For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (25-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ రోజు మీరు అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశాన్ని పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది.మీరు ఈ రోజు విలువైన వస్తువు కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. ఈ రోజు మీరు మీ పనిని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకొని నడుస్తారు. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వారి వివాహ జీవితానికి చాలా ముఖ్యమైనది.పరస్పర అవగాహన మరియు సహనం సంబంధాన్ని విజయవంతం చేస్తాయి. మీరు దీన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకుపాత రుణాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఈరోజు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆదాయం లభించే అవకాశం ఉన్నప్పటికీ, మీరు డబ్బుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఈరోజు నష్టపోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు అవసరమైన మేరకు ఆలోచనాత్మకంగా నిర్ణయాలను తీసుకోండి. అయితే పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఈరోజుశృంగార జీవితం బాగుంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఆనందించండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ప్రతికూల చర్చల వల్ల మానసిక ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి మీరు ఈరోజు సాధ్యమైనంత వరకు సానుకూల ఆలోచనలను చేయండి. అనవసర విషయాల గురించి చింతించడంలో మీకు ఎలాంటి ప్రయోజనం లేదు.ఈ రోజు మీరు ఆశించిన ఫలితాలను మీరు పొందకపోవచ్చు. మానసిక శాంతి కోసం మీరు ఈ రోజు ఏ మత ప్రదేశాన్ని అయినా సందర్శించవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కొద్దిగా ఖర్చులు పెరగవచ్చు. దీని వల్ల మీరు ఎక్కువ ఆదా చేయలేరు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పనిలో గొప్ప అవకాశాన్ని పొందవచ్చు.ఈ రోజు మీరు రహదారిపై నడుస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగా ఉంటుంది. మీరు మానసికంగా శాంతిని అనుభవిస్తారు. వైవాహిక జీవితానికి చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మీరు మీ పని విషయంలో చాలా సరదాగా ఉంటుంది.మీరు మీ పనిని తీవ్రంగా పరిగణించాలి. మీరు నిరుద్యోగులైతే, ఈ రోజు మీకు గొప్ప అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే మీరు మంచి సలహాదారుడి సహాయం తీసుకోవాలి. ఇది మీకు చాలా సహాయపడుతుంది. పనిలో ఈరోజు కొంత నిరాశ ఉండవచ్చు. ఈరోజు మీరు కొన్ని విఫల ప్రయత్నాలు చేయవచ్చు. మీ తప్పుల నుండి మీరు గుణపాఠం నేర్చుకోవాలి. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొన్ని కారణాల వల్ల మీరు మీ భాగస్వామిని కలవలేకపోవచ్చు. పని విషయంలో ఈరోజు హడావుడిగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కానీ మీకు సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది, ఇది మీ పనిని సులభతరం చేస్తుంది..మీ ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా మీరు గొప్ప అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నత విద్యకు సంబంధించి ఓ శుభవార్తను వింటారు. మీకు మీ గురువుల మద్దతు కూడా లభిస్తుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడతారు.ఈ రోజు మీకు ఎటువంటి ఒత్తిడి ఉండదు. మీ పని తీరు కూడా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

లక్కీ కలర్ : వెండి

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి ఉదయం 10:25 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం పెరుగుదల వల్ల కొన్ని సమస్యలు పరిష్కార మవుతాయి. భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను పొందడానికి మీరు కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించినడబ్బును వృధా చేయకండి. ఈ రోజు వైవాహిక జీవితానికి కాస్త సవాలుగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:50 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్ వంటివి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, మీరు కొంత లాభం పొందవచ్చు. అంతేకాదు మీరు కొంత పెద్ద పెట్టుబడి కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీకుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈరోజు చాలా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఒత్తిడి వల్ల మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు.ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. వారితో ఎక్కువ సమయం గడపండి. పని విషయంలో ఈరోజు కష్టంగా ఉంటుంది. మీరు మీ ప్రతికూల ఆలోచనలను అధిగమించే వరకు మీరు జీవితంలో ముందుకు సాగలేరు. మీరు మీ ప్రియమైన వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచాలనుకుంటే, మీరు మీ ప్రవర్తనను సమతుల్యంగా ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11:20 గంటల వరకు

English summary

Daily Horoscope February 25, 2020

Read your daily horoscope to get all the information related to your fate today. Let's see what the stars have in store for you.
Story first published:Tuesday, February 25, 2020, 0:31 [IST]
Desktop Bottom Promotion