సోమవారం మీ రాశిఫలాలు (03-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలపై శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు సమాజంలోని కొందరు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు ప్రేమలో ఉన్నవారికి చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఉత్సాహంతో ఉంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది. మీరు మీ ప్రియురాలితో చాలా శృంగారంగా గడుపుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువ ఖర్చు చేయడాన్ని తగ్గించుకోవాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని ప్రాంతంలో అభినందనలు మరియు గౌరవం లభిస్తాయి. వ్యాపారస్తులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు గొడవలు ఉండే అవకాశం ఉంది. మీరు ప్రశాంతతను కోరుకుంటే మీరు బాధ్యతాయుతంగా పని చేయాలి. ఆర్థిక పరంగా సమస్యలు కూడా పెరుగుతాయి. దీని వల్ల మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే బాాగా ఆలోచించాలి. మీ వివాహ జీవితంలోనూ మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందుతారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఈరోజు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు ఈరోజు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. తొలి చూపులోనే వారి వైపు ఆకర్షించబడవచ్చు. ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండొచ్చు. ఈ రోజు మీరు చేసే ప్రయాణం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు నిజమైన ప్రేమను అనుభవిస్తారు. మీరు ఈ రోజు కార్యాలయంలో శ్రద్ధగా పని చేయాలి. మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు శారీరకంగా కూడా కొంత బలహీనంగా ఉంటారు. ఈ రోజు మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కలహాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం లేకపోవడం వల్ల పెద్ద వివాదం ఉండొచ్చు. మీ వైవాహిక జీవితం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు మీ పని పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రోజు, మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు పెరగొచ్చు. అయితే ఈ రోజు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు, తల్లిదండ్రుల సహాయంతో, మీరు పెద్ద పనిని పూర్తి చేయవచ్చు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారతాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు గొప్పగా ఉంటాయి. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ బంధం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఏవైనా సవాళ్లను ఎదుర్కొంటే, మీ ప్రియమైన వారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు మీ కుటుంబసభ్యులతో చాలా సంతోషకరమైన రోజు గడుపుతారు. ఆర్థిక పరంగా స్నేహితుల సహాయంతో ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 10:45 గంటల వరకు

Story first published: Monday, February 3, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion