For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Children's Day 2021: చిల్డ్రన్స్ డేను నవంబర్ 14వ తేదీనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

మన దేశంలో నవంబర్ 14వ తేదీన ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

|

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం దాని కంటే ఆరు రోజులు ముందుగానే అంటే నవంబర్ 14వ తేదీన, నెహ్రు పుట్టినరోజున 'చిల్డ్రన్స్ డే'ను జరుపుకుంటాం.

Childrens day 2020 date and Why do we celebrate

ఈరోజంటే చిన్నపిల్లలందరికీ ఎంతగానో ఇష్టం. ఈరోజే కాదు.. ఈ నవంబర్ నెల మొత్తం బాలలు ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే ఈ నెలలో బాలల కోసం ప్రత్యేక చిత్రాలు.. ప్రత్యేక ఎగ్జిబిషన్ తో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Childrens day 2020 date and Why do we celebrate

అయితే పండిట్ జవహార్ లాల్ నెహ్రు పుట్టినరోజును బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు.. ప్రపంచంలోని ఇతర దేశాలు నవంబర్ 20 తేదీన జరుపుకంటే.. మనం మాత్రమే ముందుగా ఎందుకు జరుపకుంటాం.. దీని వెనుక కారణాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Happy Children's day 2020 : పండిట్ జవహార్ లాల్ నెహ్రు కోట్స్ ను మీ చిన్నారులతో షేర్ చేసుకోండి...Happy Children's day 2020 : పండిట్ జవహార్ లాల్ నెహ్రు కోట్స్ ను మీ చిన్నారులతో షేర్ చేసుకోండి...

తొలి ప్రధాని నెహ్రు..

తొలి ప్రధాని నెహ్రు..

మన దేశంలో మొట్టమొదట ప్రధాన మంత్రిగా జవహార్ లాల్ నెహ్రు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగారు. పాకిస్థాన్ నుండి విడిపోయిన తర్వాత, తనదైన దార్శనికత, ముందుచూపుతో పురోగతి దిశగా మన దేశాన్ని నడిపించారు.

పిల్లలంటే చాలా ఇష్టం..

పిల్లలంటే చాలా ఇష్టం..

1889 నవంబర్ 14వ తేదీన పుట్టిన జవహార్ లాల్ నెహ్రుకు గులాబీపువ్వులన్నా.. చిన్న పిల్లలన్నా ఎంతగానో ఇష్టం. అయితే ఆయన తండ్రిగా మారిన తర్వాత తన కూతురితో కూడా ఎక్కువ సమయం గడిపలేకపోయాడు. కానీ తను దేశంలోని పిల్లలంతా తన బిడ్డలగానే భావించాడు.

పిలల్ని ఆప్యాయంగా..

పిలల్ని ఆప్యాయంగా..

తను ఎక్కడికి వెళ్లినా.. ఎప్పుడు వెళ్లినా.. చిన్నారులను అన్వేషించి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి అందమైన బహుమతులను ఇచ్చి ఉత్సాహరపరిచేవారు. వారితో ఉంటే తనకు కాలమే తెలియదని చాలా సందర్భాల్లో చెప్పేవారు.

చిల్డ్రన్స్ డే 2020 : ఈ చిన్న పనులను చేయండి.. చిన్నారులను ఆకట్టుకోండి..చిల్డ్రన్స్ డే 2020 : ఈ చిన్న పనులను చేయండి.. చిన్నారులను ఆకట్టుకోండి..

మంచి, చెడు గురించి..

మంచి, చెడు గురించి..

నెహ్రు తొలి ప్రధాని మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. తను జైలు నుండే తన కూతురు ఇందిరాగాంధీకి ఉత్తరాల్లో అనేక సంగతులు వివరించేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఏయే విషయాలను నేర్చుకోవాలి? సొసైటీలో ఏది మంచి.. ఏది చెడు అనే విషయాలను ఎలా గ్రహించాలి? అడ్డంకులను ఎలా అధిగమించాలనే వివరాలను సింపుల్ గా వివరించేవారు.

నేటి తరానికి పాఠాలు..

నేటి తరానికి పాఠాలు..

పండిట్ నెహ్రు నింపిన ఉత్సాహం, ధైర్యంతోనే ఇందిరా గాంధీ ‘ఉక్కు మహిళ'గా రూపొందారు. ప్రధానమంత్రిగా సాహస నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపారు. ఆమెకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన మంచి విషయాలు మనం ఇప్పటికీ ఆచరించొచ్చు.

చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ..

చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ..

నెహ్రు పిల్లల కోసం ప్రత్యేకంగా స్థానిక చిత్రాలను రూపొందించడానికి 1955 లో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. పిల్లల హక్కులు ఏమిటి? భారత రాజ్యాంగం ప్రకారం పిల్లల హక్కులలో ఏమి చేర్చబడిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

పిల్లల హక్కులు..

పిల్లల హక్కులు..

6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు తప్పనిసరి ప్రాథమిక విద్య యొక్క హక్కు, ఏదైనా ప్రమాదకరమైన వృత్తి నుండి రక్షణ పొందే హక్కు, పిల్లల సంరక్షణ మరియు విద్యకు హక్కు, దుర్వినియోగం నుండి రక్షణ పొందే హక్కు, ఆర్థిక లేమి నుండి రక్షణ పొందే హక్కు, సమాన అవకాశం మరియు స్వేచ్ఛ హక్కు గురించి బాలల దినోత్సవం అది గుర్తుచేస్తుంది. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది మనమంతా ఇళ్లలోనే బాలల దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి.

1964లో..

1964లో..

చిన్న పిల్లలకు కూడా నెహ్రు జీ అంటే చాలా ఇష్టం. తనను అందరూ ‘చాచా జీ, చాచా నెహ్రు' అని పిలిచేవారు. దీని అర్థం మామయ్య లేదా బాబాయ్ 1964లో నెహ్రు మరణించిన తర్వాత.. ఆయన జయంతి రోజున ‘చిల్డ్రన్స్ డే'గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మన దేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

FAQ's
  • భారతదేశంలో చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన జవహార్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు.

English summary

Children's day 2020 date and Why do we celebrate

Here in this article we are discussing about the childrens day 2020 date and why do we celebrate. Take a look.
Desktop Bottom Promotion