Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: ‘ఆ’ విషయాల్లో మగాళ్ల కన్నా మహిళలే ముందుంటారట...!
మహిళలు మగవారి కన్నా ఆ విషయాల్లో ఒకడుగు ముందు ఉంటారట.
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త. ఆర్థిక శాస్త్రంతో పాటు నీతి శాస్త్రంలోనూ చాణక్యుని ప్రావీణ్యం మంచిగా ఉంది. మౌర్యుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఆచార్య చాణక్యుడు పూర్వ కాలంలోనే మానవ సమాజానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. అత్యంత విలువైన జీవిత సత్యాలను మనకు బోధించిన ఆచార్య చాణక్య నీతిని మనమంతా తెలుసుకుని ఆచరిస్తే, మన జీవితంలో కచ్చితంగా విజయం సాధించొచ్చు.

తను ఆనాడు చెప్పిన విషయాలు, రహస్యాలు ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతారు. ఇక అసలు విషయానికొస్తే.. ఆచార్య చాణక్యుడు ఆడవారు మరియు మగవారి లక్షణాలు మరియు లోపాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

చాణక్యుడు చెప్పిన విషయాలను తెలుసుకోవడం నేటి కాలంలో అత్యంత అవసరం. అందులో ముఖ్యమైన నాలుగు విషయాల్లో పురుషుల కన్నా మహిళలే ఒకడుగు ముందుంటారని వివరించారు. ఇంతకీ అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఏయే విషయాల్లో ముందంజలో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

తెలివి విషయంలో..
ఆచార్యుని ప్రకారం, మహిళలకు మగవారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అందుకే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా వారి తెలివితేటలతో క్లిష్ట సమయాన్ని అధిగమిస్తారు. ఇక ధైర్యం విషయంలో అమ్మాయిలే అబ్బాయిల కంటే ఒక అడుగు ముందుంటారని చెప్పారు. వీరు ప్రతికూల పరిస్థితులకు అస్సలు భయపడరు. ఆచార్యుని ప్రకారం, పురుషుల కంటే ఆరు రెట్లు ఎక్కువ ధైర్యం అమ్మాయిలకు ఉంటుందట. అందుకే వీరు ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు.

సెక్స్ విషయంలో..
సాధారణంగా శృంగారంలో పురుషులు రెచ్చిపోతూ ఉంటారని మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే పురుషుల కన్నా స్త్రీలే ఆ విషయంలో ఎనిమిది రెట్లు ముందుంటారని చాణక్య వివరించారు. అందుకే వారు భావప్రాప్తిని చాలా ఆలస్యంగా పొందుతారు. అదే మగవారైతే శృంగార కార్యంలో పాల్గొన్నప్పుడు చాలా త్వరగా డీలా పడిపోతారు. కానీ చాలా మంది మహిళలు తమకు ఇంకా కావాలని కోరుకుంటారు. ఇదే విషయాన్ని వైద్యశాస్త్ర నిపుణులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. ప్రతి అధ్యయనంలోనూ అమ్మాయిలదే పైచేయిగా తేలింది.

ఎక్కువ ఆకలి..
ఆహారం తినే విషయంలో ఆడవారి కంటే మగవారు ఎక్కువగా తింటారని అనుకుంటాం. కానీ చాణక్యుని ప్రకారం.. మగవారి కన్నా మహిళలే ఎక్కువ ఆహారం తీసుకుంటారట. అంతేకాదు వారికి త్వరగా ఆకలి అవుతుందట. ఈ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఒకడుగు ముందు ఉంటారని చాణక్యుడు వివరించారు. మహిళల శరీర కూర్పు కారణంగా వారికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయని, అందుకే వారు ఎక్కువ భోజనం తినాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే వారు పురుషుల కన్నా కాస్త ఎక్కువ భోజనం తింటారు.

పొదుపు విషయంలో..
సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారని మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా వారు షాపింగుకు వెళ్లినా.. లేదా ఎక్కడైనా ఏదైనా కొనడానికి వెళ్తే.. తమ కంటికి కనబడిందల్లా కొనేస్తుంటారని.. ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెడుతుంటారని మగవారు వాపోతూ ఉంటారు. కానీ వారు చేసే షాపింగ్ బడ్జెట్ కు తగ్గట్టు ఉంటుదట. ఎంత సొమ్ముతో షాపింగ్ చేయాలో.. ఏ వస్తువును ఎంత ఖర్చు చేయాలో వారికి బాగా తెలుసట. అలాగే డబ్బు ఆదా చేయడంలోనూ ఆడవారిదే పైచేయిగా చెబుతున్నారు. ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలకు తెలియకుండా ఎంతో సొమ్మును పుస్తకాల్లో, పోపు డబ్బుల్లో దాచిపెట్టుకున్నట్లు మనం వింటూ ఉంటాం. ఇవే సీన్లను చాలా సినిమాల్లోనూ చూస్తు ఉంటాం.



Click it and Unblock the Notifications