For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (7-12-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మార్గశిర మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో లేదా స్నేహితులతో కొన్ని విషయాలలో విభేదాలు రావచ్చు. మీరు వారి భావాలను గౌరవించడం, మీరు వారిని ఆకట్టుకునేలా ప్రవర్తించడం మంచిది. ఈరోజు వివాహిత జంటలకు మంచి అనుభూతి కలుగుతుంది. మీ ప్రియమైన వారి హృదయపూర్వక మానసిక స్థితి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. బహుశా మీరు కొత్త ఆదాయ వనరులను పొందబోతున్నారు. మీరు వ్యాపారం చేస్తే, ఈ రోజు మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. ఏదైనా చట్టపరమైన విషయంలో మీరు ఈ రోజు విజయం పొందవచ్చు. మతపరమైన పనులపై మీ ఆసక్తి కూడా పెరుగుతుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఒక వింత పరిస్థితిని ఎదుర్కోవచ్చు. మీ ప్రవర్తన మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మీ పనులు ఆగిపోయేందుకు దారి తీస్తుంది. ఈ రోజు మీ వివాహ జీవితంలో ఉత్తమ రోజులలో ఒకటి. మీ భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో, మీరు ఏవైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగా ఉంటుంది. మీకు పెండింగులో ఉన్న డబ్బు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను కూడా పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచి రోజు. కానీ సరైన సలహా తీసుకుని ముందడుగు వేయాలి. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజు ప్రయాణానికి మంచిది కాదు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారి మొండి పట్టుదల వల్ల ఈరోజు కొత్త ఇబ్బందుల్లో పడొచ్చు. అటువంటి పరిస్థితులను నివారించడానికి, మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు వాదనలను నివారించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. మీరు మీ భాగస్వామికి ఇష్టమైన ప్రదేశంలో పిక్నిక్ కోసం కూడా వెళ్ళవచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. పాత వ్యాపార సంబంధాలు ఈ రోజు మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. సాయంత్రం, మీరు స్నేహితులతో కొంత సరదా సమయాన్ని గడపవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు ప్రతికూంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు మీ అధ్యయనానికి భంగం కలిగించవచ్చు. మీ కుటుంబంలో వివాదాలు ఉంటాయి. మీకు తల్లిదండ్రులతో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మీరు వారికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మీరే నష్టపోతారు. ఈ రోజు ఆర్థికంగా గొప్ప రోజు అవుతుంది. మీరు ఇటీవల ప్రారంభించిన ఏదైనా పని లేదా పెట్టుబడి నుండి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో ఈరోజు మీరు పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది. త్వరలో విదేశాలకు వెళ్లాలనే మీ కల కూడా నెరవేరవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఏదైనా విషయం గురించి చింతిస్తుంటే దాని ఆలోచించడం మానేయండి. ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రియమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఈ రోజు ఆఫీసులో మీ పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు కఠినంగా ఉంటుంది. మీ భాగస్వామిని బాగా చూసుకోండి లేకపోతే అది పెద్ద గొడవకు దారి తీయవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : లేత పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. వారి సొంత అభిప్రాయాలే కరెక్ట్ అని అనుకుంటారు. దీంతో కొన్ని విమర్శలను ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు సుదీర్ఘ భావోద్వేగ పోరాటం తర్వాత మానసిక శాంతిని అనుభవిస్తారు. మీరు డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ, స్నేహం మరియు బంధం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిని ఈరోజు ప్రజలు ప్రశంసిస్తారు. దీని ద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది. మానసికంగా మీరు బలంగా మరియు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవాలి. మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్లడం మానుకోండి. ఈ రోజు, మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో, ఎక్కువ పని ఉండదు. మీరు సహోద్యోగులతో సరదాగా గడపవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామి యొక్క మానసిక స్థితి మరింత శృంగార భరితంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అయితే ఈరోజు విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది. వీరు అధ్యయనాలపై దృష్టి పెట్టడం కష్టం. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులలో ఐక్యతను చూస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ తెలివితేటల ద్వారా అదనపు డబ్బు సంపాదించగలుగుతారు. మీరు సరదాగా నిండిన కార్యకలాపాలకు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి ఏవైనా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. మీ పనులన్నింటినీ మీరు సులభంగా నిర్వహించడాన్ని చూసి, మీ చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ప్రశంసించబడతారు. వైవాహిక జీవితంలో, మీ జీవిత భాగస్వామి నుండి మీరు ప్రతికూల అభిప్రాయాన్ని పొందవచ్చు. శృంగార జీవితంలో కూడా, మీరు కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. మీ భాగస్వామి కోపం మీ ఇద్దరి మధ్య వాదనలకు దారి తీయవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వివాహం అయిన వారికి వారి జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. మీరు వారితో మంచి పరస్పర బంధాన్ని కలిగి ఉంటారు. మీరు మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతిని కూడా కొనుగోలు చేయవచ్చు. శృంగార జీవితంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామితో సంబంధంలో దూరాన్ని తగ్గించేందుకు వారి భావాలను గౌరవించాలి. ఈరోజు రెండో భాగంలో ఇంటి వాతావరణం కొంచెం క్షీణిస్తుంది. అలాంటి సమయంలో మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. మీరు మీ పెద్దల నుండి సలహాలు తీసుకుంటే, మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ రోజు ఉపాధి అవకాశం లభించవచ్చు. సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు ఉద్యోగం రావచ్చు. కొన్ని అపార్థాలు వైవాహిక జీవితంలో ఉద్రిక్తతకు కారణమవుతాయి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ దృష్టికోణాన్ని మీ ముందు ఉంచండి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ముగిసినట్లు కనిపిస్తాయి. మీరు మీ పాత రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. ఈ రోజు మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలను రానీయొద్దు. మీరు మంచిగా భావిస్తే, ప్రతిదీ బాగుంటుంది. మీ ఖాళీ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు రూపొందించండి. ఈరోజు సాయంత్రం స్నేహితులతో సమావేశమయ్యే ప్రణాళిక ఉండవచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది, ఇది మీ ప్రధాన ఆందోళనను తగ్గిస్తుంది. వారికి మంచి సంరక్షణ అవసరం.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

English summary

Daily Horoscope December 7, 2019

Make your today organized and blissful by reading your daily horoscope and know what’s written in your fate today.
Story first published: Saturday, December 7, 2019, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more