For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 14, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Aries on 10 April: శుక్రుడు మేషంలోకి ఎంట్రీ వల్ల ఈ రాశులకు గొప్ప ప్రయోజనం...!Venus Transit in Aries on 10 April: శుక్రుడు మేషంలోకి ఎంట్రీ వల్ల ఈ రాశులకు గొప్ప ప్రయోజనం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నించండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో తొందరపడకండి. మరోవైపు ఈరోజు ఆదాయ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ మీ ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే, వారిపై మీరు అదనపు శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ కొన్ని ప్రధాన సమస్యలు ముగిసిపోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. అలాంటి సమయంలో ఒత్తిడిగా ఫీలవ్వకుండా పనిచేస్తే, మీరు పురోగతి పొందుతారు. కాబట్టి మీరు కష్టపడి పని చేయాలి. మరోవైపు భాగస్వామ్యంతో పని చేసే వ్యాపారులు ఈరోజు కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారులు ఈరోజు నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావొచ్చు. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీంతో మీపై పనిభారం కూడా తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీరు ఈరోజు కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో పనిచేసే వారు ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. మరోవైపు ఈరోజు నిరుద్యోగులు ఉపాధి పొందే బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా లాభపడొచ్చు. మీరు షాపింగ్ చేయాలని ఆలోచిస్తుంటే, ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు సిగరెట్, ఆల్కహాల్ వంటి చెడు అలవాటు ఉంటే, మీరు వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే రాబోయే సమయంలో మీరు ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంటి. మీ జీవిత భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడానికి అనుమతించకపోతే మంచిది. మరోవైపు ఉద్యోగులు ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో ఏదైనా లోపాలుంటే, తప్పకుండా వాటిని గుర్తించాలి. లేకపోతే మీరు చాలా ఇబ్బందుల్లో ఉండవచ్చు. వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, తొందరపడకండి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే.. ఈరోజు అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పూర్తి సానుకూలతతో ముందుకు సాగితే, కచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో నిర్లక్ష్యానికి దూరంగా ఉండాలి. ఈరోజు మీపై కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం పెరగొచ్చు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా పరీక్ష రాసి ఉంటే, మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, మీరు ఉన్నత విద్యను సాధించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, మీ ప్రయత్నం విజయవంతమైందనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. వ్యాపారులకు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు రావొచ్చు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయానికి ఆలస్యంగా చేరుకుంటే, మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా ఈ అలవాటును మార్చడం మంచిది. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు వివాహం చేసుకుంటే, ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. మీరు మీ ప్రియమైన వారి నుండి అందమైన బహుమతిని కూడా పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు ఇంటి మరమ్మత్తు లేదా ఇతర ఖర్చుల గురించి ఆలోచిస్తుంటే, ఈరోజు దీనికి సరైన రోజు కాదు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాస్ ఏదైనా పని అప్పగిస్తే, మీరు చాలా బాధ్యతగా చేయాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మరోవైపు ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన పెద్ద పనులు చేయకపోవడమే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవి. మీ ఇంటి పెద్దల మనోభావాలను దెబ్బతీసే పని చేయవద్దు. గృహ విబేధాలు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మీరు వారిని బాగా చూసుకోవాలి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో కలిసి కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంటే, అహంకార భావనను వీడాలి. మీ ప్రవర్తనను అందరితో చక్కగా ఉంచాలి. మీరు ఈ పనిలో విజయం సాధిస్తే, క్రెడిట్ ప్రతి ఒక్కరికీ వెళ్ళాలని గుర్తుంచుకోండి. ఈరోజు వ్యాపారులు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఈరోజు, మీరు కోరుకోకపోయినా, భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు బాగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. మీ ఆరోగ్యాన్ని మరియు మీ పనిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలోని సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వకండి. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకోగలరని గుర్తుంచుకోండి. ఇది మీకు పురోగతికి మార్గంగా పని చేస్తుంది. చిన్న పనులను కూడా పూర్తి నిజాయితీ మరియు అంకితభావంతో పూర్తి చేయడం మంచిది. మరోవైపు ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పని ధాన్యాలకు సంబంధించినది అయితే, మీరు రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు సానుకూల శక్తితో చుట్టుముట్టారు. మీరు మతపరమైన పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీరు కొన్ని మత ప్రదేశాలకు వెళ్ళవచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. మీ కృషిని బాస్ మరియు సీనియర్ అధికారులు అభినందిస్తారు. ఈరోజు విదేశీ సంస్థలలో పనిచేసే ప్రజలకు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీ కృషి విజయవంతమవుతున్నట్లుంది. మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఈరోజు కొత్త స్టాక్‌లకు మంచి రోజు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయం బాగుంటుంది, కానీ పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope for April 14, 2021 in Telugu

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Desktop Bottom Promotion