For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 10, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Aries on 10 April: శుక్రుడు మేషంలోకి ఎంట్రీ వల్ల ఈ రాశులకు గొప్ప ప్రయోజనం...!Venus Transit in Aries on 10 April: శుక్రుడు మేషంలోకి ఎంట్రీ వల్ల ఈ రాశులకు గొప్ప ప్రయోజనం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంతో ఉంటారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు పెద్ద ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో పోటీ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు కష్టపడి పని చేయాలి. మరోవైపు మీరు వ్యక్తిగతంగా కోపాన్ని నియంత్రించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు పెద్దగా సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీకు మీ కుటుంబం మరియు స్నేహితుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఉద్యోగులు చాలా బిజీగా ఉంటారు. మీకు కొంత పనిభారం పెరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల మీ పనులు పెండింగులో పడొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఆన్ లైన్ వ్యాపారం చేసే వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో నష్టం ఉండొచ్చు. మరోవైపు, ఈరోజు ఉపాధి ప్రజలకు చాలా ముఖ్యమైన రోజు కానుంది. ముఖ్యంగా మీరు బ్యాంకింగ్ రంగంలో ఉంటే, ఈరోజు మీరు మీ పురోగతి సంకేతాలను పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు రుణం తీసుకున్నట్లయితే వీలైనంత త్వరగా దాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మిమ్మల్ని మానసికంగా బలంగా ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు సహనంతో పని చేయాలి. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు మీరు సౌకర్యవంతమైన విషయాలకు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ తండ్రితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు వారి ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చాలా కష్టపడాలి. మీరు పని పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేకపోతే మీ పురోగతి ఆగిపోవచ్చు. ఈరోజు వ్యాపారులకు మంచి రోజు అవుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. డబ్బు విషయానికి వస్తే, ఆర్థిక నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి మీరు రుణాలు తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటే, మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఇంటి పెద్దలతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు పొందుతారు. ఈరోజు మీ ప్రియమైనవారు కూడా మంచి మానసిక స్థితిలో ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు మీరు పని నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుంది. మీ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ, కొత్త కోర్సు చేయాలనుకుంటే, ఈరోజు మీ ప్రణాళికను కొనసాగించడానికి అనుకూలమైన రోజు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మీ పని స్టాక్ మార్కెట్‌కు సంబంధించినది అయితే తొందరపడకండి. మీ ఇంటి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ మనసులో చాలా ఆందోళనలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు చిన్న రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఈరోజు మీరు సోమరితనం మరియు బద్ధకం అనుభూతి చెందుతారు. అటువంటి పరిస్థితిలో, మీరు పనిలో సరిగ్గా దృష్టి పెట్టలేరు. మీకు చాలా ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. వ్యాపారులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో తమ సామర్థ్యం మరియు సృజనాత్మకతతో ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. మీరు ఈ విధంగా కష్టపడి పనిచేస్తే, త్వరలో మీరు పెద్ద పురోగతిని పొందవచ్చు. వ్యాపారులు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే, ఈరోజు దీనికి అనుకూలమైన రోజు. మీరు గొప్ప అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే ఖర్చులను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇతరుల ఆదేశాల మేరకు మీ స్వంత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు ఉండొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా శుభవార్త వినొచ్చు. ఈ రోజు మీరు ఏదైనా పెద్ద మానసిక ఆందోళన నుండి బయటపడే అవకాశం ఉంది. మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు బాధ్యతల భారం పెరగొచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి సమయంలో మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ప్రణాళికలన్నింటినీ మంచి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ శృంగార జీవితంలో పరిస్థితులు సాధారణమైనవిగా కనిపిస్తాయి. మీరు కొన్ని రోజులుగా మీ భాగస్వామితో ఇబ్బంది పడుతుంటే, ఈరోజు మీ మధ్య అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒకరితో ఒకరు తగినంత సమయాన్ని కూడా గడుపుతారు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, అలసట మరియు ఒత్తిడి వంటి సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి మీ వ్యాపారం విదేశీ సంస్థలతో అనుసంధానించబడి ఉంటే, మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. అదే విధంగా మీకు మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీరు క్రొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, వారి ఆశీర్వాదాలను తీసుకోండి. మరోవైపు ఈరోజు, ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించేటప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే.. సీనియర్ల నుండి సలహా తీసుకోవాలి. మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే మీకు పనిభారం పెరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. వ్యాపారులు ఈరోజు చాలా బాధ్యతగా పని చేయాలి. మీకు లాభాలు రాకపోతే, మీరు పబ్లిసిటీపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు. మీరు ఈరోజు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:10 నుండి రాత్రి 9:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ పరిమాణంలో నీటిని కూడా తీసుకోవాలి. మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే, పెద్దల సలహా తీసుకుండి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది. ఈరోజు మీ ప్రియురాలితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీరు మంచి ఆఫర్ పొందవచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope April 10, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Friday, April 9, 2021, 23:01 [IST]
Desktop Bottom Promotion