For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (09-04-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

వాస్తు ప్రకారం, మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే స్త్రీలు ఈ విధంగా చేయాలి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యభర్తల మధ్య ఈరోజు తగాదా పెరగొచ్చు. మీరు ఇలాంటి సమయంలో సహనంతో ఉండాలి. ఉద్యోగులు ఈరోజు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పనిలో ఎక్కువ ఒత్తిడి ఉండొచ్చు. దీని వల్ల మీ పని ఈరోజు చాలా నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. మీరు ఈ రోజు మీ పనిని వాయిదా వేస్తే, అప్పుడు మీపై పని భారం రేపు కొంచెం పెరుగుతుంది. మీరు సరైన ప్రణాళిక ప్రకారం మీ పనిని చేయడం మంచిది. మరోవైపు ఈ రోజు శృంగార జీవితంలో మీరు మళ్ళీ మంచి అనుభూతిని పొందుతారు. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఇంకోవైపు ఆర్థిక పరంగా మెరుగవ్వడానికి మీరు ఈరోజు కష్టపడాల్సి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మంచి ఫలితాలు రావచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. వారి మనసు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ వంటి అవకాశాలు రావచ్చు. వ్యాపారులు తమ పోటీదారులకు కఠినమైన పోటీని ఇవ్వగలరు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు ఆప్యాయత ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుదల కోసం మీరు చాలా తెలివిగా పని చేస్తారు. ఈరోజు మీరు కొంత ఆదాయాన్ని కూడా ఆదా చేయగలుగుతారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగు తున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు మీ భాగస్వామి నుండి మీకు మద్దతు రాకపోవచ్చు. దీని వల్ల మీరు చాలా బాధపడతారు. ఉద్యోగులు పని విషయంలో చాలా ఓపికగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు కొంతమంది పేదవారికి కూడా సహాయపడగలరు. ఈరోజు శృంగార జీవితంలో పరి స్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రోజు మీరు మీ భాగస్వామి యొక్క అసంతృప్తిని అధిగమించగలుగుతారు. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందకపోవచ్చు. మీరు ఈరోజు సానుకూలంగా ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మీకు కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ రోజు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయానికొస్తే, మీరు ఈరోజు కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరమైన వాటికి ఖర్చు పెట్టొద్దు. ఈరోజు కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి ఉదయం 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. మీ కార్యాచరణ కూడా పెరుగుతుంది. ఉద్యోగులు సీనియర్లతో మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీతో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం తరువాత, మీరిద్దరూ ఒకరితో ఒకరు మంచి సమయం గడపడానికి అవకాశం పొందుతారు.అయితే మీ శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఇది మీ మధ్య ఉద్రిక్తతకు కారణమవుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా అదృష్టం కలసి వస్తుంది. ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇవన్నీ మీ కృషి మరియు సరైన నిర్ణయాల ఫలితమే. భవిష్యత్తులో మీరు మీ ఆర్థిక నిర్ణయాలు అదే విధంగా తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు పని ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. దీంతో మీరు ఈరోజు మీ మిగిలిన సమయాన్ని మీ ప్రియురాలితో గడపాలని కోరుకుంటారు. మీ ఇంట్లో శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మీ ప్రవర్తనను సక్రమంగా ఉంచుకోవాలి. అది ఇంట్లో అయినా.. బయట అయినా అందరితో మర్యాదగా ప్రవర్తించాలి. ఒకవేళ మీరు దురుసుగా ప్రవర్తిస్తే మీరు చాలా నష్టపోవచ్చు. ఉద్యోగులకు ఈరోజు పని విషయంలో స్వల్ప నిర్లక్ష్యం వల్ల పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. మీ శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మీరు భావిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ముఖ్యంగా శ్రామిక ప్రజలకు ఈరోజు పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఈరోజు పని భారం తేలికగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు సొంత ఇంటి గురించి కలలు కంటుంటే, ఈరోజు మీరు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. ఈరోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మొత్తం మీద, ఈ రోజు మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో విసుగు మరియు నీరసం ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీరు మీ భాగస్వామిని కలవలేరు. మీరు ఈ రోజు చాలా విచారంగా ఉంటారు. మరోవైపు కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం కూడా సాధారణంగా ఉంటుంది. అయితే, చాలా కాలం తరువాత, ఈ రోజు స్నేహితులతో కొంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయంలో అదృష్టం కలసి వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రేమ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరోవైపు పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. అయితే మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో అశాంతి ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు కొంత కోపం తెప్పించవచ్చు. ఈ రోజు మీరు మానసికంగా బలహీనంగా మరియు ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ రోజు మీ పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేరు. అయితే మీరు సన్నిహితుడి సహాయంతో పని చేస్తే, ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యాలయ పనిని పూర్తి చేయవచ్చు. ప్రేమ గురించి మాట్లాడితే, మీ భాగస్వామిని కలవడానికి మీకు అవకాశం రాదు. అటువంటి పరిస్థితిలో, మీ ఉత్సాహం తగ్గుతుంది. అయితే పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి రావచ్చు, కాబట్టి ఓపికపట్టండి. ఆర్థిక పరంగా కొంత మెరుగుదల ఉంటుంది. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 9, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Thursday, April 9, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more