Latest Updates
-
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్!
మీరు ప్రేమలో ఉన్నట్టు కలలు వస్తున్నాయా? వాటి అర్థమేమిటంటే...!
అయితే కొందరు అమ్మాయిలు మాత్రం విచిత్రమైన కలలు కంటూ ఉంటారట. ముఖ్యంగా పెళ్లి కాకముందే తాము కడుపుతో ఉన్నట్టు కలలు కంటూ ఉంటారట.
''కలలు కనడం కాదు. వాటిని నిజం చేసుకోవాలి'' అని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అబ్దుల్ కలాం గారు అన్నారు. అప్పుడు మన జీవితంలో విజయం సాధించగలుగుతామని ఆయన ఎప్పుడో చెప్పారు. అలా వాటిని నిజం చేసుకున్న వారందరూ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు.

అయితే కలలు అనేవి అందరికీ వస్తుంటాయి. ప్రతి ఒక్కరికీ వచ్చే కలలు నిజం అవ్వాలని రూలేమీ లేదు. అయితే గట్టిగా ప్రయత్నిస్తే వాటిని నిజం చేసుకోవచ్చు. వీటన్నింటి గురించి పక్కనబెడితే అందరికీ నిద్ర పోయినప్పుడు వచ్చే కలలో ప్రతి ఒక్క దానికి ఒక్కో అర్థం ఉందని మీకు తెలుసా..

కొందరేమో నిద్రలో నుండి అకస్మాత్తుగా లేవడం, తమకు ఏదో జరుగుతున్నట్లు భావించడం. వంటి కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలలు రావడానికి కారణమేమిటంటే నిత్య జీవితంలో చాలా వరకు వారు ఎదుర్కొనే పరిస్థితులే కారణమని పలు అధ్యయనాలలో తేలిందట. ఈ సందర్భంగా అందరికీ వచ్చే కలలేంటో వాటిలో ఒక్కో కలకు ఎలాంటి అర్థం ఉంటుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం...

యవ్వనంలోని కలలు..
యువత యవ్వనంలో ఎక్కువగా రొమాంటిక్ కలలు కంటూ ఉంటారట. తమకు ఇష్టమైన వారిని కలలో ఊహించుకుంటూ ఉంటారట. అమ్మాయిలు అయితే అందమైన అబ్బాయిల గురించి.. అబ్బాయిలైతే అందమైన భామల గురించి కలలు కంటూ ఉంటారట.

ప్రేమికుల గురించి..
మీరు గాఢంగా నిద్ర పోతున్న సమయంలో మీకు మీ ప్రేమికుల గురించి కలలు వస్తున్నట్లయితే, ఇది వారితో ఉన్న సాన్నిహిత్యానికి సంకేతం అని చెప్పొచ్చు. అయితే మీరు దేని గురించి అయితే కలలు గంటున్నారో, అందులో ఏదో వెలితి ఉందని, అది నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు ఇది సూచిస్తుంది.

కడుపుతో ఉన్నట్టు కలలు..
అయితే కొందరు అమ్మాయిలు మాత్రం విచిత్రమైన కలలు కంటూ ఉంటారట. ముఖ్యంగా పెళ్లి కాకముందే తాము కడుపుతో ఉన్నట్టు కలలు కంటూ ఉంటారట. ఇలాంటి కలలు వస్తే వారి జీవితంలో ఎదుగుదలకు, అలాగే వారి జీవితంలో పెద్ద మార్పుకి సూచనగా పరిగణించవచ్చట.

ఎక్కువగా డబ్బులు..
కలల ప్రపంచంలో కొందరికి ఎక్కువగా కాసులు కనబడతాయట. ఈ ప్రపంచంలో తాము కూడా కోటీశ్వరులమనే కలలు గంటూ ఉంటారట. అయితే ఇది వారి మనస్తత్వంలోని లోపాలకు ప్రతిబింబం అని చెప్పొచ్చు.

వివాహేతర సంబంధం..
ఇంకా కొంత మంది అయితే కలల్లో తాము ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. తమ జీవిత భాగస్వామిని మోసం చేయడం వంటి కలలను కంటూ ఉంటారట. ఇలాంటి కలలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే..

ఆనందంగా లేకపోతే..
తమ లైంగిక జీవితంలో కోరికలు అణచుకోవడం.. జీవిత భాగస్వామితో ఆనందంగా లేని సమయంలో ఇలాంటి కలలు ఎక్కువగా వస్తాయంట. వీరిలో స్వీయ విలువ తగ్గినట్టు అనిపించినప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయట.

కొందరికి మరణించినట్టు..
అయితే కొందరికి మాత్రం వారు చనిపోయినట్టు.. లేదా ఇంకా వారి బంధువులు లేదా వారికి ఇష్టమైన వారు అకస్మాత్తుగా చనిపోయినట్టు కలలు కంటూ ఉంటారు.

జీవితంలో ఒక అంకం..
అందుకు అర్థమేమిటంటే.. వారి జీవితంలో ఒక అంకం లేదా ఒక బంధం ముగిసిపోవడం. ఇది ఒక సూచనవంటిదట.

కలలో దేవుడు కనిపిస్తే..
మీకు కలలో దేవుడు కనిపిస్తే చాలా శుభపరిణామం అని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతం అవుతుంటే మీ మనసునే నమ్మండి.. అప్పుడు దేవుడే మీకు సందేశం ఇచ్చాడని అనుకోవచ్చట.

కుటుంబ సభ్యులు కనిపిస్తే..
మీరు నిద్రలోకి జారుకున్న సమయంలో మీ కుటుంబ సభ్యులు మీకు కలలో వస్తే మీరు సంతోషకరమైన జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications