ఆదివారం మీ రాశిఫలాలు (16-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక మరియు విద్య వంటి విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రేమ విషయంలో తొందరపడకూడదు. మీ కదలికల పట్ల ఆలోచనాత్మకంగా ఉండాలి.

లక్కీ కలర్: పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీ బడ్జెట్ అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది మీ ప్రణాళికలను కూడా దెబ్బతీస్తుంది. రాబోయే సమయంలో మీరు ఈ రకమైన ఇబ్బందులను నివారించాలనుకుంటే, మీరు మీ ఖర్చులను సరిగ్గా ఉంచాలి. పనిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్: వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు వివాదస్పద సమస్యలపై మాట్లాడకపోవడమే మంచిది. ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మానసికంగా చాలా బాధపడతారు.

లక్కీ కలర్: రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు పూర్తి విశ్వాసంతో మీ పనులను పూర్తి చేస్తారు. మీ దీర్ఘకాల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరులను మెప్పించడానికి ఈరోజు మీరు మీ ప్రేమికులతో కలిసి బయటకు వెళతారు.

లక్కీ కలర్: లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు మీరు చాలా కాలంగా ఆందోళన చెందుతున్నఅటువంటి సమస్య నుండి బయటపడవచ్చు. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ పూర్వక ప్రవర్తన మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. అయితే మీ ఖర్చులను నియంత్రించాలి. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్: పింక్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు చేయడం కంటే ఎక్కువ ఆదా చేయడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు చాలా భావోద్వేగానికి లోనవుతారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. మీ విలువైన సమయాన్ని వృథా చేయవద్దు. విజయవంతం కావడానికి మీరు చాలా కష్టపడాలి. మీ మనస్సు నుండి ప్రతికూల ఆలోచనలను తొలగించండి.

లక్కీ కలర్: పసుపు

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 7 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెరుగుతున్న పనిభారం మరియు కుటుంబ బాధ్యతల మధ్య మీరు గందరగోళానికి గురవుతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ ప్రశాంతమైన మనసుతో ఈ సమస్యను పరిష్కరించాలి. అధిక ఒత్తిడితో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.

లక్కీ కలర్: బ్రౌన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ పని పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే, నిజాయితీగా పని చేయడం మంచిది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ పాత రోజుల జ్ఞాపకాలను పునరుద్ధరించడానికి మీ జీవిత భాగస్వామితో మీకు ఇష్టమైన స్థలాన్ని సందర్శించడానికి వెళ్ళవచ్చు.

లక్కీ కలర్: పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో కొన్ని గొడవలు ఉండొచ్చు. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి కొంత సమయం గడుపుతారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ తల్లిదండ్రులతో కొంత సమయం గడపండి. కొంతకాలంగా మీరు వారికి తగినంత సమయం ఇవ్వలేకపోయారు. వ్యాపారులకు ఈరోజు చాలా బాధగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఇంకా బలపడే అవకాశం ఉంటుంది.

లక్కీ కలర్: క్రీమ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి. ఈ రోజు జీవిత భాగస్వామి సహాయంతో, మీరు ఏదైనా పెద్ద ఇబ్బందుల నుండి బయటపడగలరు. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువగా ఖర్చులు చేయవచ్చు. మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్: పసుపు

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీ సమస్యలు పెరుగుతాయి. మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబ జీవితంలో కొంత సమస్యగా ఉంటుంది. ఇంటి సభ్యుడితో అభిప్రాయ భేదం ఉండొచ్చు. క్షేత్రంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు బాగుంటాయి. మీకు వారి పూర్తి మద్దతు లభిస్తుంది.

లక్కీ కలర్: కుంకుమ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుదల ఉంటుంది. ఈ రోజు మీకు అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం లభిస్తుంది. మీరు మీ కోసం భారీగా ఖర్చు చేయవచ్చు. ఈ రోజు మీరు మీ కుటుంబానికి కూడా బహుమతులు కొనుగోలు చేయవచ్చు. మీరు క్రొత్త ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లయితే, మీ తండ్రిని లేదా అనుభవజ్ఞుడైన ఇతర వ్యక్తిని సంప్రదించడం మంచిది. ఈ రోజు, మీరు వ్యక్తిగత జీవిత కష్టాల నుండి ఉపశమనం పొందడానికి మీకు ఇష్టమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు స్నేహితులతో సినిమా చూడటానికి వెళ్ళవచ్చు లేదా చక్కని రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలు తీసుకోవచ్చు.

లక్కీ కలర్: రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

Story first published: Sunday, February 16, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion