Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సోమవారం మీ రాశిఫలాలు (10-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు కొత్త శక్తిని పొందుతారు. ఈరోజు మీ విశ్వాసం బలంగా ఉంటుంది. మీకు సరైన ఫలితాలు వస్తాయి. పని ప్రదేశంలో ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. కష్టపడి పని చేయండి. కుటుంబం మరియు స్నేహితులతో కలిసి మీరు గొప్ప సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 11:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు కెరీర్ పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీరు ఈరోజు ఇబ్బందుల్లో ఉంటే,మీకు మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులు మీకు సహాయం చేయవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈరోజు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఒకరితో తొలి చూపులోనే ప్రేమలో పడే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కువ డబ్బును ఖర్చు చేయవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ జీవితంలో గొడవలు ఉంటాయి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మీ మనస్సులో అనేక రకాల ఆందోళనలు ఉంటాయి. అయితే, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. పని ప్రదేశంలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు శృంగార జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు విద్యార్థి అయితే మీరు ఈరోజు శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు కొద్దిగా కష్టం ఉంటుంది. కార్యాలయంలో ప్రతికూల కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయ. మీరు మానసికంగా ఈరోజు మంచి అనుభూతిని పొందుతారు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి రాత్రి 10:25 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటి. మీ ఆర్థిక ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ రోజు మీకు లభించే లాభం కూడా రాకపోవచ్చు లేదా వాయిదా పడొచ్చు. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలో విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి రోజు అవుతుంది. మీకు కుటుంబంలో ఈరోజు ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలు మీ సమతుల్య ప్రసంగాన్ని, మంచి లక్షణాలను ప్రశంసిస్తారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అయితే మీ పనిలో ఈరోజు బాగా ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కువ సమయం స్నేహితులతో సంతోషంగా నవ్వుతూ గడుపుతారు. ఇది మీకు మానసికంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే మీరు ఎలాంటి ఆర్థిక సమస్యను ఎదుర్కోరు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఇది మీ మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. కానీ, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా పని చేస్తారు. విశ్వాసం లేకపోవడం మిమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ ఆలోచనను ఆశాజనకంగా ఉంచడం మరియు పూర్తి ఉత్సాహం ఉంటే, మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికపరంగా అనుకూలంగానే ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10:10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు అభినందనలు మరియు గౌరవాలు అందుకుంటారు. మరోవైపు, వ్యాపారులు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబపరంగా కొంత ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని గొడవలు ఉండొచ్చు. ఈరోజు మీకు, మీ ప్రియమైనవారితో దూరం పెరుగుతుంది. ఈ రోజు చట్టపరమైన విషయాలకు మంచి రోజు కాదు. కోర్టు కోర్టుకు సంబంధించిన విషయం చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఈ రోజు మరింత ఇబ్బందులు పెరగవచ్చు. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 29
లక్కీ టైమ్ : ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు



Click it and Unblock the Notifications











