Latest Updates
-
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026
మీ అరచేతి రంగు మీ వ్యక్తిత్వం మరియు భవిష్యత్తు గురించి ఏమి చెబుతుందంటే...
మన కంటికి కనువిందు చేసే రెడ్ కలర్ అరచేతిని కలిగి ఉండటం అనేది అసాధారణం కాదు. ఈ చేతిని కలిగి ఉన్న వ్యక్తులు కష్టపడి పని చేస్తారు. వీరు పెద్ద సంఖ్యలో స్నేహితులను కలిగి ఉంటారు.
మన దేశంలో వేలి ముద్రలను బట్టి భవిష్యత్తును అంచనా వేసే సాధనాలు మన సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలో కూడా ఇప్పటికీ వీటిని నమ్మే వారు చాలా మందే ఉన్నారు. మన చేతుల్లో ఉన్న గుర్తులు, పంక్తులు అన్నీ మన జీవితాలకే సంబంధించినవే అని చెబుతున్నారు.

అయితే మన చేతుల్లో ఉండే రేఖలే కాదు. మన చేతుల రంగు కూడా మన భవిష్యత్తు మరియు వ్యక్తిత్వం గురించి రహస్యాలను తెలియజేస్తుందట. హస్తసాముద్రిక శాస్త్రం ద్వారా మీ అర చేతి రంగును బట్టి మీ ఫ్యూచర్ మరియు పర్సనల్ సీక్రెట్స్ ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

అరచేతి రంగులు
ఒకరి వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయడం మరియు వాటి గురించి చాలా నేర్చుకోవడం అనేది అత్యంత సులువైన విషయం. కొన్ని అరచేతులు ముందు మరియు వెనుక భాగంలో దాదాపు ఒకే రంగును కలిగి ఉండగా, కొన్ని పూర్తి భిన్నమైన రంగులను కలిగి ఉండొచ్చు. అరచేతి రంగులు సాధారణంగా రెడ్, ఎల్లో, పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీ అరచేతి రంగు మీ గురించి ఏమి చెబుతుందో చూద్దాం రండి...

పింక్ కలర్..
చాలా మందిలో ఈ అరచేతి యొక్క అత్యంత సాధారణమైన కలర్. ఈ రకమైన అరచేతి ఉన్న వ్యక్తి మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటుందని మరియు జీవితంలో ప్రతిదీ సమతుల్యతతో ఉందని సూచిస్తుంది. వీరు ఆహారం నుండి విద్య, ఆధ్యాత్మికత వరకు అన్నింటిలో క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటారు. వీరు తరచుగా ఆరోగ్యంగా ఉంటారు. పింక్ నుండి డీప్ పింక్ ఉన్నవారు లోతుగా ఆలోచిస్తారు. ఏదైనా ప్రారంభించే ముందు వీరు చాలా బాగా ప్రిపేర్ కావాలని కోరుకుంటారు. అందుకే ఇలాంటి వారిపై అందరూ చూస్తుంటారు. వీరి నుండి తప్పించుకునేది ఏదీ ఉండదు.

రెడ్ కలర్..
మన కంటికి కనువిందు చేసే రెడ్ కలర్ అరచేతిని కలిగి ఉండటం అనేది అసాధారణం కాదు. ఈ చేతిని కలిగి ఉన్న వ్యక్తులు కష్టపడి పని చేస్తారు. వీరు పెద్ద సంఖ్యలో స్నేహితులను కలిగి ఉంటారు. అంతేకాదు సామాజిక కార్యకర్తగా కూడా చురుకుగా ఉంటారు. వీరి శ్రమ చాలా వరకు మ్యానువల్ గా ఉంటుంది. ఉదాహరణకు వీరు తీవ్రమైన జిమ్నాస్ట్ లు. రెడ్ కలర్ వారు ఎక్కువగా అద్దం చూసుకోవడాన్ని ఇష్టపడతారు. అంతేకాదు వీరిలో చాలా శక్తి నిల్వ ఉంటుంది. అందువల్ల వీరు ఎల్లప్పుడూ చాలా వరకు శారీరక శ్రమ అవసరమయ్యే ఉద్యోగాన్ని ఎంచుకుంటారు.

ఎల్లో కలర్..
మీ అరచేతులు తీవ్రమైన పసుపు రంగులో ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కామెర్లను సూచిస్తుంది. మీకు కామెర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మేము యువ పసుపు అరచేతుల గురించి మాట్లాడుతున్నాం. పసుపు అరచేతులు ఉన్నవారు నిరాశ, ఆందోళనలకు గురవుతారు. ఈ వ్యక్తులు ఎవరికైనా ముందు కాలానుగుణ మార్పుల లక్షణాలను అనుభవిస్తారు. వీరు ప్రతి సీజన్ ప్రారంభంలో కొంతమంది ఒక నిర్దిష్ట అనారోగ్యాన్ని అనుభవించవచ్చు. వీరికి ప్రతికూల విషయాలు ఎదురైనప్పుడు కోపంగా మారిపోతారు. వీరు ఏదైనా విషయం అనుకుంటే, అది జరగకపోతే, వీరు తీవ్ర నిరాశకు గురవుతారు. ఏకంగా బయటి ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంటారు.

వైట్ కలర్..
అరచేతులు తెల్లగా ఉండే వ్యక్తులు స్వభావం పరంగా సైలెంట్ గా ఉంటారు. వీరు చుట్టుపక్కల వారితో అందరితో సున్నితంగా ఉండాలని, చక్కగా ప్రవర్తించాలని, అందరినీ సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. వీరి జీవితం ఎల్లప్పుడూ అందంగా మరియు అందరి కంటే భిన్నంగా ఉంటుంది. వీరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. వీరు ఇతరుల నుండి ఏమీ ఆశించరు. అందుకే వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

లైట్ బ్లాక్..
ఈ రంగులో ఉన్న అరచేతి వారు జీవితకాలమంతా పేదరికంలో జీవిస్తారు. ఆర్థిక పరంగా ఎల్లప్పుడూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా కష్టపడినప్పటికీ, వీరి కనీస అవసరాలను తీర్చుకోవడం అంత సులభం కాదు. వీరు ఆరోగ్యం విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

అరచేతుల్లోని గుర్తులు..
అరచేతుల్లో తాటి మచ్చలున్న వారు మద్యానికి బానిసలవుతారు. వీరు జీవితం యొక్క ప్రాథమిక ఆనందంలో లేకపోవచ్చు. వీరి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి.



Click it and Unblock the Notifications