఉన్నా.. ఇంకా ఎక్కువ డబ్బు కావాలనే కోరికతో, తప్పులు చేయకూడదు. ఇంకొకరి వైపు డబ్బు వైపు చూడకూడదు. ఇతరుల డబ్బు గురించి ఆశించకూడదు. ఇలాంటి లక్షణాలుంటే మీ జీవితంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇవి మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. అందువల్ల, మీ ఆదాయంతో సంతృప్తి చెందడం నేర్చుకోండి అలాగే మీ ఆదాయానికి అనుగుణంగా డబ్బులు ఖర్చు చేయాలి.

తక్కువ చేసి మాట్లాడటం..

తక్కువ చేసి మాట్లాడటం..

మనలో చాలా మంది ఇతరులను చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. అంతేకాదు వారిని హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. అయితే ఇలాంటి లక్షణాలుంటే మీరు వీటిని మరచిపోవడానికి ప్రయత్నించాలి. ఎవరిలో అయినా ఏవైనా లోపాలుంటే.. మీరు వారిని చులకన చేయడం.. అవమానించడం వంటివి చేయకూడదు. ఇలాంటి లక్షణాలు ఉండే వ్యక్తులను ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులగా పరిగణించరు.

మీపై స్నేహితుల ప్రభావం..

మీపై స్నేహితుల ప్రభావం..

ఎవరైనా వ్యక్తులు ఏదైనా తప్పుడు పనులు చేసినప్పుడు, తప్పుడు మార్గంలో ఏదైనా అవాంఛనీయ పనులు చేసినప్పుడు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు అలా తప్పు చేసిన వ్యక్తుల దగ్గర్లో ఉంటే మీరు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులతో స్నేహం వల్ల మీరు కూడా కొన్ని సమస్యల్లో చిక్కుకోవచ్చు. ఎందుకంటే తను తన చుట్టూ ఉండే మనుషులను కూడా ప్రభావితం చేస్తాడు.

నిరంతర ప్రక్రియ..

నిరంతర ప్రక్రియ..

ఆచార్య చాణక్యుని ప్రకారం, ఒక వ్యక్తి సంతృప్తి చెందాల్సిన విషయాలివే. దీనితో పాటు మీరు నిరంతరం నేర్చుకునే విషయంలో ఎప్పటికీ సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇక విరాళాలు లేదా దానం ఇవ్వడం వంటి వాటి విషయంలో మీరు సంతృప్తి చెందకూడదని చెబుతుంటారు ఆచార్య చాణక్య. అదే సమయంలో పూజలు, జపాలు చేసినప్పుడు ఇక చాలు అని ఎప్పటికీ అనుకోకూడదు. ఎందుకంటే వాటిని ఎంత ఎక్కువగా ఆచరిస్తే.. అంత ధర్మం, పుణ్యం పొందుతారు. దీని వల్ల మీరు సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుంటారు.

English summary

Chanakya Niti: Useful Tips for Life Management According to Acharya Chanakya

Here we are talking about the chanakya niti: Useful tips for life management according to acharya chanakya. Have a look
Story first published:Saturday, May 8, 2021, 14:39 [IST]
Desktop Bottom Promotion