For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas 2021:ఏసు అంటే అర్థమేంటి? క్రిస్మస్ కథ గురించి తెలుసుకుందామా...

|

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ పండుగ గుర్తుకొస్తుంది. ఈ నెల మొత్తం ఈ పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. చాలా చోట్ల డిసెంబర్ మొదటి వారం నుండే మినీ క్రిస్మస్ వేడుకలను కూడా జరుపుకుంటారు.

ఇక డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఏసు క్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఈ పర్వదినాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏసు క్రీస్తు పుట్టి ఇప్పటివరకు సుమారు రెండు వేల ఏళ్ల దాటిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. జీసస్ పుట్టినప్పటి నుండి కరుణామయుడిగా.. దయామయుడిగా క్రైస్తవులందరి ఆరాధానలను అందుకుంటున్నాడు.

ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ కథ, దాని ప్రాముఖ్యత మరియు చరిత్ర, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. అసలు ఏసు అంటే అర్థం ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Christmas 2021: క్రిస్మస్ వేళ రాత్రిపూట వేడుకలను ఎలా జరుపుకుంటారంటే...

డిసెంబర్ 25లోపు..

డిసెంబర్ 25లోపు..

దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం రోమ్ కింగ్ డమ్ ను పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కించాడు. ఈ లెక్కలను ఈజీగా సేకరించేందుకు ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25వ తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు.

రోమన్ రాజ్యంలో..

రోమన్ రాజ్యంలో..

అదే సమయంలో రోమాన్ రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దైవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుని జన్మనిస్తావు.. అంతేకాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతను దేవుని కుమారుడు' అని తెలియజేసింది.

పాపాల నుండి విముక్తి..

పాపాల నుండి విముక్తి..

ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత అచ్చం దేవదూత చెప్పిన విధంగానే మేరీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.ఆ తర్వాత ఒకసారి దైవదూత జోసెఫ్ కలలో కనిపించి ‘మేరీని విడిచిపెట్టకు.. ఆమె దేవుని వరంతో గర్భవతిఅయ్యింది. అందుకే ఆమెకు పుట్టే బిడ్డ దేవుని బిడ్డ. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుండి విముక్తి కల్పిస్తాడు'అని చెప్పింది.

Christmas Wishes in Telugu : మీ సన్నిహితులంతా మెచ్చేలా క్రిస్మస్ విషెస్ చెప్పండి...!

ఏసు జననం అక్కడే..

ఏసు జననం అక్కడే..

అప్పటినుండి జోసెఫ్ దైవదూత మాటలను నమ్మి మేరీని ప్రేమతో ఆదరించాడు. అదే రాజు ఆదేశాల మేరకు జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమై బెత్లేహామ్ కు వెళ్తారు. అయితే వారు అక్కడికి వెళ్లేసరికి వారికి ఉండటానికి చోటు దక్కదు. చివరికి ఎలాగోలా ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తుండగా.. ఆ సమయంలో ఆకాశంలో నుండి ఒక దేవదూత కిందికి దిగొచ్చాడు.

లోక రక్షకుడు..

లోక రక్షకుడు..

వారి చుట్టూ అకస్మాత్తుగా వెలుగులు రావడంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. అప్పుడు దైవదూత ‘మీరు భయపడొద్దు.. ఓ శుభవార్తను చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని.. తనకు సంబంధించిన ఆనవాళ్లను చెప్పాడు. వారు వెంటనే పశువుల పాకలో తొట్టిలో పడుకుని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్ లను చూశారు. దేవదూత వారికి చెప్పిన విషయాన్ని అందరికీ తెలియజేశారు.

క్రిస్మస్ 2021

క్రిస్మస్ 2021

అలా 2 వేల ఏళ్ల కింద డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి వేళ ఏసు జన్మించాడు. అప్పటినుండి డిసెంబర్ 25వ తేదీన ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం ప్రారంభించారు. అయితే ఈ పండుగ నెలరోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. చాలా ప్రాంతాల్లో మినీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. ఈ సమయంలో క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా అలంకరిస్తారు. ఇళ్లలో నక్షత్రాల లైట్లు, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేస్తారు. ఇదే ఈ పండుగ యొక్క ప్రత్యేకత.

శాంటా తాత గిఫ్టులు..

శాంటా తాత గిఫ్టులు..

క్రిస్మస్ పండుగ రోజు ముందు రాత్రి వేళ శాంటా తాతా ఆకాశంలో నుండి జింకలు లాగే బండిలో వచ్చి చిన్నారులకు గిఫ్టులు ఇచ్చి వెళ్లాడని చాలా మంది నమ్ముతారు. అందుకే పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అందులో శాంటా తాతా వాటిలో గిఫ్టులను వేసి వెళ్తాడని నమ్ముతారు.

క్రిస్మస్ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు?

డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఏసు క్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.

ఏసుక్రీస్తు అర్థం ఏమిటి?

డిసెంబర్ 25వ తేదీన ఏసుక్రీస్తు జన్మించాడు. ఏసు అంటే అర్థం లోక రక్షకుడు. ఆయనే అందరికీ ప్రభువు అని.. దేవదూత ఆకాశంలో నుంచి వచ్చి చెప్పాడని చాలా మంది నమ్ముతారు.

English summary

Christmas Date, History, Story, Significance and Why we celebrated in Telugu

Here we are talking about the chirstmas 2021 date, history, story, significance and why we celebrated in Telugu. Have a look
Story first published: Tuesday, December 21, 2021, 16:08 [IST]