For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cyclone Jawad : తుఫాను వేళ.. తుఫానుకు ముందు, తర్వాత సురక్షితంగా ఉండేందుకు ఇలా చేయండి...

|

వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. ఒడిశా, ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం), పశ్చిమ బెంగాల్ లోని కొన్ని జిల్లాల్లో జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తుఫాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు వివరించారు.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక్రుతమై ఉంది. మరో 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుఫాన్(జవాద్)గా మారే సూచనలు కనిపిస్తున్నాయని,

ఈ వాయుగుండం ప్రస్తుతం గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని, శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి దగ్గర వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపలవేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా తుఫానుకు ముందు.. తుఫాను సమయంలో.. తుఫాను తర్వాత ప్రజలందరూ సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పుకార్లను నమ్మకండి..

పుకార్లను నమ్మకండి..

తుఫాను సమయంలో వాస్తవాల కంటే పుకార్లు విపరీతంగా ప్రచారంలోకి వస్తుంటాయి. దీని వల్ల ఏవేవో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

* తుఫాను లేదా ఏదైనా విపత్తుల సమయంలో పుకార్లను అస్సలు నమ్మకండి. ప్రశాంతంగా ఉండండి.. భయపడకుండా ధైర్యంగా ఉండండి.

* కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ ను ఫుల్ ఛార్జింగులో ఉంచుకోండి.

* రేడియోను ఎక్కువగా వినండి. టివిలో న్యూస్ చూస్తూ ఉండండి. వాతావరణ విశేషాల కోసం కొన్ని వార్తాపత్రికలను చూడండి.

* మీ విలువైన పత్రాలు మరియు విలువైన వస్తువులను నీరు రాకుండా ఉండే ప్రదేశంలో ఉంచండి.

* అవసరమైన వస్తువులతో అత్యవసర సామాగ్రిని సిద్ధం చేసుకోండి.

* జంతువుల భద్రతను గుర్తుంచుకోండి.

అధికారిక ప్రకటనలనే..

అధికారిక ప్రకటనలనే..

* ఎలక్ట్రికల్ మరియు గ్యాస్ సరఫరాను ఆపేయండి.

* మీ తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.

* మీ ఇల్లు సురక్షితం కాదని భావిస్తే, తుఫాను రావడానికి ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి.

* ఉడికించిన లేదా క్లోరినేటెడ్ నీటినే తాగాలి.

* అధికారిక హెచ్చరికలను మాత్రమే ఫాలో అవ్వండి.

ఇలా చేయొద్దు..

ఇలా చేయొద్దు..

* మీరు తుఫాను సమయంలో దెబ్బతిన్న భవనాలలోకి ప్రవేశించకండి.

* విరిగిన విద్యుత్ స్తంబాల దగ్గరకు వెళ్లకండి.

* తెగిపడిన విద్యుత్ తీగలను పట్టుకోకండి.

* పదునైన వస్తువులకు దూరంగా ఉండండి.

* వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.

మీరు ఉండే ప్రాంతాల్లో..

మీరు ఉండే ప్రాంతాల్లో..

* మీరు ఆశ్రయం పొందిన చోట నుండి.. ఇంటికి వెళ్లడానికి సురక్షితమని భావించినప్పుడు అడుగు ముందుకేయండి.

* ముందుగానే అంటువ్యాధుల నివారణ టీకాలు వేయించుకోండి.

* వేలాడుతున్న తీగలకు దూరంగా ఉండండి.

* తుఫాను సమయంలో డ్రైవింగులో ఉంటే జాగ్రత్తగా ఉండండి.

* మీరు ఉండే ప్రదేశంలో శిథిలాలను క్లియర్ చేయండి.

వ్యూహాత్మకంగా వ్యవహరించాలి..

వ్యూహాత్మకంగా వ్యవహరించాలి..

ప్రకృతి వైపరీత్యాలు తరచుగా ప్రజల ఇళ్లకు మరియు ఆస్తికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ముఖ్యం. ఈ సమయంలో తగినంత సురక్షితమైన నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే నిత్యవసరాలను కూడా వీలైనంత మేరకు దగ్గర ఉంచుకోవాలి. అలాగే పుకార్లను నమ్మకూడదు. అధికారిక ప్రకటనలనే నమ్మాలి. ఇతరులను అప్రమత్తం చేయాలి. అత్యవసర సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయం కోరవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు కావాల్సిన సహాయాన్ని పొందొచ్చు.

జవాద్ తుఫాను సమయంలో ఏమి చేయాలి?

ఏ రాష్ట్రాలపై జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది?

వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. ఒడిశా, ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం), పశ్చిమ బెంగాల్ లోని కొన్ని జిల్లాల్లో జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తుఫాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు వివరించారు.

English summary

Cyclone Jawad: How to Be Safe Before, During and After the Storm in Telugu

Here we talking about the Cyclone Jawad: How to be safe before, during and after the storm in Telugu. Read on
Story first published: Friday, December 3, 2021, 13:15 [IST]