Just In
Don't Miss
- Movies
Karthikeya 2 day 1 collections తొలి రోజు బాక్సాఫీస్ ఊచకోత.. నిఖిల్ కెరీర్లో హయ్యెస్ట్‌గా
- News
స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
- Finance
Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Automobiles
మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
- Technology
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Chandra Grahan 2022:ఈ ఏడాది సంపూర్ణ చంద్ర గ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది?
భారతదేశంలో 2022 సంవత్సరంలో మొత్తం రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇటీవలే అంటే ఏప్రిల్ 30వ తేదీన సూర్యగ్రహణం పూర్తయ్యింది.
అదే సమయంలో ఇప్పుడు తొలి చంద్ర గ్రహణం కూడా రాబోతోంది. వీటిలో ఒక గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. మరొకటి కనిపించే అవకాశం లేదు.
ఈ సందర్భంగా తొలి చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎక్కడ కనిపిస్తుంది.. ఏ సమయంలో గ్రహణాన్ని చూడాలి? సూతక్ కాలానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మీ
పర్సులో
ఇవి
కచ్చితంగా
ఉండేలా
చూసుకోండి...
ఎందుకంటే
ఆర్థిక
సమస్యలను
అధిగమించొచ్చు...!

బ్లడ్ మూన్..
ఈ ఏడాది సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుండగా.. జాబిల్లి బ్లడ్ మూన్ కనువిందు చేయనున్నాడు.
ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖ మీదకు వచ్చినప్పుడు, సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా రానుండటంతో సాధారణ రోజుల కంటే చంద్రుడు పెద్దదిగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాల ప్రభావం కారణంగా చంద్రుడు ఎరుపు, ఆరెంజ్, బ్రౌన్ కలర్లో కనిపించనున్నాడు. దీన్నే సూపర్ మూన్ అని లేదా బ్లడ్ మూని అని పిలుస్తారు.

తొలి చంద్ర గ్రహణం..
2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన అంటే సోమవారం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం ప్రభావం ఇక్కడ ఉండదు.
Vastu
Tips
for
Wallet:మీ
పర్సులో
ఇవి
ఉంటే
వెంటనే
పడేయండి...
ఎందుకంటే
డబ్బు
సమస్యలు
పెరుగుతాయట..

గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది..
2022లో ఏర్పడే తొలి చంద్ర గ్రహణం నైరుతి ఐరోపా, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మరియు అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ తొలి చంద్ర గ్రహణం కనిపిస్తుంది.

సూతక్ కాలం ఉండదు..
సాధారణంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూతక్ కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. అయితే మన దేశంలో గ్రహణ ప్రభావం ఉండదు. గ్రహణం కనిపించదు కాబట్టి సూతక్ కాలం చెల్లదు.
2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన అంటే సోమవారం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం ప్రభావం ఇక్కడ ఉండదు. 2022లో ఏర్పడే తొలి చంద్ర గ్రహణం నైరుతి ఐరోపా, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మరియు అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ తొలి చంద్ర గ్రహణం కనిపిస్తుంది.