Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
యువత ఈ చెడు అలవాట్లను మానేయకపోతే అంతే సంగతులు..
ఆల్కహాల్ ను నేటి యువత అమితంగా ఇష్టపడుతున్నారు. మద్యం కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు.
ఈ విశ్వంలో నేటి తరం యువత రోజు రోజుకు చెడు అలవాట్లకు చాలా తొందరగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వరకే ఉన్న ఈ అలవాటు నేడు స్మార్ట్ ఫోన్ ఫోబియాతో మరింత దిగజారిపోయింది. అంతే కాకుండా మరిన్ని చెడు అలవాట్లతో తమ జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు.

మన దేశంలో నేటి యువతే రేపటి భవిత అని చెప్పుకుంటున్న తరుణంలో ఇలాంటి చెడు అలవాట్ల వల్ల అదే యువత అనవసరమైన వాటికి బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది కాలేజీకి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే యువత ఎక్కువగా ఉండటం విచారకరం. ఇవేకాక ఇంకా ఏమేమీ చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని ఎలా మానేయాలో తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చదవండి.

1) స్మార్ట్ ఫోన్ ఫోబియా..
ఈ ఆధునిక ప్రపంచంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాలా మందికి స్మార్ట్ ఫోబియా పట్టుకుంది. కాలేజీలోనూ, ట్రాఫిక్ లోనూ, ఇంట్లో, ఆఖరికి నిద్రపోయే సమయంలోనూ స్మార్ట్ ఫోన్ ను వదలటం లేదు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ఫోబియా నుండి బయట పడేందుకు కొన్ని చిట్కాలను పాటించండి. స్నేహితులతో, బంధువులతో కలిసి బయటకు వెళ్లే సమయంలో ఫోన్ తీసుకెళ్లద్దు. బెడ్ రూమ్ లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు. లివింగ్ రూమ్ లోనే ఫోన్ వదిలేయండి. మీ ఫోన్ లో అనవసరమైన యాప్స్ ఉంటే డిలీట్ చేయండి. అనవసరంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారో లేదో గుర్తించి ఆ సమయాన్ని తగ్గించుకోండి. రోజు లేదా వారంలో గ్యాడ్జెట్స్ కు ఎంత దూరంగా ఉంటున్నారో.. ఆ సమయం అంతా కుటుంబసభ్యులు, స్నేహితులకు కేటాయించండి. మీ ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.

2) పోర్న్ సైట్స్..
పోర్న్ సైట్స్ ను భారత ప్రభుత్వం నిషేధించినప్పటికీ యువతకు వాటిపై మక్కువ అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికీ యువత వ్యసనాలలో పోల్చితే పోర్న్ రెండో స్థానంలో వచ్చినట్లు పలు అధ్యయనాల ద్వారా తెలిసింది. వారి కళ్లకు మరియు శరీరానికి అవి చాలా ఆనందాన్ని ఇస్తున్నట్లు తెలిసింది. వీటి నుండి బయటపడటానికి ఆధ్యాత్మిక చింతన చేయండి. లేదా కుటుంబ సభ్యులతో కలిసి గడపండి. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండకండి. ఎప్పుడూ స్నేహితులతో కలిసి కబుర్లు చెబితే ఫలితం కచ్చితంగా ఉంటుంది.

3) అధిక ఆల్కహాల్ తో అనర్థాలే..
ఆల్కహాల్ ను నేటి యువత అమితంగా ఇష్టపడుతున్నారు. మద్యం కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. నిత్యం మద్యపానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా వాటిని వదలలేకపోతున్నారు. ఇలాంటి వారు తమ మైండ్ ని డైవర్ట్ చేసుకోవాలి. మద్యానికి బదులు నీళ్లను ఎక్కువగా తాగాలి. ఇష్టమైన వాళ్లతో మాట్లాడాలి. అప్పుడు ప్రయోజనం ఉంటుంది.

4) ధూమపానం, మాదక ద్రవ్యాలు..
ధూమపానం వల్ల కలిగే ప్రభావాలను ప్రతి సినిమా షో లో ప్రకటనలు వేసి మరీ చూపించినా యువకుల మనసులు మారడం లేదు. పైగా ఈ మధ్య సిగరెట్ లో మాదకద్రవ్యాలను నింపుకుని మరీ పొగ తాగుతున్నారు. దీని నుండి మంచి కిక్ వస్తుందనే భ్రమలో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు వీటిని మానేయాలంటే ప్రతిరోజూ 8 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మీ మైండ్ ను డైవర్ట్ చేయాలి..

5) జంక్ ఫుడ్ తో జాగ్రత్త..
జంక్ ఫుడ్ ఆరోగ్యకరమైనది మరియు మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది అనుకుంటే పొరపాటే. చాలా మంది యువతలో ఇదే ఫీలింగ్ ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బర్గర్ లేదా పిజ్జా వంటి వాటిని నిత్యం తీసుకుంటుంటారు. కానీ వీటిని పరిమితికి మించి తీసుకుంటే తిప్పలు తప్పవు. అందుకే వీటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది.

ఎక్కువ మందితో రిలేషన్ షిప్..
ఒకరిద్దరి కంటే ఎక్కువ మందితో వివాహానికి ముందే రిలేషన్ షిప్ కొనసాగించడం కూడా యువతకు ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇప్పటికీ చాలా మంది యువత ఎక్కువ మందితో రిలేషన్ షిప్ చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటున్నారు. ఇలాంటి వాటిని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. లేదంటే అనేక రకాల సుఖ వ్యాధులతో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విపరీతంగా దుబారా ఖర్చులు..
ప్రస్తుత యువత విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. పరిమితికి మించి అనవసరం ఖర్చు చేస్తూ తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బు కాకపోవడంతో వారికి వాటి విలువ తెలియడం లేదు. తర్వాత వారి తల్లిదండ్రులతో చివాట్లు తింటున్నారు. అందుకే డబ్బును పొదుపుగా వాడటం ఇప్పటి నుండే అలవాటు చేసుకోవాలి.

హ్యాంగ్ అవుట్..
చాలా మంది యువత కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు హ్యాంగ్ అవుట్ గురించి ఆలోచిస్తున్నారు. వీటితో పాటు ఈ మధ్యన రేవ్ పార్టీలతో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఇంకా కొంత మంది రోడ్ల పక్కన కూర్చుని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వీటిని కూడా మానేయాలి. ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కసారి మీ కుటుంబసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటే మీరు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడరు.

తరచూ అబద్ధాలు చెప్పడం..
చిన్న చిన్న అబద్ధాలే మీకు చాలా ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. దీని వల్ల అసలు నిజం బయటపడుతుందనే భయం, ఒత్తిడి కలుగుతుంది. అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు నిజం చెప్పేందుకే ప్రయత్నించండి.

అనారోగ్యకరమైన సంబంధాలతో ఎక్కువ కాలం కొనసాగడం..
కొన్ని సందర్భాల్లో మీకు మీ సంబంధం ఆనందాన్ని లేదా సంతోషాన్ని ఇవ్వకుండా ఉంటే ఆ ప్రభావం మీ శరీరంపై పడుతుంది. అలా ఎక్కువ కాలం కొనసాగే కంటే వాటిని వదులుకోవడం చాలా చాలా ఉత్తమం అనిపించుకుంటుంది. అనారోగ్యకరమైన సంబంధాల వల్ల అనసవరపు ఒత్తిడి కలగడంతో పాటు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థపై చాలా చెడు ప్రభావమే చూపెడుతుంది. అంతే కాదు రక్తపోటు (బిపి) కూడా తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications











