Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బుధవారం మీ రాశిఫలాలు (15-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీరు కుటుంబం మరియు స్నేహితులతో ఇంట్లో చాలా ఆనందిస్తారు. ఈరోజు మీరు చాలా ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. మీకు వారి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బాగుంటాయి.
ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. త్వరలో మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక పని ఒత్తిడి కారణంగా మీకు చిరాకుగా అనిపించవచ్చు. అయితే మిమ్మల్ని మీరు బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాపారులకు ఈరోజు కొంత నిరాశ ఎదురుకావచ్చు. మీ కుటుంబ జీవితంలో మీకు శాంతి ఉంటుంది. అయితే బాధ్యతలు పెరగొచ్చు. అయితే మీ ప్రియమైన వారి మద్దతుతో మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల అంచనాలను అందుకుంటారు. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ విషయంలో ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అయితే మీ ఇద్దరూ పరస్పరం అవగాహనతో మెలిగితే, మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆదాయం పెరగొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాన్ని పొందాల్సి ఉంటుంది. ఉద్యోగులకు వేతనం పెరగటం గురించి సానుకూల వార్తలు వినిపిస్తాయి. వివాహిత జంటలకుఈరోజు కొన్ని మంచి సంకేతాలు ఉంటాయి. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ దినచర్యలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామిపై ప్రేమ మరోసారి పెరుగుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. అందుకు తగ్గట్టే ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి సాయంత్రం 7:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారి వారిలో పని చేసే వారు ఈరోజు ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వివాహితులు ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్య పరంగా మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు వ్యాపారం గురించి కొంత ఆందోళన చెందుతారు. పని విషయాలో ఈరోజు నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ఎవరి సహాయం అయినా తీసుకోవచ్చు. లేదంటే మీకే ఇబ్బందులు పెరుగుతాయి. శ్రామిక ప్రజలు తమ పనిని కష్టపడి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. అయితే అదే స్థాయిలో ఎక్కువ ఖర్చులుంటాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. లేదంటే మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులకు ఓ శుభవార్త వినిపిస్తుంది. ఈ రోజు, మీరు మీ వ్యాపారంలో చాలా వేగాన్ని చూస్తారు, ఏ అభివృద్ధి అయినా త్వరలో జరుగుతుంది. మరోవైపు, ఉపాధి ఉన్నవారు ఈ సమయంలో ఓపిక పట్టాలి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, ఉన్నతాధికారులతో మాట్లాడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ జీవితంతో కొంత ఆందోళన ఉంటుంది. మీ వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీ మానసిక స్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా కంట్రోల్ లో ఉండాలి. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా ఆర్థిక ప్రయత్నం విజయవంతమవుతుంది. సకాలంలో మీకు డబ్బు లభిస్తుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. అలాగే, ఈ రోజు మీరు మీ ప్రియమైనవారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయగలరు. ప్రేమగల జంటలకు ఈ రోజు గొప్ప రోజు అవుతుంది. ఈరోజు మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగులకు ఈరోజు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 7:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ ప్రేమ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరమైన విషయాలలో చాలా తెలివిగా పని చేయాలి. మీరు మీ బడ్జెట్ బట్టి ఖర్చులు చేయాలి. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఒక అందమైన రోజును ఆస్వాదించవచ్చు. పని విషయంలో బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈ రోజు మీకు చాలా బిజీగా ఉంటుంది. ఈ రోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి, ఈ రోజు కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు కొంతమంది సృజనాత్మక వ్యక్తుల సహాయం తీసుకోవాలి. పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటే, మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు మరింత కష్టపడాలి. మీ జీవిత భాగస్వామిని ప్రేమతో, గౌరవంగా నడుచుకోండి. మీ ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications











