Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం పురుషుల్లోని ఈ లక్షణాలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం
చాణక్య నీతి భారతీయ పురాతన గ్రంథం. మౌర్య సామ్రాజ్యానికి ప్రఖ్యాత పండితుడు, సలహాదారు అయిన ఆచార్య చాణక్యుడి బోధనలు, తెలివైన సూక్తుల సంకలనం ఈ గ్రంథం. విజయవంతమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకంగా చాణక్య నీతి పుస్తకం పరిగణించబడుతోంది. ఈ గ్రంథంలోని చాలా అంశాలు నేటికీ ఆచారణీయం.

చాణక్య విధానాలు కఠినంగా ఉండొచ్చు కానీ జీవిత సత్యాలు వాటిలో ఉంటాయి. చాణక్య విధానాలు బాగా ప్రాచుర్యం పొందాయి. చాణక్య నీతి జీవితం గురించి ఎంతో చెబుతుంది. మనిషి మంచి జీవితాన్ని గడిపేందుకు ఏమేం చేయాలో చాణక్యుడు వివరించి చెప్పాడు.
దాంపత్య బంధం గురించి చెప్పిన చాణక్యుడు.. ఆలుమగల గురించి కొన్ని విషయాలు విడమరిచి చెప్పారు. పురుషుల్లో ఉండే కొన్ని లక్షణాలను మహిళలు చాలా ఇష్టపడతారని, అలాంటి వారినే స్త్రీలు కోరుకుంటారని చెప్పాడు చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళల పట్ల మంచి ప్రవర్తన:
ఆచార్య చాణక్యుడి ప్రకారం మహిళలను గౌరవించే, ప్రేమించే వ్యక్తులను స్త్రీలు ఇష్టపడతారు. వారితో వినయంగా, మర్యాదంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి పురుషులను తమ జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎవరైతే మహిళలను గౌరవిస్తారో, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారో వారిని ఎవరైనా ఇష్టపడతారు. అందుకే వారితో సున్నితంగా ఉండటానికి ప్రయత్నించాలి.
ప్రశాంతంగా ఉండాలి:
పురుషులు ప్రశాంతంగా ఉండాలని మహిళలు కోరుకుంటారని చాణక్యుడు చెప్పాడు. కఠిన సమయంలోనూ సావధానంగా వ్యవహరించే వారిని వాళ్లు ఇష్టపడతారట. ప్రశాంతమైన మనస్సు, వ్యక్తిత్వం కలిగిన పురుషులను జీవిత భాగస్వామి చేసుకోవాలని కోరుకుంటారట. మాటలో ప్రశాంతత, కష్టసమయంలో ప్రశాంతత ఉండాలని కావాలనుకుంటారని చాణక్యుడు చెప్పాడు.
మంచి మనుసు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం మహిళలు పురుషుల వ్యక్తిత్వాన్ని చూస్తారు. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నప్పుడు అందానికి బదులు మనుసు కావాలని కోరుకుంటారు. నిజాయితీ, కష్టపడి పనిచేసే వ్యక్తులను చూసి, మహిళలు వారిని వదిలించుకుంటారని చాణక్యుడు చెప్పాడు. మంచి మనుసులు కలిగిన వ్యక్తులను ఎవరైనా ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications