For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి పాత పరిచయాల నుండి ఆర్థిక ప్రయోజనాలు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 11, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Aries on 10 April: శుక్రుడు మేషంలోకి ఎంట్రీ వల్ల ఈ రాశులకు గొప్ప ప్రయోజనం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అయితే ఆర్థిక పరిమితుల కారణంగా, కొన్ని పనులు పెండింగులో పడొచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఒక భారీ మార్పు ఉంటుంది. అకస్మాత్తుగా మీకు ట్రాన్స్ ఫర్ కావొచ్చు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం పెరుగుతుంది. మరోవైపు ఈరోజు మీ బంధువులతో గొడవలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, నిర్లక్ష్యంగా ఉండకండి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. మీ యజమాని ఈ రోజు మీ చర్యలను కూడా సమీక్షించవచ్చు. వ్యాపారులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. అయితే మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేయకూడదు. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉండొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, మీరు ఈరోజు వైద్యుడిని సంప్రదించాలి. వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వారు మీ పనికి ఆటంకాలు కలిగించొచ్చు. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబంతో చాలా మంచి సమయం గడుపుతారు. మీ తమ్ముడు లేదా సోదరి వివాహానికి అర్హులు అయితే, ఈరోజు వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీ ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహించే బలమైన అవకాశం ఉంది. ఈరోజు బంగారం, వెండి వ్యాపారం చేసే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీకు ఏదైనా పని ఇస్తే, దాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు అది ముగిసిపోవచ్చు. ఈరోజు మీరు శ్రద్ధగా పని చేయగలుగుతారు. రవాణా రంగంలో పని చేసే వారికి ఈరోజు ఆర్థిక పరంగా నష్టం రావొచ్చు. ఏదైనా చట్టపరమైన విషయం కూడా మిమ్మల్ని బాధపెడుతుంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే, ఎలాంటి సమస్య ఉండదు. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంతో ఉంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడొచ్చు. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, మీకు ఇంటి సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీ తల్లిదండ్రులు మీకు మద్దతు ఇస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఈరోజు మంచి విదేశీ సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ పొందొచ్చు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. తొందరపడి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు త్వరలో ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బాగుంటుంది. ఈరోజు మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. మీకు సహోద్యోగులతో కూడా మంచి సంబంధం ఉంటుంది. మీరు పెద్ద వ్యాపారవేత్త అయితే మీ పాత పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రవర్తనను అందరితో చక్కగా ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం ద్వారా మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం క్షీణించడం వల్ల, మీ రోజువారీ ప్రణాళికల్లో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది అవుతుంది. కొన్ని ప్రతికూల విషయాలకు ఖర్చులు చేయొచ్చు. మరోవైపు ఉద్యోగులు విదేశీ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, మీ ప్రయత్నాలను పెంచుకోవాలి. వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనకరమైన రోజు కానుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీకు ఇంటి సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు మీ ప్రియురాలిని నిరాశపరచకపోవడమే మంచిది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ మరియు మెడికల్ సీటు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. బహుశా ఈరోజు మీరు పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ బాస్ ముందు మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఈరోజు ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఈరోజు ప్రైవేట్ ఉద్యోగులకు చాలా బిజీగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు టార్గెట్ బేస్డ్ వర్క్ పనిచేస్తుంటే, ఈరోజు లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చాలా ఆందోళన చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. దీనితో పాటు, మీకు సహచరులు మరియు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కలప వ్యాపారులు మంచి ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీకు ఆర్థిక రంగంలో మంచి రోజు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే మీరు అనవసరమైన గందరగోళంలో చిక్కుకుంటారు. ఉద్యోగులు ఈరోజు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో పని చేస్తుంటే, మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు మంచి ప్రయోజనాలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఈరోజు చేతులు లేదా కాళ్ళకు సంబంధించి ఏదైనా సమస్య ఉండవచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope April 11, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Saturday, April 10, 2021, 21:17 [IST]
Desktop Bottom Promotion